News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Tilapia Fish: షాకింగ్, చేపలు తిన్నందుకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయట

Tilapia Fish: ప్రపంచంలో ప్రతిదీ కలుషితం అవుతున్నాయి. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితమే. ఇలా కలుషితమైన, అపరిశుభ్ర ఆహారం తిని ఎంతో మంది రోగాల పాలవుతున్నారు.

FOLLOW US: 
Share:

Tilapia Fish: ప్రపంచంలో ప్రతిదీ కలుషితం అవుతున్నాయి. తినే తిండి, తాగే నీరు, పీల్చే గాలి ఇలా ప్రతిదీ కలుషితమే. ఇలా కలుషితమైన, అపరిశుభ్ర ఆహారం తిని ఎంతో మంది రోగాల పాలవుతున్నారు. మరికొంత మంది మృత్యువాత పడుతున్నారు. ఇటీవలే ఫ్రాన్స్‌లో సార్డినెస్‌ అనే చేపల వంటకాన్ని తిని ఓ మహిళ మృతి చెందగా, మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందారు. తాజాగా ఇలాంటి ఘటనే కాలిఫోర్నియాలో జరిగింది. కలుషితమైన తిలాపియా చేపలు తిని ఓ మహిళ మంచానికే పరిమితమైంది. ఆమెలోని నాలుగు ప్రధాన అవయవాలు పనిచేయడం మానేశాయి. 

ఈ విషయాన్ని మహిళ స్నేహితులు సోషల్ మీడియా ఖాతాల్లో తెలిపారు. బ్యాక్టీరియాతో కూడిన కలుషితమైన తిలాపియా చేపలను తక్కువగా ఉడకబెట్టి తినడంతో ఆమెకు బ్యాక్టీరియా సోకిందని, ఫలితంగా ఆమె ఆరోగ్యం పూర్తిగా చెడిపోయిందని, మంచానికి పరిమితమైందని తెలిపారు. వివరాలు.. ఓ  40 ఏళ్ల వయసున్న లారా బరాజాస్ శాన్‌జోస్‌లోని స్థానిక మార్కెట్‌లో తిలాపియన్ చేపలు కొనుగోలు చేసింది. అయితే అప్పటికే ఆ చేపలు ప్రాణాంతకమైన బ్యాక్టీరియా సోకి చెడిపోయాయి. ఆవిషయం తెలియన లారా బరాజాస్ వాటిని వండుకుని తిన్నారు. దీంతో ఆమె ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రిలో నెలల తరబడి చికిత్స తీసుకున్న అనంతరం గురువారం ఆమె ప్రాణాలు నిలిపేందుకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. 

దీనిపై ఆమె స్నేహితులు సోషల్ మీడియాలో స్పందించారు. ‘ఇది నిజంగా మనందరికి కష్టమైన విషయం. ఇది భయంకరమైనది. ఇది మనలో ఎవరికైనా జరిగి ఉండవచ్చు’ అని బరాజాస్ స్నేహితురాలు అన్నా మెస్సినా చెప్పారు. శాన్ జోస్‌లోని స్థానిక మార్కెట్‌లో కొనుగోలు చేసిన చేపలతో చేసిన వంట తినడంతో బరాజాస్ అస్వస్థతకు గురయ్యారని, ఆమె దాదాపు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి వచ్చిందని, ఆమె రెస్పిరేటర్‌లో ఉందని చెప్పారు. బరాజాస్‌ను కాపాడేందుకు వారు ఆమెను వైద్యపరంగా ప్రేరేపిత కోమాలోకి వెళ్లేలా చేశారని, ఆమె వేళ్లు, పాదాలు, దిగువ పెదవి నల్లగా మారాయని, ఆమె మూత్రపిండాలు విఫలమయ్యాయని సోషల్ మీడియాలో ఆమె రాసుకొచ్చారు.

