జింక రక్తంతో స్నానం చేస్తున్న వ్లాదిమిర్ పుతిన్ ! వాకింగ్ స్టైల్ మారింది - అంతుచిక్కని వ్యాధే కారణమా ?
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ జింకల కొమ్ముల నుంచి సేకరించిన రక్తంతో స్నానం చేస్తున్నారని, ఈ రక్తం కోసం జింకలను చంపుతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది ప్రోక్ట్ అనే పరిశోధనాత్మక సంస్థ.
Vladimir Putin Deer Blood Bath Treatment: పుట్లర్.. ఇప్పుడిదే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లేటెస్ట్ నేమ్.. పుతిన్‌ను పుట్లర్ అంటున్నారని కన్ఫ్యూజ్ అవుతున్నారా ? దీనిలో ఎలాంటి తికమక లేదు. పుతిన్ పేరును, హిట్లర్ పేరుతో మిక్స్ చేస్తే వచ్చిందే ఈ పుట్లర్..! ఉక్రెయిన్‌తో అంతుచిక్కని వ్యూహాలతో ఆ దేశంపై బాంబుల వర్షం కురిపించిన పుతిన్‌ను హిట్లర్‌తో పొల్చాయి ప్రపంచదేశాలు. ఇక ఉక్రెయిన్ దేశంపై యుద్ధానికి దిగిన పుతిన్.. ఆ తర్వాత మీడియా ముందుకు రావడం తగ్గించాడనే చెప్పాలి. ఇందుకు కారణం పుతిన్ అనారోగ్యానికి గురి కావడమే అంటూ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పుతిన్ జనానికి దూరంగా బతుకుతూ నలుగురిలో కలవాలంటే జంకుతున్నారని.. పుతిన్ ఆరోగ్యం బాగా క్షీణిస్తోందని, ఆయన కోపమే ఆయన శత్రువుగా మారిదంటూ రష్యా అధినేత ఆరోగ్యంపై పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు.. పుతిన్‌కు వచ్చిన అంతుచిక్కని వ్యాధికి జింక రక్తంతో చికిత్స చేయించుకుంటున్నాడన్న వాదనలు కూడా ఉన్నాయి. ఆ వివరాలపై మీరూ ఓ లుక్కేయండి.
జింక రక్తంతో పుతిన్ స్నానం:
రష్యా అధ్యక్షుడు వాద్లిమిర్ పుతిన్ ఆరోగ్య పరిస్థితిపై తరచూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తూనే ఉన్నాయి. అయితే ఇలాంటి వార్తలు ఇప్పటికీ వస్తూనే ఉన్నప్పటికీ.. వీటిపై ఎప్పుడూ స్పందించలేదు రష్యా ప్రభుత్వం. తాజాగా రష్యాకు చెందిన ప్రోక్ట్ అనే పరిశోధనాత్మక సంస్థ పుతిన్ గురించి షాకింగ్ విషయాలు వెల్లడించింది. పుతిన్ తరచుగా.. జింకల కొమ్ముల నుంచి సేకరించిన రక్తంతో స్నానం చేస్తున్నారని, ఈ రక్తం కోసం జింకలను చంపుతున్నారంటూ ఓ కథనాన్ని ప్రచురించింది. అయితే చేయడం వల్ల పుతిన్ ఆరోగ్యాన్ని పెంచుతోందని ఆ రిపోర్ట్ తెలిపింది.
పుతిన్ 166 రోజుల్లో 35 సార్లు థైరాయిడ్ క్యాన్సర్ డాక్టర్.. ఆయన ఉంటున్న నివాసంలో కలిశారని వెల్లడించింది. థైరాయిడ్ క్యాన్సర్‌కు మందులకు బదులు పుతిన్ జింక రక్తంతో స్నానం చేస్తున్నాడని ప్రచురించింది. ఇలా జింక రక్తంతో స్నానం చేయడం వల్ల పుతిన్ వ్యాధి క్రమంగా తగ్గుతూ వస్తుందన్న విషయం తెలుసుకున్న పలువురు థైరాయిడ్ క్యాన్సర్ బాధితులు వాళ్లు కూడా ఇలాగే చేస్తున్నారని వెల్లడించింది. కానీ నిజానికి.. రష్యా, చైనా, కొరియాలో ఇదో సంప్రదాయ ఆచారం. ఐతే, సైబీరియాలోని అల్టాయ్ రెడ్ డీర్ జాతి జింకల కొమ్ముల రక్తంతో ఆరోగ్యం మెరుగవుతుంది అనేందుకు ఆధారాలు లేవు. ఇలాంటి వార్తలు రావడం కొత్తేమీ కాదు.. గతంలో పుతిన్ కుడి భుజం, అతడి నడకపై కూడా నానా రకాల కథనలు హోరెత్తుతున్నాయి.
