అన్వేషించండి

America Iran Islamabad Talks: అమెరికా- ఇరాన్ శాంతి చర్చలు పాకిస్తాన్‌లోనే ఎందుకు జరుగుతున్నాయి? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటీ?

America Iran Islamabad Talks: ప్రపంచాన్ని వదిలి పెట్టి ఇరాన్‌తో చర్చలకు పాకిస్తానే అమెరికా ఎందుకు ఎంచుకుంది? ఇది చాలా మందిలో వస్తున్న అనుమానం. దీని వెనుక షాకింగ్ స్టోరీ ఉంది. 

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆఫ్ఘనిస్థాన్‌లో గత అనుభవం అమెరికాకు విశ్వాసాన్ని కల్పించింది.
America Iran Islamabad Talks: అమెరికా, ఇరాన్ మధ్య శాంతికి సంబంధించిన ఒక ముఖ్యమైన సమావేశం పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్‌లో జరుగుతోంది. ఈ శాంతి చర్చల కోసం ఇరాన్ ప్రతినిధి బృందం, అమెరికా ప్రతినిధి టీం ఇప్పటికే పాకిస్తాన్‌ చేరుకుంది. ఇరాన్ బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్‌ బఘేర్‌ ఘాలీబాఫ్‌ లీడర్‌. అమెరికా బృందానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాయకత్వం వహిస్తున్నారు. ప్రపంచ దేశాల దృష్టి ఈ సమావేశంపై ఉంది. అయితే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఉండగా వివాదాలకు, అలజడులకు కారణమైన పాకిస్తాన్‌లో చర్చలు జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. అసలు దీని వెనుక ఉన్న కారణాలు చూద్దాం. 

పాకిస్తాన్‌ ను ఎందుకు ఎంచుకున్నారు?

ఇరాన్, అమెరికా తమ శాంతి చర్చల కోసం పాకిస్తాన్‌ను ఎంచుకోవడంతో ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. యుద్ధానికి త్వరగా ముగింపు పలకాలని పాకిస్తాన్‌కు ఈజిప్ట్, టర్కీ, సహాయం చేస్తున్నాయి. కాల్పుల విరమణ కోసం కూడా ట్రంప్, పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్‌, ఆర్మీ చీఫ్‌ అసమ్‌ మునీర్‌ పేర్లను ప్రస్తావించారు. కాబట్టి ఇజ్రాయెల్‌ భారత్‌కు శత్రువైన పాకిస్తాన్ ఈ చర్చలు కేంద్ర బిందువుగా ఎలా ఉంటుంది? ఇది  చర్చలకు దారి తీసింది. అయితే పశ్చిమ ఆసియాలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడానికకి ఒక పెద్ద ఎత్తుగడ వేసే క్రమంలో ఇరాన్, అమెరికాలతోపాటు ఇజ్రాయెల్‌కు మిత్ర దేశంగా ఉన్నప్పటికీ ట్రంప్ భారత్‌ను పక్కన పెట్టారు. ఈ యుద్ధంలో  చైనా, రష్యాల నుంచి బలమైన మద్దతును ఇరాన్ పొందింది. 
 
అయితే ఇందులో భారత్ ఎక్కడా కనిపించలేదు. అందువల్ల ఇంతటి సున్నితమైన చర్చలో పాకిస్తాన్ కేంద్ర బిందువుగా మారింది. ఇస్లామాబాద్‌లో శాశ్వత అమెరికా రాయబారిరి లేనప్పటికీ ట్రంప్‌ పాకిస్తాన్‌పై నమ్మకం ఉంచారు. మార్చి 21 నుంచి ఇరాన్ ప్రతిఘటనతో ట్రంప్ ఆందోళన చెందుతున్నారు. ఆయన ఇరాన్‌ను బెదిరిస్తూనే ఉన్నారు. అయితే మరోవైపు ఆయన నిరంతరం పాకిస్తాన్‌పై ఒత్తిడి  తెస్తూ చర్చలకు ఇరాన్‌ను ఒప్పించారనే వాదన బలంగానే ఉంది. ఇరాన్ ప్రతిఘటనను ట్రంప్ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా అమెరికా ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న తరుణంలో ఇజ్రాయెల్, నేతన్యాహు ఒత్తిడి కారణంగా ట్రంప్ తీవ్ర  నష్టాన్ని ఎదుర్కొన్నారు. 

