66 మంది చిన్నారులు మృతి - భారత్ దగ్గుమందు తయారీ సంస్థకు డబ్ల్యూహెచ్‌వో వార్నింగ్
WHO News: గాంబియాలో 66 మంది పిల్లలు మరణానికి కారణమైందని ఆరోపణలు ఎదుర్కొంటున్న భారతీయ కంపెనీ దగ్గు సిరప్‌పై దర్యాప్తు జరుగుతోందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
మైడెన్ ఫార్మాస్యూటికల్స్ ఆఫ్ ఇండియా తయారు చేసిన దగ్గు, జలుబు సిరప్‌లు డైథలిన్ గ్లైకాల్, ఇథిలిన్ గ్లైకాల్ ప్రజల ప్రాణాలకు ప్రమాదమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) బుధవారం ప్రకటించింది. వార్తా సంస్థ రాయిటర్స్ నివేదించిన ప్రకారం గాంబియాలో 66 మంది పిల్లలు మరణించిన తర్వాత డబ్ల్యూహెచ్‌ఓ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది.
"నాలుగు ఉత్పత్తుల నుంచి నమూనాలు ప్రయోగాశాలలో పరీక్షిస్తే... డైథలీన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్‌లో ఆమోదయోగ్యం లేని పదార్థాలు కలిగి ఉందని నిర్ధారిస్తుంది" అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన హెచ్చరికలో తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ మాట్లాడుతూ... గాంబియాలో గుర్తించిన నాలుగు కలుషిత ఔషధాల అంశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక జారీ చేసింది. ఇది మూత్రపిండాలను పాడుచేస్తుంది. 66 మంది పిల్లల మరణాలకు సంబంధించింది. ఈ చిన్నారుల మృతి వారి కుటుంబ సభ్యులకు తీరని లోటు. అని అన్నారు.
"WHO has today issued a medical product alert for four contaminated medicines identified in #Gambia that have been potentially linked with acute kidney injuries and 66 deaths among children. The loss of these young lives is beyond heartbreaking for their families"-@DrTedros
— World Health Organization (WHO) (@WHO) October 5, 2022
ఇతర దేశాలకు హెచ్చరిక
భారతదేశంలోని మైడెన్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేసే దగ్గు, జలుబు సిరప్‌లపై విచారణ సాగుతోంది. కలుషితమైన ఉత్పత్తులు ఇప్పటి వరకు గాంబియాలో మాత్రమే గుర్తించారు. ఆ సిరప్‌లు ఇతర దేశాలకు పంపిణీ చేసి ఉండొచ్చు. రోగులకు మరింత హాని కలగకుండా నిరోధించడానికి ఈ ఉత్పత్తులు గుర్తించి సరఫరా ఆపేయాలని ప్రపంచ ఆరోగ్యం సంస్థ సిఫార్సు చేసింది.
"While the contaminated products have so far only been detected in The #Gambia, they may have been distributed to other countries. WHO recommends all countries detect and remove these products from circulation to prevent further harm to patients"-@DrTedros https://t.co/ENnBpIBVpF
— World Health Organization (WHO) (@WHO) October 5, 2022