పుతిన్ వాకింగ్ స్టైల్ వెనక మిస్టరీ ఉందా.?
పుతిన్ నడక, రష్యా నడవడికకు నిదర్శనమని, ఆయన ఇస్మార్ట్ వాకింగ్ వెనుక మిస్టరీ ఉందన్న వార్తలు సైతం తెగ వైరల్ అవుతున్నాయి. పులివేషంలో మనుషుల సందడి చూసుంటారు. కానీ పులితో గేమ్స్ ఆడే పుతిన్ వాకింగ్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అయితే అంతర్జాతీయంగా ఎందరో లీడర్ల నడవడికలు ఒకలా ఉంటే.. పుతిన్ రూటే సపరేటు. లెప్ట్ హ్యాండ్‌ను కదిలించినంత వీజీగా వార్ డిక్లేర్ చేశారు. యుద్దం ఆపాలని దునియా ఏకమై దుమ్మెత్తిపోస్తున్నా తన రైట్ హ్యాండంత స్టిఫ్ఫుగా స్టిక్కయి ఉన్నట్లుగా ఉంటుంది. అధికారిక కార్యక్రమాలైనా, ఇంట్లోనైనా, విదేశాల్లోనైనా పుతిన్ వాకింగ్ ఇస్టయిల్ ఒకటే. కానీ చిన్న డిఫరన్స్ ఏంటంటే.. కేజీబీకి ముందు ఆ తరువాత అన్నట్లు పుతిన్ నడక మారిందనే టాక్ కూడా ఉంది. కుడి చేతు కదలకపోవడానికి కారణం.. కేజీబీ ట్రెయినింగే అని కొందరు డిసైడ్ చేశారు. పుతిన్ రైట్ హ్యాండ్ స్టిఫ్‌గా వుండడానికి జేమ్స్‌బాండ్‌కు ఓ లింకుందన్న వార్త కూడా వైరల్ అయింది.
ఎనీ టైమ్ వెపన్‌ను ఆపరేట్ చేసేలా చేతులు మెరుపు వేగంతో కదిలేలా కఠిన శిక్షణ పొందుతారు. పుతిన్ కూడా ఒకప్పుడు సీక్రెంట్ ఏజెంట్.. అందులోనే కేజీబీలో చేరిన తర్వాత ఈ ట్రిక్స్‌ను నేర్చుకున్నాడన్న వాదనలు ఉన్నాయి. కళ్లు టార్గెట్ మీద ఉండాలి. ఆయుధం కుడి చేతిలో ఉండాలి. ఆర్డర్ ఇవ్వగానే లక్ష్యంవైపు మెరుపు వేగంతో కదలాలి. గురి చేసి ట్రిగ్గర్ నొక్కాలి.. ఈ ప్రాసెస్‌లో రైట్‌హ్యాండ్ సిఫ్ట్‌గా ఉంటే.. లెఫ్ట్ హ్యాండ్ ఆ మూమెంట్‌ను హ్యాండిల్ చేస్తుందంటా. కేజీబీలో పొందిన ఈ శిక్షణ వల్లే పుతిన్ రైట్ హ్యాండ్ స్టిప్‌గా మారిందంటారు. పుతిన్ ఒక్కరు మాత్రమే కాదు, ఇప్పటికీ ఆయన క్యాబినెట్‌లో వున్న నాటి కేజీబీ సహచరుల భుజం కదలికలు కూడా ఇంచుమించు పుతిన్‌లానే ఉంటాయి. కేజీబీకి ముందు కేజీబీలో చేరాక.. పుతిన్ వాకింగ్ స్టయిల్ మార్పు కన్పిస్తుంది. ఐతే పుతిన్ రైట్ హ్యాండ్ అలా స్టిఫ్‌గా ఉండడానికి కారణం కేజీబీ కఠోర ట్రెయినింగేనా? లేదంటా న్యూరాలిజికల్ ప్రాబ్లమ్ వుందా? అన్న చర్చ కూడా ఎప్పటి నుంచో ఉంది.