అన్వేషించండి
Malabar- 21: మలబార్ 21 సముద్ర విన్యాసాలకు రెడీ.. గువామ్‌కు చేరుకున్న భారత్ నౌకలు
మలబార్ 21 నౌకాదళ విన్యాసాలు
1/3

బంగాళాఖాతంలో నాలుగు దేశాల మధ్య జరగనున్న మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొనేందుకు భారత నౌకాదళాలు సిద్ధమయ్యాయి. శివాలిక్, కాడ్మాట్ అనే రెండు నౌకలు ఇప్పటికే అమెరికాలోని ద్వీప భూభాగమైన గువామ్‌కు చేరుకున్నాయి. శివాలిక్, కాడ్మాట్ నౌకలను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించారు. ఐఎన్ఎస్ శివాలిక్‌కు కెప్టెన్ కపిల్ మెహతా, ఐఎన్‌ఎస్ కాడ్మాట్‌కు కమాండర్ ఆర్‌కే మహారాణా నాయకత్వం వహిస్తున్నారు.
2/3

ఈ రెండు నౌకలలో పలు ఆయుధాలు, సెన్సార్‌లు ఉన్నాయి. ఇవి మల్టీ రోల్ హెలికాప్టర్‌లను తీసుకెళ్లగలవు. భారతదేశ యుద్ధనౌక నిర్మాణ సామర్ధ్యాల పెరుగుదలను సూచికలుగా ఇవి విన్యాసాల్లో పాల్గొంటున్నాయి. భారత్, ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా దేశాలు మలబార్ 21 నౌకాదళ సముద్ర విన్యాసాల్లో పాల్గొంటాయి.
Published at : 22 Aug 2021 05:49 PM (IST)
వ్యూ మోర్

Nagesh GVDigital Editor
Opinion




















