అన్వేషించండి

Donald Trump Attack: 'అమెరికాలో హింసకు తావు లేదు, ట్రంప్‌పై దాడి కేసులో బైడెన్ స్టేట్‌మెంట్

US President Joe Biden:మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నంపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ స్పందించారు. జాతినుద్దేశించి మాట్లాడిన ఆయన బుల్లెట్‌తో దేనికీ పరిష్కారం దొరకదని అభిప్రాయపడ్డారు.

Donald Trump Attack: అమెరికా చరిత్రలో గతంలో చాలా హింసాత్మక ఘటనలు జరిగాయన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్... వాటితో సమస్యకు పరిష్కారాలు లభించలేదని అన్నారు. హింసామార్గంలోకి వెళ్లడం సరికాదని సూచించారు. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం (జూలై 14) నాడు దేశాన్ని ఉద్దేశించి బైడెన్ ప్రసంగిస్తూ డొనాల్డ్ ట్రంప్‌పై దాడిని ఖండించారు. అమెరికాలో ఇలాంటి హింసకు తావు లేదని అన్నారు. ఇప్పుడు కాస్త ఓపిక పట్టాల్సిన సమయం ఆసన్నమైందని హితవు పలికారు. 

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శనివారం (జూలై 13) పెన్సిల్వేనియాలో ఎన్నికల ర్యాలీలో ప్రసగిస్తుండగా దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి ఆయనపై కాల్పులు జరిపాడు. అగంతకుడు వదిలిన బుల్లెట్ ట్రంప్ చెవిని తాకడంతో గాయమైంది. ఈ దాడిలో ఒక పౌరుడు చనిపోయాడు. ఇంకో ఇద్దరు పౌరులు గాయపడ్డారు. వెంనటే స్పందించిన ట్రంప్‌ సెక్యూరిటీ గార్డ్స్‌ కాల్పులు జరిపిన థామస్ మాథ్యూ క్రూక్స్ అనే యువకుడిని కాల్చి చంపేశారు. 

హింసామార్గంలో వెళ్లలేం: బైడెన్
ఎన్నికల ర్యాలీలో ట్రంప్‌పై జరిగిన దాడిని ఉద్దేశిస్తూ బైడెన్‌ మాట్లాడారు. " రగులుతున్న రాజకీయాన్ని చల్లార్చేందుకు మీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మనతో విభేదించేవాళ్లు శత్రువులు కాదు, ఇరుగుపొరుగువాళ్లం, స్నేహితుల, సహచరులం, అన్నింటి కంటే మనందరం అమెరికా పౌరులం. అని అన్నారు. 

"పెన్సిల్వీనియలో ట్రంప్ ర్యాలీలో జరిగిన కాల్పుల మనల్ని ఓ అడుగు వెనక్కి వేసేలా చేసింది. మనం ఎక్కడ ఉన్నాం... ముందడుగు ఎలా వేయాలనే ఆలోచన కలిగిస్తోంది. మనకు ఐక్యమత్యం అనేది అన్నింటికంటే ముఖ్యమైన గోల్‌. ప్రస్తుతానికి అంతకంటే ముఖ్యమైంది ఏదీ లేదు." 

"మనం ఒక దేశంగా గట్టిగా నిలబడేందుకు హింస అనేది అవరోధంగా మారుతుంది. అమెరికాలో అలాంటి హింసకు ఇకపై తావు ఇవ్వకూడదు"

"గతంలో చాలా హింసాత్మక ఘటనలు  జరిగాయి. ముందుకు వెళ్లే క్రమంలో అమెరికా ఆ మార్గంలో వెళ్లకూడదు. హింస ఎప్పుడూ సమాధానం కాదు. మా విభేదాలపై లోతుగా చర్చించాం. ఈ ఎన్నికల్లో చాలా పెద్ద విషయాలు చర్చకు వచ్చాయి. ఈ ఎన్నికల్లో మనం తీసుకునే నిర్ణయాలు రాబోయే దశాబ్దాల్లో అమెరికా, ప్రపంచ భవిష్యత్తును నిర్ణయిస్తాయని నేను చాలాసార్లు చెప్పాను."
ఈ ఘటన తర్వాత రిపబ్లికన్ పార్టీ కూడా తనను విమర్శించబోతోందని బైడెన్ అన్నారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు మాట్లాడుతూ.. 'రిపబ్లికన్ కన్వెన్షన్ పార్టీ నన్ను టార్గెట్ చేస్తుంది. వారు నా పాలనను విమర్శిస్తారు. నేను కూడా ఈ వారం దేశవ్యాప్తంగా పర్యటిస్తూ నా పని తీరును వివరిస్తాను. నా దార్శనికత, దేశం పట్ల నాకున్న ప్రేమ గురించి కూడా మాట్లాడతాను.

రాజ్యాంగం కోసం, చట్టబద్ధ పాలన కోసం నిలబడండి. మన వీధుల్లో ఎలాంటి హింస ఉండకూడదు. రాజకీయ ప్రత్యర్థులతో వాదిస్తాం, విభేదిస్తాం. అభ్యర్థుల స్వభావం, రికార్డులు, సమస్యలు, అజెండాలు, వైఖరులు పోల్చి చూస్తాం. అమెరికాను మార్చే శక్తి ఎల్లప్పుడూ ప్రజల చేతుల్లోనే ఉండాలి తప్ప హంతకుల చేతుల్లో ఉండకూడదు. అందుకే కానీ బుల్లెట్లు పట్టుకోవద్దు. బ్యాలెట్ బాక్సులో ఓటు వేయడం ద్వారా ఇది సాధ్యమవుతుంది.  అని అన్నారు. 

టాప్ హెడ్ లైన్స్

Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kondagattu Accident: కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
కొండగట్టు సమీపంలో ఆర్టీసీ బస్సు, లారీ ఢీ.. 20 మందికి గాయాలు, ఐదుగురి పరిస్థితి విషమం
Telangana Voter List 2026: తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
తెలంగాణ ఓటర్ల జాబితా ముసాయిదా విడుదల! డేంజర్‌లో 92 లక్షల ఓట్లు! మీ పేరును ఈలింక్‌లో చెక్ చేసుకోండి!
Andhra Pradesh and Telangana BJP: జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
జాతీయ కార్యవర్గంలో పురంధేశ్వరికి చోటుతో అధిష్ఠానం గట్టి సంకేతాలు! డీలాపడ్డ ఏపీ నేతలు! సంతోషంలో తెలంగాణ లీడర్స్‌! 
Nitin Nabin New Team: నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
నితిన్ నబీన్ కొత్త జట్టులోకి పురంధేశ్వరి! డీకే అరుణకు షాక్! జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించిన బీజేపీ!
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
DC Review : లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
లోకేశ్ కనగరాజ్ నటన అద్భుతం - DC మూవీపై మహేశ్ బాబు, అల్లు అర్జున్ రివ్యూ
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Embed widget