Swedish sex festival: మైమరిచి డ్యాన్స్‌లు వేశారు... కరోనాకు ఛాన్స్ ఇచ్చారు...స్వీడన్‌లో కాక రేపుతున్న ఓ వేడుక
అధికారులు ఎంత మొత్తుకున్నా చాలా మందికి కోరోనా సీరియస్‌నెస్ తెలియడం లేదు. అలాంటి సంఘటనే స్వీడన్‌లో జరిగింది.
Ängsbacka 2021 పేరుతో ఏర్పాటు చేసిన తంత్రా ఈవెంట్ కరోనా వ్యాప్తికి కారణమైంది. ఈ ఈవెంట్‌లో వారం రోజుల పాటు వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. జంటలను మాత్రమే ఆహ్వానించే ఈ కార్యక్రమంలో మైమరిచిపోయి డ్యాన్సులు చేస్తారు.
కొంపముంచిన ఈవెంట్
స్వీడన్‌లోని వర్మాల్యాండ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఇప్పుడు కాకారేపుతోంది. దీని కారణంగానే కరోనా వ్యాప్తి చెందిందని అధికారులు తేల్చారు. అందుకే ఈ కార్యక్రమం నిర్వహించిన వారిపై చర్యలకు సిద్ధమవుతున్నారు.
అనుమతివ్వని పోలీసులు
వచ్చే వారంతా కరోనా బారిన పడే ఛాన్స్ ఉందని గ్రహించిన పోలీసులు ఈవెంట్‌కు అనుమతి ఇవ్వలేదు. అయినా గుట్టుచప్పుడు కాకుండా ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి వెళ్లిన వచ్చిన వారిలో వందమందికిపైగా కరోనా బారిన పడ్డారు. దీంతో విషయం బయటకు తెలిసింది.
ASLO READ: అఫ్గాన్ నుంచి ఇండియాకు చేరుకున్న 392 మంది.. వైరల్ అవుతోన్న చిన్నారి వీడియో
పోలీసులు ఫైర్
ఈ కార్యక్రమం జరగడంపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల వైరస్ ప్రమాదం పొంచి ఉందని వార్నింగ్ ఇచ్చినా పట్టించుకోకుండా కార్యక్రమం నిర్వహించిన నిర్వాహకులపై మండిపడ్డారు. ఇప్పుడు ఈ ఈవెంట్ నిర్వహించిన వారికి శిక్ష పడే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.
వందమందికిపైగా కరోనా బారినపడటంతో ఇప్పుడు ఆర్గనైజర్‌లు క్షమాపణలు చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి, తమ అసోసియషన్‌తో ట్రావెల్ చేసే వారిని క్షమాపణలు కోరుతున్నట్టు చెప్పారు. మోల్కోమ్ నివాసితులను కూడా క్షమించాలని Ängsbacka's స్పోక్స్ పర్శన్ వేడుకున్నారు.
ఇప్పటికే డెల్టా వేరియంట్ భయం
ఇప్పటికే స్వీడన్‌లో డెల్టా వేరియంట్ విజృంభణ కంగారు పెట్టిస్తోంది. దీనికి తోడు ఇలాంటీ ఈవెంట్స్‌తో మరింత ప్రమాదం పొంచి ఉందని జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
స్థానికులు ఆగ్రహం
ఈ ఈవెంట్ గురించి తెలిసిన తర్వాత కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఆర్గనైజర్స్‌పై మండిపడుతున్నారు.
భారీగా బుకింగ్స్
ప్రభుత్వం అన్ని కార్యక్రమాలకు అనుమతి ఇవ్వడంతో ఈ సెక్సీయట్ ఈవెంట్ ప్లాన్ చేశారు నిర్వాహకులు. గతేడాది కరోనా కారణంగా ఈ కార్యక్రమం నిర్వహించలేకపోయామని... ఇప్పుడు పూర్తి కరోనా నిబంధనల మేరకు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. దీంతో భారీగా జనం తంత్రా ఈవెంట్‌కు స్లాట్‌లు బుక్ చేసుకున్నారు.
వ్యాధి బారిన పడిన వారిలో 30 నుంచి 40 మంది మాత్రమే ఐసోలేషన్‌లో ఉన్నారు. అందులో ఒకరిద్దరు మాత్రమే ఆసుపత్రిలో చేరే పరిస్థితి ఉందని తెలుస్తోంది.
జంటల కోసం నిర్వహించే ఈవెంట్ రద్దు
కరోనా వ్యాప్తి కారణంగా ఈనెల చివర్లో నిర్వహించే వేడుకలు రద్దు చేసిందా సంస్థ. కోవిడ్ -19 యాక్టివ్ కేసులు ఎక్కువగా ఉన్నందున, కాన్షియస్ క్యాంపింగ్ వీక్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.
ఈవెంట్‌కు రండి... ప్రేమలో మునిగిపోండి
ప్రేమలో ఉన్న పవిత్రతను తెలియజేయడానికి, జీవితంపై ఉన్న భయం, సెక్సువల్‌గా ఉన్న అపోహలు తొలగించుకోవడానికి ఈ కార్యక్రమంలో ఉపయోగపడుతున్నాయని ఆ సంస్థ తెలిపింది.
ASLO READ:మలబార్ 21 సముద్ర విన్యాసాలకు రెడీ.. గువామ్‌కు చేరుకున్న భారత్ నౌకలు