Viral News: స్మోకింగ్ మానేందుకు విచిత్రమైన శిక్ష- వైరల్‌గా మారుతున్న ఫోటోలు
Viral News: చేస్తుంది మంచి పని కాదని తెలిసినా చాలా మంది ఆ అలవాటును మానుకోలేరు. అలాంటి వాటిలో ఒకటి మద్యం, పొగతాగడం. స్మోకింగ్ మానేందుకు ఓ టర్కీకి చెందిన వ్యక్తి విచిత్రమైన శిక్ష వేసుకున్నాడు.
Photos of man locking his head in a cage resurface: స్మోకింగ్ మానేసేందుకు ఓ వ్యక్తి తన తలను ఓ బోనులో బంధించుకున్నాడు. 2013లో ఈ శిక్ష వేసుకున్నాడు. గతంలోనే ఈ వార్త బాగా వైరల్ అయింది. అయితే ఇప్పుడు సడెన్‌గా మరోసారి ఆఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
తుర్కియేకు చెందిన ఇబ్రహీం ఉకెల్ తనకు ఉన్న స్మోకింగ్ అలవాటు మానుకునేందుకు హెల్మెంట్ లాంటి ఓ పంజరాన్ని తయారు చేసుకున్నారు. దానికి వెనుకాలే ఓ తాళం కూడా సిద్ధం చేశాడు. రాగి తీగత తయారు చేసిన ఈ బోను కేవలం భార్య మాత్రమే తెరిచేలా ఏర్పాట్లు చేసుకున్నాడు. మధ్య ఎక్కడైనా తెరిస్తే స్మోకింగ్‌పై మనసు మళ్లుతుందేమో అన్న కారణంతో ఇంకో ఛాన్స్ తీసుకోలేదు.
తొలిసారిగా ఈ విచిత్రమైన శిక్ష గురించి టర్కీలోని ఆంగ్ల దిన పత్రిక హుర్రియత్ డైలీ న్యూస్ వార్త ప్రచురించింది. 2013 జులై 1న ఇబ్రహీం గురించి మొదటిసారిగా వార్త రాయడంతో ప్రపంచానికి తెలిసింది. ప్రస్తుతం ఆయన ఏ స్థితిలో ఉన్నాడు. ఇంకా ఈ పంజరంతోనే తిరుగుతున్నాడా అనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. అయినా సరే ఇన్నాళ్లకు ఇప్పుుడు ఈ వ్యక్తి మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.
ఈ వ్యక్తి రోజులో నిత్యం సిగరెట్లు తాగుతుండే వాడట. అది ప్రాణాలుతీసే వ్యసనం అని తెలిసినప్పటికీ మానలేకపోయాడని చెబుతారు. ఫ్యామిలీ మెంబర్స్ ఎంతగానో ప్రయత్నించినా అలవాటు మానలేకపోయాడు. చివరకు ఇలా హెల్మెట్ మాదిరిగా ఉండే బోనును సిద్ధం చేసుకున్నాడు. బైక్ నడిపేటప్పుడు పెట్టుకునే హెల్మెట్‌ల నుంచి ప్రేరణతోనే ఈ రాగి తీగతో తయారు చేసిన కేజ్‌ను రూపొందించాడు. దీని కోసం 130 అడుగుల రాగి తీగను ఉపయోగించాడు.
అప్పటి వరకు చైన్ స్మోగర్‌గా ఉండే ఇబ్రహీం తెలిసిన వ్యక్తి ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో మరణించిన తర్వాత మారిపోయాడు. ధూమపానం మానేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఈ పంజరాన్ని తయారు చేసి దానిని తలకు పెట్టి తాళాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. దీనికి ఇబ్రహీం భార్య కూడా బాగా సహకరించింది. ఎక్కడకు వెళ్లినా ఆయన ఈ హెల్మెట్‌తోనే కనిపించేవాడు.
This gentleman, Ibrahim Yucel, a Turkish man who was 42 years old at the time of the events, decided in 2013 to have his head locked in a cage with the intention of quitting smoking; his wife was the only one who had the keys and she only opened it during meals. pic.twitter.com/1LupljbfYp
— non aesthetic things (@PicturesFoIder) November 7, 2024
ఈ వార్త చాలా పాతది అయినప్పటికీ పంజరంలో ఉన్న వ్యక్తి ఫోటో మళ్లీ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీనిపై నెటిజన్లు చాలా రకాలుగా స్పందిస్తున్నారు.
Also Read: ట్రంప్ నా తండ్రి- మీడియా ముందుకు వచ్చిన పాకిస్థాన్ యువతి