(Source: ECI/ABP News/ABP Majha)
Foam Beer: బీరులో నురగ ఎంత శాతం ఉండాలి? పరిశోధనలు ఏం చెప్తున్నాయి?
Foam Beer: ఒక గ్లాసులో బీర్ పోస్తే అందులో నురుగు వస్తుందని మీరందరూ చూసే ఉంటారు. అయితే బీరులో ఫోమ్ ఎంత ఉండాలో, ఆరోగ్యానికి ఈ ఫోమ్ ఎంత ముఖ్యమో తెలుసా?
What Is The Use Of Foam In Beer : ఒక గ్లాసులో బీర్ పోస్తే అందులో నురుగు వస్తుందని మీరందరూ చూసే ఉంటారు. అయితే బీరులో ఫోమ్ ఎంత ఉండాలో, ఆరోగ్యానికి ఈ ఫోమ్ ఎంత ముఖ్యమో తెలుసా? ఆల్కహాల్ ఒక్కొక్కరు ఒక్కో పద్దతిలో తాగుతారు. ఉదాహరణకు కొందరు సీసాతో బీరు తాగితే, మరికొందరు గ్లాసులో పోసుకుని తాగుతారు. మీరు గమనించినట్లయితే, ఒక గ్లాసులో బీరు పోసినప్పుడు, అందులో నురుగు ఏర్పడటం మీరు చూసే ఉంటారు కదా! నురగే కదా అయితే ఏంటి అనుకోకండి. ఒక గ్లాసులో ఎంత ఫోమ్ ఉండాలి అనే విషయంతోపాటు ఈ ఫోమ్ ఎంత ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకుంటే అశ్చర్యపోవటం మీ వంతు అవుతుంది.
బీర్ బాటిల్‌లో ఉండే కార్బన్ డయాక్సైడ్ కారణంగా బీర్‌లో నురుగు ఏర్పడుతుంది. బీర్ బాటిల్ లేదా డబ్బా మూత తెరిచినప్పుడల్లా గ్యాస్ బయటకు వచ్చే శబ్దం వినబడటం మీరు గమనించే ఉంటారు. ఇది కార్బన్ డయాక్సైడ్ కారణంగా జరుగుతుంది. బీరు సీసా తెరిస్తే గ్యాస్ బయటకు వస్తుంది. ఇది నురగగా మనకు కనిపిస్తుంది.
ఈ నురగ చాలా ఉపయోగకరం
నురగ రాకుండా గ్లాసును వంచి బీరు పోయడం మీరు చాలాసార్లు చూసి ఉంటారు. దీని కారణంగా నురుగు పూర్తిగా అదృశ్యమవుతుంది. అయితే, ఇది శరీరానికి మంచిది కాదు. 'బబుల్ ఫ్రీ బీర్' అంటే నురుగు లేని బీర్, కడుపులోకి ప్రవేశించిన తర్వాత కూడా CO2 విడుదల చేస్తూనే ఉంటుంది. దీని కారణంగా, కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అలా కాకుండా నరుగ వచ్చిన తర్వాత బీర్ తాగితే దీని ప్రభావం తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతారు. బీర్‌లో నురగ మంచిదని భావించడానికి ఇదే కారణం.
బీరులో ఎన్ని బుడగలు ఉంటాయి
బీరులో బుడగలు లెక్కపెట్టడమంటే తలపై వెంట్రుకలు లెక్కపెట్టినట్లే. అయితే, ఫ్రాన్స్‌లోని యూనివర్శిటీ ఆఫ్ రెమస్ క్యాంపాగ్నే ఎర్డెన్‌కు చెందిన ప్రొఫెసర్ గెరార్డ్ లిగర్ బిల్లైర్ ఒక గ్లాసు బీర్‌లో ఎన్ని బుడగలు ఉన్నాయో లెక్కించారు. అంతే కాదు, షాంపైన్ గ్లాస్‌లో బుడగలను లెక్కించమని కూడా తన సహోద్యోగులకు చెప్పారు. 1 గ్లాసు షాంపైన్‌లో సుమారు 1 మిలియన్ బుడగలు ఉన్నాయని అతను చెప్పాడు. క్లారా సిలిండర్ తో కలిసి బుడగలను లెక్కించారు. ఒక గ్లాసు బీరులో రెండు మిలియన్ బుడగలు ఉంటాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. కొంత సమయం తర్వాత ఇవి ఆగిపోయినా.. ఎక్కువ బుడగలున్న బీర్ రుచి ఎంతో బాగుందని, బీర్‌లో బుడగలు, నురుగు చాలా ముఖ్యమైన భాగమని పరిశోధనలో వెల్లడైంది.
బబుల్స్ అధ్యయనం మరింత అవసరం
తన పరిశోధనలో, గెరార్డ్ బీర్ చరిత్ర 13 వేల సంవత్సరాల నాటిదని చెప్పాడు. ఏటా దాదాపు 200 బిలియన్ లీటర్ల బీరు ఉత్పత్తి అవుతున్నట్టు తెలిపారు. బుడగలు, నురుగు ఇందులో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కూడా పేర్కొన్నారు. బబుల్స్‌ను బాగా అధ్యయనం చేస్తే బీరు రుచిని మరింతగా పెంచవచ్చని తెలిపారు. గోధుమ, నీరు, ఈస్ట్, హాప్‌లను కలిగి ఉన్న నాలుగు వస్తువుల నుంచి బీర్ తయారు అవుతుంది.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.