Worlds Most Expensive Eggs: ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్లు ఇవే, ఒక్క గుడ్డు ధర 78 కోట్లు!
Worlds Most Expensive Eggs: ప్రపంచంలోని అత్యంత ఖరీదైన ఈ గుడ్ల గురించి చాలా మందికి తెలియదు. ఒక గుడ్డు ధర ఏకంగా 78 కోట్లు అంటే ముక్కును వేలేస్కోకుండా ఉండలేరు మరి.
Worlds Most Expensive Eggs: సాధారణంగా ఓ గుడ్డు ధర నాలుగు రూపాయల నుంచి 8 రూపాయల వరకు ఉంటుంది. కోడి, బాతు, నాటు కోడి, ఆస్ట్రిచ్ ఇలా ఒక్కో గుడ్డుకు ఒక్కో ధర ఉంటుందన్న విషయం మన అందరికీ తెలిసిందే. సాధారణంగా సామాన్య ప్రజలు తెల్ల గుడ్లు తింటారు. దీని ధర 5 రూపాయల నుంచి 10 రూపాయల వరకు ఉంటుంది. మరోవైపు కొంచెం డబ్బు ఉన్నవారు లేత గులాబీ రంగులో ఉండే దేశీ గుడ్లను తింటారు. ఈ గుడ్డు ధర 20 రూపాయల నుంచి 25 రూపాయల వరకు ఉంటుంది. అయితే మీరు ఇప్పటి వరకూ కనీ వినీ ఎరగని గుడ్ల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ గుడ్లను ఎక్కువ మంది వినియోగిస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా వినియోగించే వాటిలో ఈ గుడ్లు మొదటి స్థానంలో ఉంటాయి. ఈ గుడ్లు కొనడానికి చాలా మంది ఇష్ట పడుతుంటారు. ఈ గుడ్ల కోసం ఎన్ని డబ్బులు అయినా ఖర్చు చేసేందుకు వెనకాడరు. అది కోట్లలో ఉన్నా ఏమాత్రం ఆలోచించకుండా కొనేస్తుంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ ఒక్క గుడ్డు ధర 78 కోట్లు.
ప్రపంచంలో అత్యంత ఖరీదైన గుడ్డు ఏది?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గుడ్డు రోత్‌స్ చైల్డ్ ఫాబెర్జ్ ఈస్టర్ ఎగ్స్. ఈ గుడ్డు ధర 9.6 మిలియన్ డాలర్లు. అది భారతీయ రూపాయిలలోకి మారితే అక్షరాలా రూ.78 కోట్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం ఈస్టర్ గుడ్డుపై అనేక రకాల వజ్రాలు పొదగబడి ఉంటాయి. అలాగే దీనిపై బంగారు కవచంతో కప్పబడి ఉంటుంది. ఈ గుడ్డు తినడానికి కాదు.. కేవలం అలంకరించడానికి మాత్రమే ఉపయోగిస్తారు. అంటే ఇది కృత్రిమ గుడ్డు.
మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ రెండవ స్థానంలో ఉంది..!
మిరాజ్ ఈస్టర్ ఎగ్స్ ధర 8.4 మిలియన్ డాలర్లు. అంటే భారతీయ రూపాయల్లోకి మారిస్తే దాదాపు 69 కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. 18 క్యారెట్ల బంగారంతో చేసిన ఈ గుడ్డుపై 1000 వజ్రాలు పొదిగి ఉంటాయి. ఈ గుడ్డును చూస్తే మీ ముందు ఓ పెద్ద వజ్రం మెరిసిపోతున్నట్లు అనిపిస్తుంది.
మూడవ స్థానంలో డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్
డైమండ్ స్టెల్లా ఈస్టర్ ఎగ్స్ ధర దాదాపు రూ.82 లక్షలు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈస్టర్ గుడ్లలో ఇది కూడా ఒకటి. 65 సెంటీ మీటర్ల పొడవున్న ఈ గుడ్డు కొనాలంటే మీ ఇల్లు, పొలాన్ని విక్రయించాల్సి ఉంటుంది. ఈ గుడ్డు చాక్లెట్ లాగా ఉంటుంది. కానీ దీనిపై కూడా వజ్రాలు, బంగారం పొదగబడి ఉంటుంది.