అన్వేషించండి

Vladimir Putin: 'మా జోలికొస్తే తరిమికొడతాం'- విక్టరీ డే పరేడ్‌లో పుతిన్ వార్నింగ్

Vladimir Putin: మాతృభూమిని కాపాడటం కోసమే ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.

Vladimir Putin: రష్యా విక్టరీ డే సందర్భంగా ఉక్రెయిన్‌ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. ఉక్రెయిన్ మాతృభూమిని కాపాడటం కోసమే ఈ యుద్ధం చేస్తున్నట్లు పుతిన్ పేర్కొన్నారు. రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ డే సందర్భంగా పుతిన్ ప్రసంగించారు.

" ఉక్రెయిన్‌లో పశ్చిమ దేశాల దురాక్రమణను నివారించేందుకే ఈ ప్రత్యేక సైనిక చర్య చేపట్టాం. ఉక్రెయిన్ సమగ్రత, భద్రతను కాపాడేందుకు రష్యా బలగాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. నియో నాజీలతో పొంచి ఉన్న ముప్పు నుంచి 'మాతృభూమి'ని రక్షించుకోవడం కోసమే ఉక్రెయిన్‌లో రష్యా సేనలు పోరాడుతున్నాయి.                                                                          "
-  వ్లాదిమిర్ పుతిన్, రష్యా అధ్యక్షుడు

విక్టరీ డే

రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీ ఓటమికి గుర్తుగా రష్యాలో ప్రతి ఏటా  మే 9న 'విక్టరీ డే' పేరుతో భారీగా ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా మాస్కోలని రెడ్‌ స్క్వేర్‌ వద్ద పరేడ్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన రష్యన్‌ సైనికులకు ఆయన నివాళులర్పించారు.

అర గంటలో

రష్యా విక్టరీ డే వేడుకల వేళ ఆ దేశ నేతల వ్యాఖ్యలు ప్రపంచాన్నే కలవర పెడుతున్నాయి. తాజాగా రష్యా అంతరిక్ష సంస్థ రోస్కోస్మోస్ చీఫ్ దిమిత్రి రోగోజిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము కనుక అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ కేవలం అరగంటలో పూర్తిగా ధ్వంసమైపోతాయని ఆయన హెచ్చరించారు.

శత్రువు (పశ్చిమ దేశాలు)ను ఓడించడమే పుతిన్ లక్ష్యం. నాటో మాపై అనవసరంగా కయ్యానికి కాలు దువ్వుతోంది. మేం కనుక అణు యుద్ధం ప్రారంభిస్తే నాటో దేశాలన్నీ అర గంటలోనే ధ్వంసమైపోతాయి. మాకు ఆ సామర్థ్యం ఉన్నప్పటికీ ప్రస్తుతానికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే అణు యుద్ధం కారణంగా ప్రపంచ పరిణామాలతో పాటు భూమి వాతావరణమే మారిపోతుంది. అది మాకు ఇష్టం లేదు. అందుకే శత్రువును ఆర్థిక, సైనిక చర్యలు, సంప్రదాయ యుద్ధాలతోనే ఓడిస్తాం.                                       "
-దిమిత్రి రోగోజిన్‌, రష్యా స్పేస్ ఏజెన్సీ చీఫ్
 
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Kalvakuntla Kavitha: అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
అదానీకో న్యాయం..ఆడబిడ్డకో న్యాయమా - మోదీపై కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
Adani Group Statement:  అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
అమెరికా కోర్టులో కేసు ఆరోపణలన్నీ అవాస్తవం, తిరస్కరిస్తున్నాం - అదానీ గ్రూప్ ప్రకటన
Diksha Divas: తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా ఈ నెల 29న 'దీక్షా దివస్' - పార్టీ శ్రేణులకు కేటీఆర్ పిలుపు
Nara Lokesh : ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
ఏపీలో బిచ్చగాళ్ల మాఫియా - బెగ్గింగ్ ముఠాల్లో పిల్లలే సమిధలు - నారా లోకేష్ ఆదేశాలతో గుట్టు రట్టు
Embed widget