Zoo Orangutan : ప్లీజ్.. వదిలెయ్ మరోసారి దగ్గరకు రాను ! "జూ"లో ఈ సీన్ చూస్తే పొట్టచెక్కలవ్వాల్సిందే
జూలో ఒరెంగూటన్‌తో ఆటలాడే ప్రయత్నం చేసిన వ్యక్తిని ఆ జీవి ఏం చేసిందంటే ?
Zoo Orangutan : జంతు ప్రదర్శన శాలకు వెళ్తే చాలా మంది మూగ జీవాలతో కాస్త అనుచితంగా ప్రవర్తిస్తారు. దీనికి కారణం అవేమీ చేయలేవనే ఓ ధైర్యం. ఎందుకంటే ఎక్కువగా అవి బోనుల్లో ఉంటాయి. కానీ కొంత మంది మాత్రం ఆకతాయిలు ఉంటారు. బోను దగ్గరకు వెళ్లి వెకిలి వేషాలు వేస్తూంటారు. అలాంటి వారు ఆ జంతువులు ఒక్కోసారి షాకిస్తూ ఉంటాయి. చాలా సార్లు సీరియస్‌గా ఉంటాయి వాటి చర్యలు. కానీ కొన్ని సార్లు మాత్రం సూపర్ కామెడీగా ఉంటాయి. అవి చేసినవి చూస్తే.. వారికి అలా జరగాల్సిందే అంటారు.
someone said this is the sound of the dude farting now i can’t unhear it pic.twitter.com/8IOya1WuvY
— san (@sundaykisseu) June 7, 2022
న్యూయార్క్ కోర్టులో బొద్దింకల దండయాత్ర- కేసు వాయిదా వేసి అంతా పరార్!
ఇలాంటి ఓ పోకిరి ఓ జూలో ఒరెంగుటాన్ ఉన్న బోనుకు అతిదగ్గరగా వెళ్లాడు. దానితో ఆటలాడేందుకు ప్రయత్నించాడు. దగ్గరగా వెళ్లడం.. పట్టుకోవడానికి ప్రయత్నిస్తే దూరంగా వెళ్లడం వంటివి చేశాడు. ఈ ఆటలో ఓ సారి అతని చొక్కను ఒరెంగుటాన్ పట్టేసుకుంది. అంతే..ఇక వదిలి పెట్టలేదు.
టొమోటో కెచప్ దొరకడం కష్టమే! డెన్మార్క్ పరిశోధకుల ఆసక్తికరమైన అంశాలు
అతను ఎంత విదిలించుకుందామని ప్రయత్నించినా వదల్లేదు. ముందు చొక్కా పట్టుకుంది. తర్వాత కాలు దొరకబుచ్చుకుంది. ఎంత ప్రయత్నించినా వదల్లేదు. మరో వ్యక్తి వచ్చి.. ఒరెంగుటాన్‌ను భయపెట్టే ప్రయత్నం చేశారు కానీ.. అది వదల్లేదు. గగ్గోలు పెట్టి ఏడుస్తూంటే చివరికి ఒరెంగుటూన్ అతడిని వదిలేసింది. ఈ వీడియో చూసినవారంతా పగలబడి నవ్వుతున్నారు.
Soon as that gorilla grip was put on that white shirt:pic.twitter.com/VBKEF26Bew
— Houston’s Very Own (@YoItsKenneth) June 7, 2022
ఓ వైపు యుద్ధం, మరోవైపు వినోదం- కీవ్ థియేటర్‌లో షోలు హౌస్‌ఫుల్!
32 సెకన్ల నిడివిగల వీడియో ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియోను చూసిన వాళ్లు ఇంకోసారి జూ కు వెళ్లినప్పుడు జంతువుల జోలికి వెళ్లరని వాటితో ఆటలాడరని .. సెటైర్లు వేస్తున్నారు.
భారత్‌కు ఉగ్రవాద సంస్థ అల్‌ఖైదా వార్నింగ్- కీలక నగరాల్లో దాడులు చేస్తామని లేఖ