By: Ram Manohar | Updated at : 01 Sep 2023 04:48 PM (IST)
రష్యా ప్రెసిడెంట్ పుతిన్ హెల్త్ కండీషన్ సీరియస్‌గా ఉందన్న ఓ పోస్ట్ వైరల్ అవుతోంది.
Putin Health Condition:
పుతిన్ హెల్త్‌పై వైరల్ పోస్ట్..
రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రెండేళ్లుగా ఏవో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మీడియా పుతిన్ హెల్త్‌పై చాలా సందర్భాల్లో వార్తలు రాసింది. ఆయన తరవాత రష్యాన్ని లీడ్ చేసేది ఎవరు..? అనే స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. అయితే...ఈ వార్తలపై రష్యా అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ...ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని పోస్ట్ చేశాడు ఓ బ్లాగర్. పుతిన్ ఫొటోనీ షేర్ చేశాడు. "దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకండి. మీరు బతికుండాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం" అని పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పుతిన్‌కి ఏమైంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంత జరుగుతున్నా రష్యా మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు. ఇవి పుకార్లే అని ఖండిస్తూ ఓ ప్రకటన కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే ఆయన ఆరోగ్యం క్షీణించిందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే పోస్ట్‌ని ఉక్రెయిన్ ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా షేర్ చేశారు. "ఏం జరుగుతోంది" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈయన షేర్ చేయడం వల్ల ఈ పోస్ట్ మరింత వైరల్ అయింది. ఇది నిజమే అయితే..దేవుడిని ప్రార్థించడం కన్నా మనం ఇంకేమీ చేయలేం అని కామెంట్స్ పెడుతున్నారు. గతేడాది పుతిన్ ఆరోగ్యంపై ఓ నివేదిక విడుదలైంది. ఆయన తీవ్ర తలనొప్పితో బాధ పడుతున్నారని చెప్పింది. అంతే కాదు. ఆయన కంటి చూపు కూడా మందగించిందని, నాలుక మొద్దుబారిపోతోందని వెల్లడించింది.
An interesting post on the Telegram channel of "Z-blogger" Pozdnyakov:
"God, don't you leave us 🙏🙏🙏
Pray to God you are alive and healthy 🙏"
What is going on? pic.twitter.com/w1mlbuQyfx— Anton Gerashchenko (@Gerashchenko_en) August 28, 2023
చైనా పర్యటనకు పుతిన్..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎట్టకేలకు దేశం దాటి అడుగు బయటపెట్టనున్నారని, తొలి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో ఆయన చైనా పర్యటనకు వెళ్లనున్నట్లు మీడియా కథనాల సమాచారం. బీజింగ్‌లో జరిగే బెల్ట్ అండ్ రోడ్ సదస్సుకు ఆయన హాజరుకానున్నట్లు పలు అంతర్జాతీయ మీడియా కథనాల ద్వార వెల్లడైంది. ఈ పర్యటనకు సంబంధించి పుతిన్ షెడ్యూల్ సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధ నేరాల నేపథ్యంలో పుతిన్‌పై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. ఉక్రెయిన్‌లో చిన్న పిల్లలను కిడ్నాప్ చేసిన యుద్ధ నేరాలతో సంబంధం ఉన్న ఘటనల నేపథ్యంలో ఆయనపై వారెంట్ ఇష్యూ అయినట్లు బ్లూమ్‌బర్గ్ వెల్లడించింది. ఈ అరెస్ట్ వారెంట్ వచ్చినప్పటి నుంచి పుతిన్ రష్యా దాటి బయటకు రాలేదు. ఎలాంటి విదేశీ పర్యటనకు కూడా వెళ్లలేదు.
Also Read: మోదీపై యుద్ధం ప్రకటించిన I.N.D.I.A కూటమి, త్వరలోనే దేశవ్యాప్తంగా ర్యాలీలు
Khalistani terrorist Gurpatwant Singh Warning : నరేంద్రమోదీ స్టేడియంలో వరల్డ్ కప్ మ్యాచ్‌పై ఖలీస్థానీ ఉగ్రవాదుల కన్ను - వైరల్ అవుతున్న పన్నూన్ ఆడియో !
Iraq: ఇరాక్‌లో ఓ పెళ్లి వేడుకలో ఘోర అగ్ని ప్రమాదం, 100 మంది సజీవదహనం
నిజ్జర్ హత్యలో విదేశీ హస్తం ఉంది, భారత్‌పై విషం కక్కిన కెనడా సిక్కు ఎంపీ
టిబెట్ విషయంలో దలైలామా వెనక్కి తగ్గారా? స్వాతంత్య్రం వద్దనడం వెనక ఉద్దేశమేంటి?
Jaishankar In UNGA: ‘భారత్ నుంచి నమస్తే’ - ఐరాసలో మంత్రి జైశంకర్
Pakistan Cricket Team: ఎట్టకేలకు భారత్ లో పాక్ క్రికెట్ టీమ్ - హైదరాబాద్ చేరుకున్న బాబర్ సేన
Criminal Contempt Petition: న్యాయమూర్తులపై దూషణలు- బుచ్చయ్య చౌదరి, బుద్దా వెంకన్న సహా 26 మందికి హైకోర్టు నోటీసులు!
Tamannaah: దక్షిణాది సినిమాలపై తమన్నా ఘాటు వ్యాఖ్యలు - అందుకే సినిమాలు తగ్గించుకుందట!
IND vs AUS 3rd ODI: దెబ్బకొట్టిన మ్యాడ్ మాక్సీ! రాజ్‌కోట్ వన్డేలో టీమ్‌ఇండియా ఓటమి
/body>