అన్వేషించండి
Kalki Actress: కల్కిలో విలన్స్‌తో పోరాడి చనిపోయిన 'కైరా' ఎవరు.. - ఆమె గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?
ప్రభాస్ కల్కిలో కాంప్లెక్స్ విలన్‌తో ధైర్యంగా పోరాడిన కైరా పాత్ర ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంటుంది. దీపికాను రక్షించే క్రమంలో విలన్ చేతిలో మరణించిన కైరా అసలు పేరు, ఆమె గురించి ఈ విషయాలు తెలుసా?

Image Credit: benanna_love/Instagram
1/8

Kalki Actress Anna Ben Photos:'కల్కి 2898 AD' సినిమాలో అతిథి పాత్ర లిస్ట్ చాలా పెద్దది. ప్రతి సన్నివేశంలోనూ ప్రముఖ నటులే ఉన్నారు. ప్రతి ఒక్కరిది ప్రత్యేకమైన పాత్రే.
2/8

ఇలా సినిమా మొదటి నుంచి ఎండింగ్ వరకు నాగ్ అశ్విన్ ఆడియన్స్‌కి సర్‌ప్రైజ్ ఇస్తూనే ఉన్నాడు. అలా ఎన్నో పాత్రలు కల్కిలో ఎదురయ్యాయి. అలా వచ్చిన పాత్రలో కైరా ఒకటి.
3/8

ఇందులో లీడ్ రోల్ దీపికాను కాంప్లెక్స్ నుంచి రక్షించేందుకు రెబల్స్ అంతా ఒక్కటయ్యారు. ఈ క్రమంలో దీపికా పదుకొనె రక్షించే రెబల్స్‌లో కైరా పాత్ర ఒకటి. ఇందులో కాంప్లెక్స్ మనుషులతో ధైర్యంగా పోరాడిన ఆమె పాత్ర ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది.
4/8

దీంతో ఇప్పుడు కైరా పాత్రలో నటించిన ఆమె గురించి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఆమె అసలు పేరు అన్నా బెన్. ఈమే మలయాళ నటి. ఆమె కొచ్చిలోని సెయింట్ థెరిసా కాలేజీలో ఫ్యాషన్ డిజైనింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేసింది.
5/8

చదువుతూనే సినీరంగ ప్రవేశం చేసింది. మలయాళం స్క్రీన్ రైటర్ బెన్నీ నయరాంబలం కూతురైన అన్నా బెన్ మాలీవుడ్‌లో పలు చిత్రాల్లో నటించింది. ఇప్పుడు 'కల్కి 2898ఏడి' సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యింది.
6/8

2019 లో 'కుంభ నంగి నైట్స్' అనే మలయాళం సినిమాతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. ఆ తర్వాత 'హెలెన్' అనే చిత్రంలో నటించిన గుర్తింపు పొందింది.
7/8

ఈ మూవీ సక్సెస్‌లో మాలీవుడ్‌లో అన్నా బెన్ పేరు మారుమోగింది. ఈ చిత్రంలో ఉత్తమ నటి పలు అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత కప్పేలా చిత్రంలో నటించిన నటిగా మంచి గుర్తింపు పొందింది.
8/8

ఇదే సినిమాను తెలుగులో 'బుట్టబొమ్మ'గా రీమేక్ చేశారు. ఇలా వరుసగా మలయాళంలో సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న అన్నా బెన్ ఇప్పుడు పాన్ వరల్డ్ కల్కి చిత్రంలో పవర్ఫుల్ క్యారెక్టర్‌లో నటించి నేషనల్ వైడ్‌గా గుర్తింపు పొందింది.
Published at : 28 Jun 2024 02:59 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
క్రికెట్
సినిమా
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion