బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరాన్ని దాటింది. వరుసగా రెండు అల్పపీడనాలు ఏర్పడిన ప్రభావం ఏపీ, తమిళనాడును కుదిపేశాయి.
భారీ వర్షాల వల్ల తిరుమలలో రూ. 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని.. తిరుమల, తిరుపతిలో కురిసిన వర్షాలు గత 30 ఏళ్లలో ఎప్పుడూ కురవలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.
భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఇప్పటికే నెల్లూరు-ముంబయి హైవే వరద నీటిలో మునిగిపోగా.. తాజాగా నెల్లూరు - విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది.
శ్రీవారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశారు.
ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో ఇప్పటివరకూ 24 మంది చనిపోయారని అధికారులు చెబుతున్నారు.
సహాయ చర్యల్లో పాల్గొనేందుకు నెల్లూరుకు వచ్చిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ లోని ఓ కానిస్టేబుల్ వరద నీటిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన జిల్లాలోని బుచ్చి మండలం దామరమడుగు వద్ద జరిగింది.
కడప- కమలాపురం మార్గంలో పాపాగ్ని బ్రిడ్జికి ప్రమాదం పొంచి ఉంది. ఈ వంతెన ఏ క్షణంలో నైనా కుప్పకూలే ప్రమాదం ఉంది. బ్రిడ్జి వద్ద పరిస్థితులను పోలీసులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే నిర్వహించావరు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా ప్రభావిత ప్రాంతాల్లో విహంగ వీక్షణం ద్వారా పరిస్థితి సమీక్షించారు.
వేలాది మంది ఆశ్రయం కోల్పోగా.. పలు జిల్లాల్లో ఇళ్లల్లో వరద నీరు నిలిచిపోయింది.
తిరుమల పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు ఆహారం, తాగునీటి కోసం స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Kangana Ranaut at Tirumala today: తిరుమలలో కంగనా రనౌత్, విష్ణు మంచుకు ఎందుకు థాంక్స్ చెప్పారంటే?
In Pics: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వసంతోత్సవాలు, చూసి తరించండి
In Pics : రేపటి నుంచి తిరుమలలో పద్మావతి పరిణయోత్సవాలు
Pawan Kalyan In Kurnool: ఓర్వకల్లు ఎయిర్పోర్టులో పవన్ కళ్యాణ్కు ఘనస్వాగతం, అటునుంచి శిరివెళ్లలో రచ్చబండకు జనసేనాని
In Pics : తిరుమలలో శోభాయమానంగా కోదండరాముడి పుష్పయాగం
Rajiv Gandhi Assassination Case: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీం సంచలన తీర్పు- 31 ఏళ్ల తర్వాత పెరరివలన్ రిలీజ్
AB Venkateswararao : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ఎత్తివేత
ఊరేగింపులో వరుడు, అతడు వచ్చేసరికి వేరే వ్యక్తిని పెళ్లాడిన వధువు
Sheena Bora murder Case: షీనా బోరా హత్య కేసు అప్డేట్- ఇంద్రాణి ముఖర్జీకి బెయిల్