శాంతి చర్చలకు పాకిస్థాన్ ఎందుకు?

పాకిస్తాన్‌కు అమెరికాతో చిరకాల సంబంధాలు ఉన్నాయి. అదే సమయంలో పొరుగు దేశంగా ఇరాన్‌తో కూడా సంబంధాలను కొనసాగిస్తోంది. గత కొద్ది రోజులుగా అమెరికా, ఇరాన్ నాయకులను పదే పదే సంప్రదించం ద్వారా పాకిస్తాన్ సైన్యాధిపతి జనరల్ అసిమ్ మన్నీర్‌ ఈ చర్చలు సులభతరం చేయడంలో కీలక పాత్ర పోషించారు. 

పాకిస్తాన్‌లో అధిక షియా జనాభా 

ప్రపంచంలో ఇరాన్ తర్వాత పాకిస్తాన్‌లోనే రెండో అతి పెద్ద షియా జనాభా ఉంది. దీని  వల్ల ఇరాన్‌కు అక్కడ ఒకరకమైన సాంస్కృతిక, మతపరమైన అనుబంధం ఉన్నట్టు అనిపిస్తోంది. మధ్యప్రాచ్యంలోని ఇతర దేశాలతో పోలిస్తే పాకిస్తాన్‌లో అమెరికా సైనిక స్థావరాలు లేవు. ఇది ఇరాన్‌కు సురక్షితంగా, నిష్పక్షపాతంగా ఉన్నట్టు అనిపించేలా చేస్తుంది. ఇరాన్, పాకిస్తాన్ 900 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును పంచుకుంటున్నాయి. పొరుగు దేశం కావడం వల్ల ఇరాన్ అక్కడికి చేరుకొని చర్చలు జరపడం సులభం. 

ఈ పర్యటనకు చారిత్రక ప్రాముఖ్యత 

ఈ పర్యటన అమెరికా దౌత్య చరిత్రలో అనేక రికార్డులను బద్దులు కొడుతోంది. 2011లో అప్పటి ఉపాధ్యక్షుడు జో బైడెన్ పాకిస్తాన్‌లో పర్యటించారు. 15 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్ గడ్డపై అడుగు పెట్టారు. 2006లో జార్జ్ డబ్ల్యూ బుష్‌ తర్వాత ఏ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్‌లో పర్యటించలేదు.  
ప్రస్తుతం పాకిస్తాన్‌లో ఉన్న శాశ్వత అమెరికా రాయబారి ఎవరూ లేరు. ఇలాంటి సమయంలో ఒక ఉపాధ్యక్షుడు నేరుగా అక్కడికి వెళ్లి చర్చలు జరపడం యుద్ధ తీవ్ర అర్థమవుతుంది. 

మధ్యవర్తిగా విశ్వసనీయత 

ఇరాన్‌కు ఇజ్రాయెల్‌ బద్ద శత్రువు కాగా, భారత్‌ అమెరికాకు వ్యూహాత్మ భాగస్వామి. ఇటువంటి పరిస్థితుల్లో ఇరాన్ భారత్‌కు కానీ, ఇజ్రాయెల్ ను కానీ పూర్తి విశ్వసించడం కష్టం. పాకిస్తాన్ ఒక ముస్లిం దేశం కావడం వల్ల ఇరాన్‌కు అక్కడ చర్చలు జరపడం మానసికంగా దౌత్యపరంగా సులభం. 

