ఇంటర్నెట్ స్పీడ్‌లో చైనా సరికొత్త రికార్డ్, సెకన్‌కి 150 సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చట
China Internet Speed: సెకన్‌కి 1.5TB బ్యాండ్‌విడ్త్‌తో ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని చైనా లాంఛ్ చేసింది.
China's Internet Speed:
చైనా ఇంటర్నెట్ స్పీడ్..
ఇంటర్నెట్ స్పీడ్‌లో చైనా రికార్డు (China Internet Speed) సృష్టించింది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సెకన్‌కి 1.2 టెరాబైట్‌ల డేటాని (1.2 Terabits per Second) ట్రాన్స్‌ఫర్ చేస్తుందని ప్రకటించింది చైనా. South China Morning Post వెల్లడించిన వివరాల ప్రకారం..ప్రస్తుతమున్న ఇంటర్నెట్ స్పీడ్‌కి ఇది 10 రెట్లు ఎక్కువ. Tsinghua Universityతో పాటు Huawei Technologies, చైనా మొబైల్, Cernet Corporation కలిసి ఈ నెట్‌వర్క్‌ని రూపొందించాయి. బీజింగ్, వూహాన్, గాంగ్వా...ఇలా మొత్తంగా 3 వేల కిలోమీటర్ల మేర ఆప్టికల్ ఫైబర్ కేబ్లింగ్ సిస్టమ్‌తో ఈ నెట్‌వర్క్ కవర్ చేయనుంది. ప్రపంచంలోనే అతి పెద్ద ఇంటర్‌నెట్ నెట్‌వర్క్‌లన్నీ సెకన్‌కి 100 GB డేటాని ట్రాన్స్‌మిట్ చేసేలా రూపొందించుకున్నాయి. అగ్రరాజ్యం అమెరికా కూడా ఇటీవలే 5G ఇంటర్నెట్‌ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సెకన్‌కి 400GB డేటా ట్రాన్స్‌మిట్ చేస్తుంది ఈ నెట్‌వర్క్. ఇప్పుడీ రికార్డులను బద్దలు కొట్టింది చైనా.
టెస్ట్‌లన్నీ సక్సెస్..
Future Internet Technology Infrastructureలో భాగంగా ఈ నెట్‌వర్క్‌ని రూపొందించుకుంది. దాదాపు పదేళ్లుగా ఇదే పనిలో ఉంది డ్రాగన్ దేశం. ఈ ఏడాది జులైలోనే ఈ నెట్‌వర్క్‌ని యాక్టివ్ చేసినప్పటికీ అధికారికంగా నవంబర్ 13న ప్రారంభించారు. ఆపరేషనల్ టెస్ట్‌లన్నీ సక్సెస్ అయిన తరవాత నెట్‌వర్క్‌ని లాంఛ్ చేసింది. ఈ నెట్‌వర్క్ ఎంత రిలయబుల్‌గా ఉంటుందో చెప్పడానికి హువావే టెక్నాలజీస్ వైస్‌ప్రెసిడెంట్ ఓ ఉదాహరణ చెప్పాడు.
"ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ఇంటర్‌నెట్ నెట్‌వర్క్ ఇది. సెకన్‌కి 1.2TBల డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే సెకన్‌కి 150 HD మూవీస్‌ని బ్రౌజ్ చేసుకునేంత స్పీడ్ ఈ నెట్‌వర్క్ సొంతం"
- హువావే టెక్నాలజీస్ వైస్‌ప్రెసిడెంట్
అంతా చైనాలోనే..
ఇకపై మరింత వేగవంతమైన ఇంటర్నెట్ నెట్‌వర్క్‌ని తయారు చేసుకునేందుకు ఇదో ఉదాహరణగా నిలిచిపోతుందని చెబుతున్నారు ఈ ప్రాజెక్ట్‌లోని ఎక్స్‌పర్ట్స్. సూపర్‌ఫాస్ట్ ట్రైన్ ఎంత వేగంగా అయితే దూసుకుపోతుందో..అంతే వేగంగా ఈ నెట్‌వర్క్‌లో డేటా ట్రాన్స్‌ఫర్ అవుతుందని వివరిస్తున్నారు. ఈ సిస్టమ్‌కి సంబంధించిన సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అంతా చైనాలోనే తయారవడం మరో స్పెషాల్టీ.
భారత్‌లో ఇలా..
జియో, ఎయిర్‌టెల్ భారతదేశంలో వేగవంతమైన 5జీ రోల్‌అవుట్‌లో నిమగ్నమై ఉన్నాయి. రెండు కంపెనీలు భారతదేశంలోని అనేక నగరాల్లో 5జీని ప్రారంభించాయి. దేశంలో 5జీ నెట్‌వర్క్ సర్వీసు రోల్ అవుట్ వేగం పుంజుకోవడంతో సగటు మొబైల్ ఇంటర్నెట్ స్పీడ్ పరంగా భారతదేశం ప్రపంచ ర్యాంకింగ్‌లో మరింత పైకి చేరుకుంది. ఊక్లా నివేదిక ప్రకారం, భారతదేశం స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్‌లో మార్చిలో 64వ స్థానంలో ఉంది. కానీ ఏప్రిల్‌లో అది 60వ స్థానానికి చేరుకుంది. నివేదిక ప్రకారం ఏప్రిల్ 2023లో భారతదేశ మొబైల్ డేటా వేగం 115 శాతం పెరిగింది. ఏప్రిల్‌లో సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం 36.35 Mbpsతో పురోగతిని నమోదు చేసింది. మార్చిలో సగటు మొబైల్ డౌన్‌లోడ్ వేగం 33.30 Mbpsగా ఉంది.
Also Read: Gaza News: ఉక్రెయిన్‌కి వెళ్లాల్సిన అమెరికా ఆయుధాలు దారి మళ్లింపు! నేరుగా ఇజ్రాయేల్‌కి?