బరాజాస్‌కు విబ్రియో వల్నిఫికస్‌ అనే ప్రాణాంతక వైరస్ సంక్రమించిందని మెస్సీనా పేర్కొన్నారు. ఈ బ్యాక్టీరియా సముద్రపు ఆహారం, సముద్రపు నీటిలో కనిపించే ప్రాణాంతకమైన బ్యాక్టీరియా అన్నారు. సముద్రపు ఆహారాన్ని సరిగా శుభ్రం చేయకపోవడంతో బ్యాక్టీరియా సోకే అవకాశం ఉందన్నారు. ఇటువంటి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను నివారించడానికి సముద్రపు ఆహారాన్ని సరిగ్గా వండాలని హెచ్చరించారు. ఈ బాక్టీరియా సంక్రమించగల మార్గాలను UCSF ఇన్ఫెక్షియస్ డిసీజ్ నిపుణుడు డాక్టర్ నటాషా స్పాటిస్‌వుడ్ వివరించారు. కలుషిత ఆహారం తినడం లేదా బ్యాక్టీరియా ఉన్న నీటిలో దిగనప్పుడు గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశించవచ్చని ఆయన తెలిపారు. 

ఫ్రాన్స్‌లో కవల చేపలు తిని ఒకరు మృతి
ఫ్రాన్స్‌లో ఇలానే నిల్వ చేసిన చేపల కూర తిని అరుదైన వ్యాధితో మహిళ మరణించింది. ఫ్రాన్స్ లోని బోర్డియక్స్‌ సిటీ వైన్, ఆహారానికి ప్రసిద్ధి చెందింది. పట్టణంలో సాధారణంగానే పెద్ద సంఖ్యలో పర్యాటకులు ఉంటారు. ఇక్కడ చిన్ ట్చిన్ వైన్ బార్ అనే రెస్టారెంట్‌లో సెప్టెంబరు 4 నుంచి10 తేదీల మధ్య పలువురు సార్డినెస్‌ అనే చేపల వంటకాన్ని తిన్నారు. వారిలో 32 ఏళ్ల ఓ మహిళ మరణించింది. మరో 12 మంది పరిస్థితికి విషమించడంతో వారికి చికిత్స  పొందారు.

Published at : 18 Sep 2023 09:56 AM (IST) Tags: Kidney Failure US Woman Tilapia Fish

ఇవి కూడా చూడండి

Nobel Prize In Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం, ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ

Nobel Prize In Physics: భౌతికశాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం, ప్రకటించిన రాయల్ స్వీడిష్ అకాడమీ

Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం

Delhi-NCR Earthquake: ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో భూప్రకంపనలు, నేపాల్ లో 6.2 తీవ్రతతో భూకంపం

Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం

Nobel Prize 2023: కరోనా సమయంలో సేవలకు అత్యుత్తమ గుర్తింపు, నోబెల్ పురస్కారంతో సత్కారం

Elon Musk: కెనడాలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం సిగ్గుచేటు- ప్రధాని ట్రూడోపై ఎలన్‌ మస్క్‌ ఫైర్

Elon Musk: కెనడాలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోవడం సిగ్గుచేటు- ప్రధాని ట్రూడోపై ఎలన్‌ మస్క్‌ ఫైర్

Pakistani Beggars: సౌదీలో యాచనకు ఫ్లైట్ ఎక్కిన పాకిస్థానీలు- పాతిక మందిని అరెస్టు చేసిన ఎఫ్‌ ఐఏ

Pakistani Beggars: సౌదీలో యాచనకు ఫ్లైట్ ఎక్కిన పాకిస్థానీలు- పాతిక మందిని అరెస్టు చేసిన ఎఫ్‌ ఐఏ

టాప్ స్టోరీస్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

KTR About PM Modi: ఎన్డీఏలో చేరడానికి మాకు పిచ్చికుక్క ఏం కరవలేదు - ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

RK Roja:  మీడియా ముందు ఏడ్చేసిన మంత్రి రోజా! మీ ఇంట్లో ఆడబిడ్డలను ఇలానే అంటారా అంటూ నిలదీత

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Amitabh Bachchan: 'తలైవర్ 170'లో బిగ్ బి - 32 ఏళ్ళ తర్వాత ఒకే సినిమాలో ఇద్దరు 'సూపర్ స్టార్స్'

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!

Asian Games India Wins Gold: భారత్ ఖాతాలో మరో 2 స్వర్ణాలు - అన్ను రాణి, పారుల్ చౌదరి మన బంగారాలు!