Trip to Space: అంతరిక్షంలోకి వెళ్లాలని ఉందా? ఇంత చెల్లిస్తే చాలు.. భూమిని చుట్టేయొచ్చు!
అంతరిక్షం నుంచి భూమిని చూడాలని ఉందా? ఆ రోజు దగ్గరకు వచ్చేసింది. ఇందుకు మీరు ఈ టికెట్ కొనుగోలు చేస్తే చాలు. టికెట్ ధర తెలిస్తే.. గుండె ఆగడం ఖాయం.
అంతరిక్షంలోకి వెళ్లాలని ఎవరికి ఉండదు చెప్పండి? అల్లంత దూరం నుంచి భూమిని చూస్తుంటే ఎంతో గొప్ప అనుభూతి కలుగుతుంది కదూ. డోన్ట్ వర్రీ.. ఆ అవకాశాన్ని మీరు కూడా పొదవచ్చు. అదెలా అనుకుంటున్నారా? ఇదిగో ఇలా...
వర్జిన్ గెలాక్టిక్ (Virgin Galactic) అధిపతి బ్రిటిష్ బిలియనీర్ రిచర్డ్ బ్రాన్సన్ అంతరిక్షంలో షికారు చేసి వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతోపాటు మన తెలుగుమ్మాయి శిరీష బండ్ల కూడా స్పేస్ ఫైట్‌లో ప్రయాణించారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో రిచర్డ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వర్జిన్ గెలాక్టిక్ ద్వారా టూరిస్టులు అంతరిక్షాన్ని చుట్టే వచ్చే అవకాశాన్ని కలిపిస్తోంది.
ఈ స్పేస్ షిప్‌లో ప్రయాణించడం సామాన్యులకు సాధ్యం కాదు. ఎందుకంటే.. ఒక్కో టికెట్ ధరను 4.5 లక్షల డాలర్లుగా నిర్ణయించారు. అంటే ప్రస్తుత భారత కరెన్సీ ప్రకారం సుమారు రూ.3.33 కోట్లు చెల్లించాలి. ఈ టికెట్ల అమ్మకాలు గురువారం నుంచే ప్రారంభమయ్యాయి. కాబట్టి.. ఆస్తులు అమ్ముకునైనా సరే.. అంతరిక్షాన్ని చుట్టి వచ్చేయాలని భావించేవారికి ఇది చాలా చక్కని అవకాశం.
జులై 11న న్యూ మెక్సికోలోని ఎడారి నుంచి వర్జిక్ గెలాక్టిక్ రాకెట్‌లో రిచర్డ్ అంతరిక్షంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. భూమి నుంచి సుమారు 90 కిలోమీటర్ల పైకి వెళ్లి సురక్షితంగా తిరిగిరావడం అందరీనీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ నేపథ్యంలో రిచర్డ్ ఇకపై ‘స్పేస్ ఫ్లైట్’ను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తామని, అంతరిక్షంలోకి వెళ్లాలని ఆశ పడేవారు తమ వద్ద టికెట్లు కొనుగోలు చేయవచ్చని రిచర్డ్ ప్రకటించారు. దీంతో ఆయన సంస్థ షేర్లు వాటా ఒక్కసారే ఐదు శాతానికి పెరిగాయి.
ట్వీట్:
Also Read: డయాబెటిస్.. యమ డేంజర్, ఈ లక్షణాలు ఉంటే జాగ్రత్త!
2004లోనే రిచర్డ్ బ్రాన్సన్ స్పెస్ ట్రిప్‌కు ప్లాన్ చేశారు. 2007 సంవత్సరంలో కమర్షియల్ స్పేస్ షిప్ అందుబాటులోకి రానుందని చెప్పారు. అయితే సాంకేతిక సమస్యల వల్ల అది సాధ్యం కాలేదు. 2014లో ఎట్టకేలకు ఆయన స్పేస్ ఫ్లైట్‌ను ప్రయోగించారు. కానీ, అది విజయవంతం కాలేదు. స్పేస్ ఫ్లైట్ పేలిపోవడంతో ఆయన ఆశలు సన్నగిల్లాయి. అయినా.. ఆయన వెనక్కి తగ్గకుండా తన ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ఆయన విజయవంతంగా స్పేస్ ఫ్లైట్‌ను ప్రయోగాన్ని విజయవంతం చేసి.. అంతరిక్షం చుట్టిరావాలని కలలుగనే ఔత్సాహికుల్లో ఆశలు చిగురింపజేశారు. అంతరిక్షంలోకి వెళ్లి వచ్చేందుకు virgingalactic.com వెబ్‌సైట్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవాలని ప్రకటించారు.
Also Read: ‘ఫస్ట్ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?