By: Ram Manohar | Updated at : 28 May 2023 02:38 PM (IST)
ఢిల్లీలో రెజ్లర్లకు మద్దతు తెలిపిన ఆందోళనకారులకు, పోలీసులకు ఘర్షణ తలెత్తింది.
Wrestlers Protest:
ఢిల్లీలో ఉద్రిక్తత
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఢిల్లీ పోలీసులు, ఆందోళన కారుల మధ్య ఘర్షణ తలెత్తింది. నిరసనకారులంతా ఒక్కసారిగా కొత్త పార్లమెంట్‌వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. బారికేడ్లు తొలగించారు. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడే వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఫలితంగా...అక్కడి వాతావరణం వేడెక్కింది. సాక్షి మాలిక్‌ని పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై బజ్‌రంగ్ పునియా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "మమ్మల్నందరినీ కాల్చి పారేయండి" అంటూ మండి పడ్డారు. పార్లమెంట్ వద్ద శాంతియుత నిరసన చేపట్టాలని భావించినా...పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చిన వెంటనే ఆందోళనకారులు బారికేడ్లు ఎక్కారు. తాము ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తుంటే అనవసరంగా అలజడి సృష్టించారని ఆరోపిస్తున్నారు. "మహిళా పంచాయత్" పేరిట నిరసన కార్యక్రమంగా చేపట్టగా రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. WFI చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
"ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ కొత్త పార్లమెంట్‌ని ప్రారంభిస్తున్నారు. మరో వైపు ప్రజాస్వామ్యాన్ని అణిచివేస్తున్నారు. ఢిల్లీ పోలీసులు మాకు మద్దతు తెలిపిన వారిని అరెస్ట్ చేశారు. వెంటనే వాళ్లందరినీ విడుదల చేయాలి. మేం పోరాడేది మా ఆత్మగౌరవం కోసం"
- బజ్‌రంగ్ పునియా, రెజ్లర్
#WATCH | Mahapanchayat will certainly be held today. We're fighting for our self-respect.They're inaugurating the new Parliament building today, but murdering democracy in the country.We appeal to the administration to release our people detained by police: Wrestler Bajrang Punia pic.twitter.com/VI4kGLxGWV
— ANI (@ANI) May 28, 2023
This is how our champions are being treated. The world is watching us! #WrestlersProtest pic.twitter.com/rjrZvgAlSO
— Sakshee Malikkh (@SakshiMalik) May 28, 2023
అటు ఢిల్లీ పోలీసులు మాత్రం అన్ని చోట్లా భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతు సంఘాలు కూడా రెజ్లర్లకు మద్దతు తెలిపాయి. వాళ్లు కూడా వస్తే పరిస్థితులు అదుపు తప్పుతాయని భావించిన పోలీసులు ముందస్తుగానే జాగ్రత్త పడ్డారు. ఢిల్లీ సరిహద్దులోనే కొన్ని వాహనాలను ఆపేశారు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
#WATCH | Security tightened near Singhu border area; Khap panchayat leaders, farmers to join protesting wrestlers' march to new parliament house in Delhi today. pic.twitter.com/X3lvACK99n
— ANI (@ANI) May 28, 2023
ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద రెజ్లర్ల ఆందోళన కొనసాగుతోంది. బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేస్తున్న రెజ్లర్లు..న్యాయం జరిగే వరకూ అక్కడి నుంచి కదలమని స్పష్టం చేశారు. అయితే...కేంద్రం మాత్రం దీనిపై పెద్దగా స్పందించడం లేదు. కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ "కమిటీ వేస్తాం" అని చెప్పినా ఆ నిర్ణయంతో న్యాయం జరగదు అని బాధితులు తేల్చి చెబుతున్నారు. ఇప్పటికే వీరి నిరసనలకు పలు సంఘాలు మద్దతునిచ్చాయి. ఇప్పుడు యోగ గురు రామ్ దేవ్ బాబా కూడా వీళ్లకు సపోర్ట్ ఇస్తున్నట్టు ప్రకటించారు. బ్రిజ్ భూషణ్‌పై అంత తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. అలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
Also Read: New Parliament: ఇది కేవలం భవనం కాదు, ప్రజాస్వామ్యానికి మందిరం - ప్రధాని మోదీ
PM Modi News: శంషాబాద్ విమానాశ్రయానికి మోదీ, హెలికాప్టర్‌లో పాలమూరుకు - ప్రధాని ప్రసంగంపై ఆసక్తి
చీపురు పట్టి ఊడ్చిన ప్రధాని మోదీ, స్వచ్ఛతా హీ సేవాలో భాగంగా గంటపాటు శ్రమదానం
Minister Kakani: దమ్ముంటే మోదీ ముందు కంచాలు మోగించండి - కాకాణి వ్యాఖ్యలు
టర్కీ పార్లమెంట్‌కి సమీపంలో ఆత్మాహుతి దాడి, మంత్రి ఆఫీస్ గేట్ బయటే ఘటన
TSSPDCL Jobs: విద్యుత్ సంస్థల్లో 670 ఉద్యోగాల భర్తీకి త్వరలో నోటిఫికేషన్, మంత్రి జగదీశ్ రెడ్డి వెల్లడి
ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక్క పోస్ట్‌కి 3 కోట్లు తీసుకునే బాలీవుడ్ సెలబ్రిటీ ఎవరో తెలుసా?
MLA Anil: నారాయణ సత్య హరిశ్చంద్రుడా? ఆయన అరెస్ట్ ఖాయమే - మాజీ మంత్రి అనిల్
BRS Politics: చంద్రబాబు అరెస్టుపై రూటు మార్చేసిన బీఆర్ఎస్ అగ్రనేతలు, సీమాంధ్ర ఓటర్ల ఎఫెక్టేనా ?
Tollywood - AP Elections 2024 : టీడీపీ, జనసేనకు 'జై' కొడుతున్న టాలీవుడ్?
/body>