Rajapaksa Resigns: శ్రీలంక ప్రధాని రాజీనామా- ప్రజా డిమాండ్‌కు తలొగ్గిన రాజపక్స

Rajapaksa Resigns: మహిందా రాజపక్స శ్రీలంక ప్రధాని పదవికి రాజీనామా చేశారు.

FOLLOW US: 

Rajapaksa Resigns: శ్రీలంక ప్రధాని మహింద రాజపక్స తన పదవికి రాజీనామా చేశారు. ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో నిరసనలు హోరెత్తుతున్నాయి. రాజపక్స రాజీనామా చేయాలని ప్రజలు చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆయన ఎట్టకేలకు రాజీనామా చేశారు.

ప్రతిపక్షం నో

శ్రీలంకలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్స చేసిన ప్రతిపాదనను ప్రధాన ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ(ఎస్‌జేబీ) తిరస్కరించింది. తాత్కాలిక ప్రభుత్వానికి నాయకత్వం వహించాల్సిందిగా పార్టీ అధ్యక్షుడు సాజిత్‌ ప్రేమదాసను కోరుతూ రాజపక్స చేసిన ప్రతిపాదనను తిరస్కరించినట్లు ఎస్‌జేబీ ఇటీవల ప్రకటించింది.

నిరసన పర్వం

శ్రీలంకలో సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాని మహింద రాజపక్స కారణమంటూ వారు పదవి నుంచి వైదొలగాలని కొన్ని రోజులుగా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు ప్రజలు కూడా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు.

ఈ నిరసనలతో శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతుండడంతో అధ్యక్షుడు గొటబాయ ఇటీవల రెండు సార్లు ఎమర్జెన్సీ ప్రకటించారు. శ్రీలంకలో పరిస్థితులు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఆహార, ఇంధన, ఔషధాల కొరతపాటు విదేశీ మారకద్రవ్యాల నిల్వలు కరిగిపోతుండడంతో శ్రీలంక అల్లాడుతోంది. దానికి తోడు ప్రతిపక్షాలు అధికార పక్షంపై రోజురోజుకూ ఒత్తిడి పెంచుతున్నాయి.

రాజపక్స రాజ్యం

శ్రీలంకను ఆర్థిక సంక్షోభం పూర్తిగా చుట్టుముట్టింది. దేశం రుణఊబిలో చిక్కుకోవడంతో పాటు నిత్యావసర వస్తువులు, రవాణాకు కీలకమైన పెట్రో ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. రాజపక్సల కుటుంబం దేశాన్ని దారుణంగా దోపిడి చేసిందని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. దాని ఫలితంగానే శ్రీలంక దివాలా తీసిందని విమర్శిస్తున్నారు.

శ్రీలంక హంబన్‌టొటకు చెందిన రాజపక్స కుటుంబం 1947 నుంచి రాజకీయాల్లో చురుగ్గా ఉంటోంది. 2019 అధ్యక్ష ఎన్నికల్లో శ్రీలంక పోడుజన పెరమున(శ్రీలంక పీపుల్స్‌ ఫ్రంట్‌)కు చెందిన గొటబయ రాజపక్స గెలుపొందిన అనంతరం ఆయన కుటుంబంలోని వారికే కీలక మంత్రి పదవులు దక్కాయి. ఆయన సోదరులు చమల్‌ రాజపక్స, బసిల్‌ మంత్రులుగా, మాజీ అధ్యక్షుడు మహీంద రాజపక్స ప్రధానిగా పనిచేశారు.

గతంలోనూ మహీంద రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. మహీంద ఇద్దరు కుమారులైన నమల్‌, యోషితాలకు కీలకమైన పదవులు దక్కాయి. రాజపక్స కుటుంబీకులు నిర్వహించే మంత్రిత్వ శాఖలకే బడ్జెట్‌లో 75 శాతం వరకు నిధులు కేటాయించడం మరిన్ని విమర్శలకు తావిచ్చింది.

Also Read: Srilanka Financial Crisis Explained: లీటరు పెట్రోల్ 250..కిలో పాలపొడి 1400..| ABP Desam

Also Read: Arjuna Ranatunga About Srilanka Situation:శ్రీలంకలో గడ్డు పరిస్థితులకు ప్రభుత్వ విధానాలే కారణం

Published at : 09 May 2022 03:59 PM (IST) Tags: Mahinda Rajapaksa Sri Lanka crisis Sri Lanka Economic Crisis Mahinda Rajapaksa Resigns Rajapaksa

సంబంధిత కథనాలు

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Monkeypox: ప్రపంచ దేశాలకు డేంజర్ బెల్స్- మంకీపాక్స్‌పై WHO స్ట్రాంగ్ వార్నింగ్!

Australia Elections: ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్ పరిపాలనకు తెర- కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

Australia Elections: ఆస్ట్రేలియాలో కన్జర్వేటివ్ పరిపాలనకు తెర- కొత్త ప్రధానికి మోదీ శుభాకాంక్షలు

Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!

Covid 19 in North Korea: ఉత్తర కొరియాలో కరోనా విలయతాండవం- ఒక్కరోజులో లక్షా 86 వేల కేసులు!

PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు

PM Modi Japan visit: జపాన్‌లో మోదీ సుడిగాలి పర్యటన- 40 గంటల్లో 23 సమావేశాలు

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, నేడు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

CM KCR : బీజేపీని ప్రశ్నిస్తే దేశద్రోహులు అనే ముద్ర, కేంద్రంపై సీఎం కేసీఆర్ ఫైర్

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Moto G52j: మోటొరోలా కొత్త ఫోన్ వచ్చేసింది - అదిరిపోయే ఫీచర్లు - ఫోన్ ఎలా ఉందో చూశారా?

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Amit Shah In Arunachal Pradesh: రాహుల్ బాబా ఆ ఇటలీ కళ్లద్దాలు తీస్తే అన్నీ కనిపిస్తాయి: అమిత్ షా

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో - ఎవరికంటే?

Jio Free Data: ఉచితంగా డేటా, కాల్స్ అందిస్తున్న జియో  - ఎవరికంటే?