New York Courtroom: న్యూయార్క్ కోర్టులో బొద్దింకల దండయాత్ర- కేసు వాయిదా వేసి అంతా పరార్!
New York Courtroom: న్యూయార్క్‌లోని ఓ కోర్టులో వందల సంఖ్యలో బొద్దింకలు దాడి చేశాయి. దీంతో కేసును వాయిదా వేసి న్యాయమూర్తి సహా అందరూ పారిపోయారు.
New York Courtroom: ఒక్కొక్కరి నిరసన ఒక్కొక్క రకంగా ఉంటుంది. అయితే అమెరికా న్యూయార్క్‌లో ఓ మహిళ తన నిరసనను వింతగా తెలియజేసింది. న్యూయార్క్ కోర్టులో ఓ కేసు విచారణ సందర్భంగా ఆమె చేసిన పనికి అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. ఇంతకీ ఆమె ఏం చేసిందో తెలుసా?
బొద్దింకల దాడి
న్యూయార్క్‌లో ఓ మహిళను స్థానికంగా గొడవలు చేసిందనే కారణంతో పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అల్బానీ నగరంలోని కోర్టులో హజరుపర్చారు. కోర్టులో విచారణ జరుగుతోంది. ఆరోపణలు, ప్రత్యారోపణలు జరుగుతున్నాయి. ఇందులో ఆ మహిళ తనపై వ్యతిరేక వాదనలే ఎక్కువగా వస్తున్న విషయాన్ని గమనించి కోపంతో ఊగిపోయింది.
Hundreds Of "Hissing Cockroaches" Released During Rent Protest Inside New York State Courtroom [VIDEO] - https://t.co/DjUqj0qswt pic.twitter.com/c01bouarTE
— JoeMyGod (@JoeMyGod) June 8, 2022
ఇంకేముంది తెలిసిన వారితో డబ్బాల నిండా బొద్దింకలను కోర్టుకు తెప్పించుకుంది. అదును చూసి కోర్టులో వాటిని వదిలేసింది. నిమిషంలో కోర్టు హాల్ మొత్తం బొద్దింకలతో నిండిపోయింది. ఏకంగా వందల సంఖ్యలో బొద్దింకలు రావడంతో కేసును వాయిదా వేశారు.
Andy Vermaut shares:New York Courtroom Shut Down After Hundreds Of Cockroaches Released: A New York courtroom was the site of hundreds of cockroaches scurrying on the floors with proceedings coming to a halt on Tuesday. https://t.co/IUaVrJtCKP Thank you. pic.twitter.com/xUQj2V04fq
— Andy Vermaut (@AndyVermaut) June 9, 2022
కోర్టు మూసేశారు
బొద్దింకలను తరిమేందుకు పొగపెట్టాలని అధికారులు నిర్ణయించారు. దీంతో కోర్టును కూడా మూసివేశారు. మహిళ చర్య కారణంగా కోర్టు కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయం ఏర్పడింది. ఇదంతా మహిళ కావాలని చేసిన పనిగా బయటపడింది. దీంతో కోర్టు ఆమె చేసిన పనిని తీవ్రంగా పరిగణించింది. దీంతో ప్రస్తుతం ఆమెను పోలీసులు కస్టడీలోనికి తీసుకొని ఈ ఘటపై విచారిస్తున్నారు.
Also Read: India's First Sologamy Marriage: సోలోగా సోలోగమీ మ్యారేజ్- వరుడు తప్ప ఇక్కడ అన్నీ ఉంటాయ్!
Also Read: Weather Update: రుతుపవనాల రాకలో ఆలస్యం లేదు- 2 రోజుల్లో ఇక దంచుడే దంచుడు: IMD