57 judges Dismiss : హమ్మ.. వ్యతిరేక తీర్పులిస్తారా ? 57 మంది జడ్జిలను పీకేసిన ఆ దేశ అధ్యక్షుడు !
ట్యూనిషియా అధ్యక్షుడికి కోపం వచ్చింది. తన నిర్ణయాలు కోర్టులో నిలబడటం లేదని ఏకంగా న్యాయవ్యవస్థపైనే దాడి చేశారు. వ్యతిరేక తీర్పులిచ్చిన 57 మదిని డిస్మిస్ చేశారు.
57 judges Dismiss : రాజ్యాంగం ప్రకారం పాలన చేయమంటే ప్రపంచంలోని అన్నిదేశాల పాలకులకూ కోపం వస్తున్నట్లుగా ఉంది. రాజ్యాంగ బలహీనంగా ఉన్న దేశాల్లో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. దానికి ట్యూనీషియానే సాక్ష్యంగా కనిపిస్తోంది. ట్యునీషియా అధ్యక్షుడు కైయీస్ సయీద్ 57మంది న్యాయమూర్తులను డిస్మిస్ చేశారు. వారందరూ ''న్యాయం పనితీరును అడ్డుకుంటునాురని'' ఆయన అభియోగం మోపారు. న్యాయ వ్యవస్థపై తన పట్టును పెంచుకునేందుకు ఆయన ఈ చర్యలు తీసుకున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
న్యాయమూర్తులు అవినీతి పరులను అందుకే తొలగించానంటున్నఅధ్యక్షుడు
న్యాయమూర్తులను తొలగిస్తూ అధికార గెజెట్‌లో డిక్రీ జారీ చేసిన తర్వాత ప్రజలను ఉద్దేసించి ప్రసంగించారు. న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసే లక్ష్యంతో న్యాయమూర్తుల కుపలుసార్లు హెచ్చరికలు చేశానని కానీ వారు పట్టించుకోలేదన్నారు. పలు అవకాశాలు కూడా ఇస్తూ వచ్చానని అధ్యక్షుడు సయీద్ ప్రజలు తెలిపారు. న్యాయమూర్తులపై అవినీతి, అక్రమంగా ఆస్తుల సంపాదన, తీవ్రవాదులకు రక్షణ, లైంగిక వేధింపులు వంటి పలు ఆరోపణలు ఉన్నాయని ప్రజలకు తెలిపారు.
గత ఏడాది ప్రభుత్వాన్ని రద్దు చేసి నియంత అవతారం !
ట్యూనిషియా అధ్యక్షుడు న్యాయవ్యవస్థను గుప్పిట్లోకి తీసుకోవడానికి ఇలా చేశారు. అంతకు ముందే అంటే.. గత ఏడాదే ప్రజాస్వామ్యాన్ని దాదాపుగా హత్య చేసేశారు. ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత మొత్తంగా ఎగ్జిక్యూటివ్ అధికారాలనిుంటినీ తన అదుపులోకి తీసుకుంటూ ఏకవ్యక్తి పాలనను సయీద్ మొదలుపెట్టారు. విస్తృత అవినీతిపై పోరాటానికి, తక్షణ ముప్పును నివారించేందుకు ఈ చర్యలు అవసరమని ఆయన ప్రజలకు చెబుతున్నారు. దీంతో ట్యూనీషియాలో నియంత ప్రభుత్వం వచ్చినట్లయింది.
#Tunisia | President grants self power to fire judges at will.
— Amnesty MENA (@AmnestyMENA) June 2, 2022
A new decree-law issued yesterday by president Kais Saied granting himself the power to fire judges summarily on vaguely-defined grounds strikes a hammer blow to judicial independence. pic.twitter.com/xxlsd19Wy9
దేశంలో ప్రజాస్వామ్యం దిగజారిపోతోందంటూ ట్యునీషియా మిత్రపక్షాలు తీవ్ర ఆందోళనలు చేస్తున్నాయి. ఈ ఆందోళనల కారమంగా రాజ్యాంగాన్ని సవరించేందుకు కూడా సిద్ధమయ్యారు. రాజకీయ సంస్కరణలను చేపట్టేందుకు జులై 25న రిఫరెండానిు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు. అంటే... తానే శాశ్వతంగా అధ్యక్షడిగా ఉండేలా ఆయన చూసుకుంటారనడంతో సందేహం లేదు.