పాకిస్తాన్ ఇరాన్‌పై చైనా ప్రభావం 

ఇరాన్, పాకిస్తాన్ రెండింటిపై కూడా చైనా ప్రభావం ఉంది. గతంలో సౌదీ అరేబియా, ఇరాన్‌ల మధ్య చైనా విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించింది. ఈ చర్చల వెనుక చైనా అంగీకారం, మద్దతు ఉండి ఉండవచ్చు. దాని వల్లే పాకిస్తాన్‌లో ఈ చర్చలు జరగడం సులభమైంది. 

ట్రంప్ డీల్ మేకర్ వ్యూహం 

ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకోవడంలో ప్రసిద్ధి చెందారు. ఈ ప్రక్రియలో పాకిస్తాన్‌ను చేర్చడం ద్వారా ట్రంప్, దక్షిణాసియాలో అధికార సమతుల్యతను కాపాడుకోవాలని కోరుకుంటున్నారు. అంతేకాకుండా, అమెరికాకు, పాకిస్తాన్‌పై భారీ రుణ భారం, సైనికంగా ఆధారపడటం ఉన్నందున, చర్చలను విజయవంతం చేయడానికి అమెరికా పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురాలగలదు. 

ఆఫ్ఘనిస్థాన్ అనుభవం 

గతంలలో అమెరికా, తాలిబాన్ల మధ్య పలు చర్చలకు పాకిస్తాన్ విజయవంతంగా మధ్యవర్తిత్వం వహించింది ఈ అనుభవం దృష్ట్యా, ఇరాన్‌ను చర్చల టేబుల్ వద్దకు తీసుకురావడంలో పాకిస్తాన్ ప్రభావం సమర్థవంతంగా ఉంటుందని అమెరికా భావించింది.

ఇజ్రాయెల్ భద్రత

ఈ చర్చలు ఇజ్రాయెల్‌లో జరిగి ఉంటే ఇరాన్ కఠినమైన వైఖరి గల నాయకుల దానిని అంగీకరించేవారు కాదు. ఇజ్రాయెల్ నేరుగా ఘర్షణల్లోకి లాగగుండా, తెర వెనుక నుంచి అమెరికా ప్రయోజనాలను కాపాడటమే ట్రంప్ ప్రధాన లక్ష్యం. 
 

Frequently Asked Questions

ఈ పర్యటనకు అమెరికా దౌత్య చరిత్రలో ప్రాముఖ్యత ఏమిటి?

15 ఏళ్ల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్తాన్‌లో పర్యటించడం, 2006 తర్వాత ఏ అమెరికా అధ్యక్షుడు పాకిస్తాన్‌లో పర్యటించకపోవడం దీని చారిత్రక ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 
Breaking News: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కలిసిన మంత్రి నారాయణ.. రాజధాని ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి ఆహ్వానం
Breaking News: బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ
బుధవారం ఉదయం వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జగన్ కీలక భేటీ

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Petrol-Diesel Windfall Tax: పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
పెట్రోల్‌పై రూ. 3.50, డీజిల్‌పై రూ. 1.50 మేర విండ్‌ఫాల్ పన్ను తగ్గింపు! అర్ధరాత్రి కేంద్రం ప్రకటన!
Telugu Movies OTT : ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో పల్సర్ బైక్ రమణ మూవీ సడన్ స్ట్రీమింగ్ - మరో కామెడీ మూవీ కూడా... ఎందులో చూడొచ్చంటే?
Brezza vs Venue EMI Comparison: Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Brezza vs Venue EMIల మధ్య తేడా ఏంటి? పూర్తి వివరాలు తెలుసుకోండి!
Chandrababu Naidu: అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో కీలక పరిణామం! చంద్రబాబు, నారాయణకు భారీ ఊరట!
Komatireddy Rajgopal Reddy vs Mahesh Kumar Goud: తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
తెలంగాణ కాంగ్రెస్‌లో రాజగోపాల్ రెడ్డి కామెంట్స్ రచ్చ! పీసీసీ చీఫ్‌ సీరియస్ వార్నింగ్!
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
Embed widget