Tyson Foods: అతిపెద్ద కంపెనీ CFO గలీజు పని! తాగిన మత్తులో ఓ మహిళ ఇంట్లోకి - బట్టల్లేకుండా ఆమె మంచంపైనే
టైసన్ ఫుడ్స్ సీఎఫ్ఓ మద్యం మత్తులో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. బట్టలు కూడా లేకుండా ఆమె మంచం పైన పడుకున్నారు.
అమెరికాకు చెందిన మాంసాహార ప్రాసెసింగ్ ఫుడ్ కంపెనీ టైసన్ ఫుడ్స్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) జాన్ ఆర్. టైసన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన మద్యం మత్తులో ఓ మహిళ ఇంట్లోకి ప్రవేశించారు. బట్టలు కూడా లేకుండా ఆమె మంచం పైన పడుకున్నారు. న్యూయార్క్ పోస్ట్ వెల్లడించిన కథనం ప్రకారం, 32 ఏళ్ల జాన్ ఆర్. టైసన్‌పై బహిరంగ మత్తు, నేరపూరిత అతిక్రమణ అనే నేరాలపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ సంఘటన నవంబర్ 6 -7 అర్ధరాత్రి జరిగింది.
అర్కాన్సాస్ రాష్ట్రంలోని ఫాయెట్విల్లే పట్టణంలో నివసిస్తున్న ఒక మహిళ మధ్యాహ్నం 2 గంటల సమయంలో పోలీసులకు ఫోన్ చేసింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి తన మంచంపై నిద్రిస్తున్నాడని చెప్పింది. ఆ వ్యక్తి బట్టలు నేలపై పడి ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఆయన ఆ మహిళ మంచంపై మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
ఆ మహిళ ఉదయం ఇంటికి తిరిగి వచ్చేసరికి తన మంచంపై ఓ వ్యక్తి కనిపించినట్లు పోలీసులు తెలిపారు. ఆమె అతనికి తెలియదు కాబట్టి పోలీసులకు ఫోన్ చేసినట్లు తెలిపారు.
‘‘మేము ఇంటికి చేరుకున్నప్పుడు, ఆ వ్యక్తి మరెవరో కాదు, టైసన్ ఫుడ్స్ CFO జాన్ ఆర్. టైసన్ అని మేం గుర్తించాం. నేలపై పడి ఉన్న బట్టల నుండి అతని ఐడెంటిడీ కార్డు కూడా లభించింది. మేం వాటిని తీయడానికి ప్రయత్నించాం. కానీ అతను బాగా తాగి ఉన్నాడు. ఏమీ చెప్పలేకపోయాడు. అతణ్ని ఎత్తుకుని కూర్చోబెట్టాం. అయినా ఆయనలో చలనం లేదు. బాగా మద్యం సేవించడంతో విపరీతమైన వాసన వచ్చింది’’ అని పోలీసులు తెలిపారు.
డిసెంబర్ 1న కేసు విచారణ
దీనిపై కోర్టు డిసెంబర్ 1న విచారణ చేపట్టనుంది. ఈ మొత్తం విషయంపై టైసన్ ఫుడ్స్ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దీన్ని కంపెనీ వ్యక్తిగత అంశంగా చూస్తోంది. CNN వార్తా సంస్థ రిపోర్ట్ చేసిన వివరాల ప్రకారం.. ‘‘ఈ సంఘటన గురించి మాకు తెలుసు, ఇది పూర్తిగా వ్యక్తిగత విషయం కాబట్టి, మేం దానిపై వ్యాఖ్యానించము’’ అని కంపెనీ చెప్పింది.
CFO క్షమాపణలు
ఆదివారం జరిగిన ఘటన తర్వాత జాన్ ఆర్ టైసన్ క్షమాపణలు చెప్పారు. కౌన్సెలింగ్ కూడా తీసుకుంటున్నారు. ‘‘నేను సిగ్గుపడుతున్నాను. నేను ఒక తప్పు చేశాను. ఇది నా వ్యక్తిగతం, కంపెనీ విలువలకు విరుద్ధం.’’ అని తన తప్పును ఒప్పుకున్నారు.
ప్రపంచంలో రెండో అతిపెద్ద మాంసం (మీట్) ప్రాసెసింగ్ ఫుడ్ కంపెనీ
టైసన్ ఫుడ్స్ ప్రపంచంలో రెండో అతిపెద్ద చికెన్, బీఫ్, పోర్క్ ప్రాసెసర్ కంపెనీ. జాన్ డబ్ల్యూ. టైసన్ 1935లో కంపెనీని స్థాపించారు. జాన్ ఆర్. టైసన్ అతని ముని మనవడు. జాన్ ఆర్. టైసన్ తండ్రి జాన్ హెచ్. టైసన్, టైసన్ ఫుడ్స్ బోర్డు ఛైర్మన్. బ్రెజిల్ యొక్క JBS S.A. అనే సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద మాంసం ప్రాసెసింగ్ కంపెనీ. దాని తర్వాత టైసన్ ఫుడ్స్ రెండో స్థానంలో ఉంది.