By: Ram Manohar | Updated at : 16 Jul 2023 01:13 PM (IST)
బ్రెజిల్‌లోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో విమానం రన్‌వే పై స్కిడ్ అయింది. (Image Credits: Twitter)
Viral Video:
బ్రెజిల్‌లో ఘటన..
బ్రెజిల్‌లో ఓ విమానం రన్‌వేపై స్కిడ్ అయ్యి ప్రయాణికులను తెగ టెన్షన్ పెట్టింది. ఈ ప్రమాదకర ఘటన బ్రెజిల్‌లో జరిగింది. LATAM ఎయిర్‌లైన్స్‌కి చెందిన విమానం...ఫ్లోరియానోపోలిస్ హెర్సీలియో లుజ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన సమయంలో ఒక్కసారిగా స్కిడ్ అయింది. ఓ ప్యాసింజర్ ఇదంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. విమానం స్కిడ్ అయిన వెంటనే అందరూ గట్టిగా అరిచారు. ఆ సమయంలో అక్కడ భారీ వర్షం పడుతోంది. ఈ కారణంగానే ఫ్లైట్ స్కిడ్ అయిందని అధికారులు వెల్లడించారు. రన్‌వే పక్కనే ఉన్న లాన్‌లోకి దూసుకుపోయింది విమానం. ల్యాండింగ్ వీల్స్‌లో ఒకటి పేవ్‌మెంట్‌లో స్ట్రక్ అయిపోయింది. అయితే...రన్‌వే స్ట్రిప్‌లు చాలా సాఫ్ట్‌గా ఉన్నాయని, ప్రమాదానికి ఇది కూడా ఓ కారణమై ఉండొచ్చని అధికారులు వివరిస్తున్నారు. ఫ్రంట్ వీల్ పక్కనే ఉన్న గడ్డిలోకి దూసుకుపోవడం వల్ల అక్కడే విమానం అక్కడే ఆగిపోయింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది పరుగు పరుగున అక్కడికి వచ్చింది. ఫ్లైట్‌లోని ప్యాసింజర్స్‌ని ల్యాడర్‌ల ద్వారా సురక్షితంగా కిందకు దించారు. ఎమర్జెన్సీ టీమ్ వచ్చాక కానీ ప్రయాణికులు కాస్త కుదుటపడలేదు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలవ్వలేదు. లాటిన్ అమెరికాలోనే అగ్రస్థానంలో ఉన్న ఎయిర్‌లైన్స్‌లో LATAM ఒకటి. ప్రమాద సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, 7గురు సిబ్బంది ఉన్నారు. వాళ్లంతా సేఫ్‌గానే ఉన్నారని అధికారులు ప్రకటించారు. మెడికల్ టీమ్ కూడా వెంటనే అందుబాటులోకి వచ్చిందని తెలిపారు.
Passenger films moment LATAM Flight LA3300 slid off the runway yesterday at Florianópolis Airport. pic.twitter.com/epzr1mucBg
— Breaking Aviation News & Videos (@aviationbrk) July 13, 2023
వరుస ప్రమాదాలు..
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వెళ్తున్న ఇండిగో ఫ్లైట్‌లో ఓ ప్యాసింజర్ కాసేపు అందరినీ టెన్షన్ పెట్టాడు. టేకాఫ్ అయ్యే సమయంలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ని తెరిచాడు. ఇది చూసి ఒక్కసారిగా ప్రయాణికులు వణికిపోయారు. సిబ్బంది వెంటనే అప్రమత్తమవడం వల్ల ఘోర ప్రమాదం తప్పింది. నిందితుడు 40 ఏళ్ల హుస్సేన్ని ఢిల్లీలో ల్యాండ్ అయిన వెంటనే సెక్యూరిటీకి అప్పగించారు. ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ వద్ద కూర్చున్న హుస్సేన్..ఉన్నట్టుండి దాన్ని ఓపెన్ చేశాడు. ఇది గమనించిన క్రూ ఆయనకు వార్నింగ్ ఇచ్చి వేరే సీట్లో కూర్చోబెట్టింది. ఎగ్జిట్ డోర్ కవర్ని మళ్లీ మూసేసింది. సాధారణంగా ఏదైనా అత్యవసర పరిస్థితులు వచ్చినప్పుడు ఈ డోర్ తెరుచుకునేలా దానిపై ఓ కవర్ అమర్చుతారు. అది కేవలం ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే ఓపెన్ అవుతుంది. కానీ హుసేన్ మాత్రం దాన్ని మాన్యువల్‌గా ఓపెన్ చేశాడు. ఈ కవర్ని తీసేస్తే ఘోర ప్రమాదం జరిగే అవకాశముందని ఎయిర్పోర్ట్ సిబ్బంది వెల్లడించింది. Asiana Airlines ఫ్లైట్‌లోనూ ఇలాంటి ఘటన జరిగింది. మరికాసేపట్లో ల్యాండ్ అవుతుందనగా ఉన్నట్టుండి ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు ఓ ప్రయాణికుడు. ఒక్కసారిగా ప్యాసింజర్స్ అందరూ ఉలిక్కిపడ్డారు.
Also Read: ఎయిర్ ఇండియా అధికారిపై చేయి చేసుకున్న ప్యాసింజర్, బూతులు తిడుతూ వార్నింగ్
నడి సముద్రంలో చిక్కుకున్న చైనా సబ్‌మరైన్, 55 మంది సిబ్బంది మృతి
హిజాబ్ రూల్ పాటించలేదని యువతిపై ఇరాన్ పోలీసుల దాడి! కోమాలో బాధితురాలు
ప్రైవేట్‌గా మాట్లాడుకుని పరిష్కరించుకుందాం, భారత్‌కి కెనడా రిక్వెస్ట్
India-Canada Row: భారత్‌పై ఆరోపణలు తీవ్రమైనవి, విచారణ జరగాల్సిందే: అమెరికా
Asteroid: భూమికి సమీపంగా వస్తున్న భారీ గ్రహశకలం- గంటకు 30,564 కి.మీ వేగంతో ప్రయాణం
విశాఖ స్టీల్ ప్లాంట్ ఊపిరి తీసేస్తున్నారా ? మరో బ్లాస్ట్‌ఫర్నేస్ మూసివేత
ఇండియన్ ఆర్మీకి కౌటిల్యుడి రాజనీతి పాఠాలు, ప్రాచీన యుద్ధ తంత్రాలు గ్రంథాలపై ఫోకస్
Ram Charan Meets Dhoni: రామ్ చరణ్, ధోని కలిశారు - ఎందుకో తెలుసా? 13 ఏళ్ళకు మళ్ళీ...
MS Dhoni: మహీ లేకుండా తొలి వన్డే ప్రపంచకప్! టీమ్‌ఇండియాకు నెర్వస్ ఫీలింగ్!
/body>