Ola Electric Scooter: ఓలా సంస్థ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్లు విడుదల కానున్నాయని తెలియగానే వీటికి చెందిన ప్రతీ న్యూస్ సంచలనంగా మారుతోంది. స్కూటర్ టీజర్, అడ్వాన్స్ బుకింగ్స్, వాటి రంగులు, ఫీచర్లు... ఇలా ప్రతీది హాట్ టాపిక్‌గా నిలుస్తోంది.
స్కూటర్ల కలర్స్ మీదైతే లీకులు ఓ రేంజ్‌లో హల్‌చల్ చేశాయి. ఇవిగో ఓలా స్కూటర్లు అంటూ పలువురు సోషల్ మీడియాలో ఫొటోలు కూడా షేర్ చేశారు. ఈ ఊహాగానాలకు తెర దించుతూ ఓలా ప్రకటన చేసింది.
తమ సంస్థ నుంచి త్వరలో విడుదల కానున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు పది రంగుల్లో ఉండనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించి సంస్థ సీఈవో భవీష్ అగర్వాల్ ఓ వీడియోను పంచుకున్నారు. 'వాట్స్ యువర్ కలర్.. ఐ వానా నో..' అని సాగే పాట థీమ్‌ను దీనికి యాడ్ చేశారు. బ్లాక్, వైట్, రెడ్, ఎల్లో, బ్లూ, పర్పుల్, పింక్, గ్రే సహా మొత్తం పది రంగుల్లో ఓలా స్కూటర్లు రానున్నట్లు తెలిపారు.
వాహనాల కొనుగోలులో కూడా ఓలా కొత్త పంథాను అనుసరించనున్నట్లు తెలుస్తోంది. స్కూటర్‌ని బుక్ చేసుకున్న కస్టమర్ల ఇంటికి నేరుగా హోం డెలివరీ ఇచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు లీకులు అందుతున్నాయి.
ఎలక్ట్రిక్ బైక్స్ కోసం అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభించింది. ఈ స్కూటర్‌కు బుకింగ్ ఫీజుగా రూ.499 చెల్లించాలని తెలిపింది. అడ్వాన్స్ బుకింగ్‌ను ప్రారంభించిన 24 గంటల్లోనే రికార్డు స్థాయిలో లక్ష మంది రిజర్వ్ చేసుకున్నారు.
ఈ స్కూటర్ల కోసం దేశవ్యాప్తంగా 400 పట్టణాల్లో హైపర్ చార్జర్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని సంస్థ ప్రకటించింది. ఓలా సిరీస్ S, S1, S1 ప్రో అనే మూడు పేర్లతో వేరియంట్లు రాబోతున్నట్లు తెలిసింది.
ఓలా స్కూటర్ గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని కలిగి ఉంటుంది. దీని ధర రూ.లక్ష నుంచి రూ. 1.2 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.
ఇన్నొవేటివ్ డిజైన్‌తో వచ్చేసిన టెస్లా సైబర్ ట్రక్ - మస్క్ మామ ఎంత రేటు ఫిక్స్ చేశాడంటే?
ఎట్టకేలకు రెనో డస్టర్ కొత్త వెర్షన్ రివీల్ - లుక్స్, ఫీచర్లు అదుర్స్!
టైగున్, వర్ట్యూస్ సౌండ్ ఎడిషన్లు లాంచ్ చేసిన కంపెనీ - ఎలా ఉన్నాయో చూశారా?
హ్యుందాయ్ టక్సన్ కొత్త మోడల్ ఎలా ఉందో చూడండి!
షావోమీ ఫోన్ చూసుంటారు - మరి షావోమీ కారు చూశారా? కిర్రాక్ డిజైన్‌తో - లాంచ్ ఎప్పుడు?
Janagama ZP Chairman Died: జనగామ జడ్పీ చైర్మన్ సంపత్ రెడ్డి మృతి, బీఆర్ఎస్ పార్టీలో విషాదం
Telangana State Corporation Chairmans: తెలంగాణ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ల ముకుమ్మడి రాజీనామాలు, సీఎస్ కు లేఖ
Telangana CLP Meeting: ముగిసిన తెలంగాణ సీఎల్పీ భేటీ- ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపిక బాధ్యత అధిష్ఠానానికి అప్పగిస్తూ తీర్మానం
Hyundai Price Hike: 2024లో పెరగనున్న హ్యుందాయ్ కార్ల ధరలు - ఎందుకు పెరగనున్నాయి? ఎంత పెరగనున్నాయి?
/body>