అన్వేషించండి

US Iran War: పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండరాదు, ఏ క్షణమైనా ఇరాన్‌పై సైనికచర్య: డొనాల్డ్ ట్రంప్

US Iran Conflict | ఇరాన్‌తో యుద్ధం, కాల్పుల విరమణకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ఒక కీలక ప్రకటన చేశారు. పిచ్చివాళ్ల చేతిలో అణ్వాయుధాలు ఉండకుండా చూస్తామన్నారు.

US Iran War | వాషింగ్టన్: ఇరాన్‌తో యుద్ధం ముగిసిందని పేర్కొంటూనే మరోవైపు తాము ఆ దేశంతో యుద్ధం చేయలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. పిచ్చివాళ్ల చేతుల్లో అణ్వాయుధాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే ఇరాన్‌ను అడ్డుకునేందుకు అమెరికా బీ2 బాంబర్లతో దాడులు చేసిందన్నారు. ఒక కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ.. సీజ్‌ఫైర్ (కాల్పుల విరమణ) ప్రకటన తర్వాత ఇరుదేశాల మధ్య ఈ శత్రుత్వం ముగిసిందని పేర్కొన్నారు. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు చర్చల కోసం పంపిన కొత్త ప్రతిపాదనపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాము అంగీకరించలేని కండీషన్లను ఇరాన్ పెడుతోందని అన్నారు. మరోవైపు ఇరాన్ అగ్ర నాయకత్వం కూడా ఏకాభిప్రాయంతో లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. 

గత మూడు వారాలుగా ఇరాన్, అమెరికా మధ్య సీజ్‌ఫైర్ కొనసాగుతుందంటే యుద్ధం ముగిసిందని అర్థం చేసుకోవాలన్నారు ట్రంప్. ఇరాన్‌తో శత్రుత్వం ముగిసిందని అధ్యక్ష భవనం వైట్ హౌస్ కూడా కాంగ్రెస్‌కు సమాచారం ఇచ్చింది. అయితే ఆ ప్రాంతంలో అమెరికా సైన్యం ఇంకా మోహరించి ఉండటంతో వార్ ముగిసిందా లేదా అని ప్రపంచ దేశాలకు క్లారిటీ రావడం లేదు.  వార్ పవర్స్ రిజల్యూషన్ ప్రకారం 60 రోజుల్లోపు సైనిక చర్యకు కాంగ్రెస్ ఆమోదం ఉండాలి.

మే 1 నాటి గడువు ముగిసిన సమయంలోనే ఈ అంశం తెరపైకి రావడంతో ట్రంప్ ఈ చట్టాన్ని రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు. ఇరాన్ మీద అమెరికా చేపట్టిన సైనిక చర్యను సమర్థించుకున్న ఆయన.. దాన్ని యుద్ధంగా భావించడం లేదంటూ అందరికీ షాకిచ్చారు. మరోవైపు, యుద్ధాన్ని ఆపడానికి సెనెట్‌లో డెమొక్రాట్లు చేసిన ప్రయత్నం కూడా వీగిపోయింది.

పరిస్థితులు పూర్తిగా సద్దుమణగలేదు - ట్రంప్
అమెరికా కాంగ్రెస్‌కు రాసిన లేఖలో పరిస్థితులు పూర్తిగా ప్రశాంతంగా లేవని ట్రంప్ తెలిపారు. ఇరాన్ నుంచి అమెరికా పౌరులకు, సైన్యానికి ఇంకా ముప్పు పొంచి ఉందని, శాంతిని కాపాడటానికి నిరంతరం ప్రయత్నాలు చేస్తానని అన్నారు. తమ దేశ ప్రయోజనాల కోసం యురేనియంను సుసంపన్నం చేసుకునే హక్కు తమకు ఉందని ఇరాన్ అంటోంది. అయితే పాశ్చాత్య దేశాలు దీనిని ప్రశ్నిస్తూనే ఉన్నాయి. అమెరికా తన వైఖరిని మార్చుకుంటే ఇరు దేశాల మధ్య చర్చలకు వీలుంటుందని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ అన్నారు. తమ రక్షణ కోసం ఇరాన్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. 

సైనిక చర్య మళ్లీ జరగవచ్చు
అవసరమైతే ఇరాన్ మీద సైనిక చర్యను మరింత విస్తరించవచ్చని ట్రంప్ పేర్కొన్నారు. అయితే అలా చేయడం తనకు ఇష్టం లేదన్నారు. తమ ముందు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయని.. ఒకటి పూర్తిగా దాడి చేసి నాశనం చేయడం, లేకపోతే తమతో ఒప్పందం చేసుకోవడం అని తెలిపారు. మానవతా దృక్పథంతో తాను ఒప్పందమే బెస్ట్ ఆప్షన్‌గా భావిస్తున్నానని ఆయన అన్నారు.

హర్మూజ్‌పై పట్టుబిగిస్తామన్న ఐఆర్‌జీసీ
పర్షియన్‌ గల్ఫ్‌, హర్మూజ్ జలసంధి సముద్ర మార్గాలపై తమ నియంత్రణను మరింత బలోపేతం చేయనున్నట్లు ఇరాన్‌కు చెందిన ఐఆర్‌జీసీ (IRGC) నౌకాదళం ప్రకటించింది. సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆదేశాల మేరకు దాదాపు 2,000 కి.మీ. మేర విస్తరించి ఉన్న తీరప్రాంతంలో ఆధిపత్యంపై కొత్త నిబంధనలు, వ్యూహాలు సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఈ జలాలను ఇరాన్ భద్రతకు, ప్రజల జీవనోపాధికి ప్రతీకగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని పేర్కొంది. మరోవైపు హర్మూజ్ జలసంధిలో అమెరికా నేవీ దిగ్బంధనం ఇంకా కొనసాగుతోంది. ఇప్పటివరకు 42 నౌకలను అడ్డుకున్నామని యూఎస్ సెంట్రల్ కమాండ్ తెలిపింది. ఇరాన్ సైతం పలు దేశాల ఓడలపై దాడులు చేసి తమ నియంత్రణను చాటుకుంటోంది. ఇరు దేశాల చర్యలతో ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Donald Trump: అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
అమెరికా ఎన్నికలకు భారతే పాఠం! ఓటర్ ఐడీ విధానంపై ట్రంప్ ప్రశంసలు! సేవ్ అమెరికా యాక్ట్ కోసం పట్టు!
US Iran War: ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
ధరలు పెరిగినా సరే పెట్రోల్ కోనుగోలు చేయండి.. అమెరికన్లకు ట్రంప్ హుకుం
Breaking News:ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
ఎర్రకోటపై 13వ సారి జాతీయ జెండా ఆవిష్కరించిన ప్రధానమంత్రి మోదీ
Breaking News:
"నన్ను జైల్లో అవమానించారు" కర్నూలు పర్యటనలో జగన్ విమర్శలు 

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget