Hot air balloon football: భూమి ఆకాశం మధ్యలో ఫుట్ బాల్ - చూస్తే వావ్ అనాల్సిందే ! వీడియో
Football: ప్రపంచంలో మొదటిసారి 1800 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది. రష్యన్ ధైర్యవంతుడు సెర్గేయ్ బాయిట్సోవ్ వరల్డ్ రికార్డు సృష్టించాడు.

World first hot air balloon football match: ప్రపంచంలో మొదటిసారి 1800 మీటర్ల ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్‌కు బిగించిన ప్లాట్‌ఫామ్‌పై ఫుట్‌బాల్ మ్యాచ్ జరిగింది.* రష్యన్ ఎక్స్‌ట్రీమ్ అథ్లెట్ సెర్గేయ్ బాయిట్సోవ్ నేతృత్వంలో ఈ అసాధారణ స్టంట్‌ను నిర్వహించారు. డిసెంబర్ 1న జరిగిన ఈ మ్యాచ్‌లో ఆకాశంలోనే గోల్ సాధించారు.
The world's first hot air balloon football match at an altitude of 1800 meters.
— Viral Vibes (@x_viral_vibes) December 2, 2025
📹sergeyboytcov pic.twitter.com/j2ALsRSyqy
రష్యాలో ఈ ఫీట్ జరిగింది. 1800 మీటర్లు అంటే సుమారు 5900 అడుగుల ఎత్తులో ఎత్తులో హాట్ ఎయిర్ బెలూన్‌ను ఉపయోగించి, దానికి కట్టించిన చిన్న ప్లాట్‌ఫామ్‌పై ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడారు. ఈ ప్లాట్‌ఫాం తాళ్లతో బెలూన్‌కు బిగించారు. క్రీడాకారులు పూర్తి ఫుట్‌బాల్ యూనిఫాం, ప్యారాచ్యూట్ల బ్యాగ్‌లు ధరించి ఆడారు. మ్యాచ్‌లో స్ప్రింటింగ్, ట్యాక్లింగ్, పాసింగ్‌లు జరిగాయి. ఒక గోల్ సాధించిన తర్వాత, స్కోరర్ ప్లాట్‌ఫాం నుంచి దూకి, ఆకాశంలోనే రొనాల్డో స్టైల్‌లో సెలబ్రేషన్ చేశాడు. ఈ సన్నివేశాన్నివిమానం ద్వారా రికార్డు చేశారు.
🔥Soccer In The Clouds : Russian Athlete Plays Soccer 5900 Ft Above Ground 🇷🇺
— RT_India (@RT_India_news) December 3, 2025
Adrenaline-fueled footage shows the group boldly passing the ball above the clouds while a plane circles them to capture the stunt!
"We set a new world record. The world's first hot air balloon… pic.twitter.com/lqpSUvimR2
సెర్గేయ్ బాయిట్సోవ్ గ్రావిటీ-డిఫైయింగ్ స్టంట్‌లకు ప్రసిద్ధుడైన రష్యన్ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లూయెన్సర్. 1500 మీటర్ల ఎత్తులో ఏరియల్ జిమ్నాస్టిక్స్, 2450 మీటర్లలో బాక్సింగ్, టేబుల్ టెన్నిస్ వంటి ఫీట్లు చేశాడు. ప్రపంచంలో మొదటి హాట్ ఎయిర్ బెలూన్ ఫుట్‌బాల్ మ్యాచ్ 1800 మీటర్ల ఎత్తులో అని ప్రకటించింది మేము కొత్త వరల్డ్ రికార్డు సృష్టించామని సంతోషం వ్యక్తం చేశాడు.
Russian extreme athlete Sergey Boytsov organized and played this first-ever soccer match suspended from a hot air balloon at an altitude of 1,800 meters or 5,900 feet.
— Fascinating True Stories (@FascinatingTrue) December 3, 2025
To ensure their safety while sprinting and tackling in the sky, the players wore full football kits equipped… pic.twitter.com/cnhU9ie8lX
బాయిట్సోవ్ ఈ ఈవెంట్‌ను వరల్డ్ రికార్డు గా ప్రకటించినప్పటికీ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయితే, సోషల్ మీడియా, మీడియా రిపోర్టుల్లో మొదటిసారి గా పేర్కొంటున్నారు. బాయిట్సోవ్ ముందుగా ఇలాంటి హై-అల్టిట్యూడ్ స్పోర్ట్స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఫాలోవర్లను ఆకర్షిస్తున్నాడు.




















