అన్వేషించండి

Sunita Williams: మరికొన్ని రోజులు స్పేస్‌లోనే సునీత విలియమ్స్‌- తిరిగొచ్చే డేట్‌పై రాని స్పష్టత

World News in Telugu: స్పేస్‌లో ఉన్న సునీత విలియమ్స్‌ మరికొన్ని రోజులు అక్కడ ఉండబోతున్నారు. కీలకమైన రెండు పరిశీలనలు ఉన్నందు బోయింగ్ స్టార్‌లైనర్‌ తిరిగి రావడం ఆలస్యమవుతోంది.

Sunita Williams Stuck In Space: భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ మరికొన్ని రోజులు అంతరిక్షంలో ఉండబోతున్నారు. బోయింగ్ స్టార్‌లైనర్‌ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి భూమి పైకి తీసుకురావడం కాస్త ఆలస్యమయ్యే ఛాన్స్‌ ఎక్కువగా కనిపిస్తోంది. సాంకేతిక సమస్యలను సమీక్షించడానికి మరి కొంత సమయం కావాలని అందుకే ఈ ప్రక్రియ వాయిదా వేస్తున్నట్టు  నాసా తెలిపింది. 

ప్రక్రియను ఎప్పుడు ప్రారంభిస్తుంది... వ్యోమగాములను ఎప్పుడు తిరిగి తీసుకొస్తోందో మాత్రం నాసా స్పష్టం చేయలేదు. ప్రస్తుతం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సునీతా విలియమ్స్‌తోపాటు బుచ్ విల్మోర్ ఉన్నారు. 

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన బోయింగ్ స్టార్‌లైనర్‌ ను జూన్ 14న భూమిపైకి తీసుకురావాలని మొదట షెడ్యూల్ చేశారు. ఇంకా పరిశోధనలు మిగిలే ఉన్నాయని తొలిసారి వాయిదా వేశారు. తర్వాత దాన్ని జూన్‌ 26కి మార్చారు. ఇప్పుడు ఇది కూడా వీలు కాదని ఇంకా చేయాల్సి చాలానే ఉందని నాసా అభిప్రాయపడుతోంది. 

"మిషన్ మేనేజర్లు జూన్ 24, జూలై 2న స్పేస్‌ వాక్‌లు చేయాల్సి ఉంది. రేపటి భవిష్యత్తులో తిరిగి వెళ్లి వచ్చే అవకాశాలపై పరిశోధనలు చేస్తున్నాం. " అని నాసా చెప్పినట్టు రాయిటర్స్ తెలిపింది. 

" చాలా సమయం తీసుకుంటాం. మిషన్ మేనేజ్‌మెంట్ టీమ్ ప్రక్రియను మే ఫాలో అవ్వాల్సి ఉంటుంది." అని NASA వాణిజ్య క్రూ ప్రోగ్రామ్ మేనేజర్ స్టీవ్ స్టిచ్ అన్నారు. కక్ష్యలో ఉన్న స్టార్‌లైనర్‌ పని తీరుపై ఎలాంటి అనుమానం అవసరం లేదంటున్నారు. ఇకపై చేసే పరిశీలన మొత్తం రాబోయే మిషన్‌లలో సిస్టమ్ అప్‌గ్రేడ్‌లపైనే ఉంటుందని చెప్పారు. 

బోయింగ్ వ్యోమనౌక ద్వారా గతంలో రెండు మనవ రహిత పరీక్షలు చేశారు. రెండూ ఫెయిల్ అయ్యాయి. వాటి నేర్చుకున్న పాఠాలతో దీన్ని రూపొందించి ఇందులో ఇద్దరు వ్యోమగాములను పంపించారు.  వారిని ఎప్పుడు తీసుకొస్తున్నారనేది మాత్రం చెప్పలేదు. స్టార్‌లైనర్ స్పేస్‌క్రాఫ్ట్‌లో సమస్యలు, అవసరమైన అదనపు పరీక్షల కారణంగా రాక ఆలస్యం అయ్యే అవకాశం ఉందని సమాచారం.

రాయిటర్స్ ప్రకారం ఈ మిషన్ కోసం బోయింగ్ 4.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేయాలని భావిస్తే ఇప్పటికే అంతకు మించి 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు అయినట్టు సమాచారం. 
2020 నుంచి స్పేస్‌ఎక్స్ క్రూ డ్రాగన్‌ను అనుసరించి వ్యోమగాములను ISSకి తీసుకెళ్లగల సామర్థ్యం ఉన్న రెండో కంపెనీగా బోయింగ్‌కు ఈ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేయడం చాలా అవసరం. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Donald Trump Tariffs: సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KKR Batting Strategy IPL 2025 | లక్నో మీద గెలవాల్సిన మ్యాచ్ ను కేకేఆర్ చేజార్చుకుంది | ABP DesamNicholas Pooran 87 vs KKR | లక్నోకు వరంలా మారుతున్న పూరన్ బ్యాటింగ్Priyansh Arya Biography IPL 2025 | PBKS vs CSK మ్యాచ్ లో సెంచరీ బాదిన ప్రియాంశ్ ఆర్య ఎంత తోపంటేDevon Conway Retired Out Controversy | కాన్వే రిటైర్డ్ అవుట్ అవ్వటం సీఎస్కే కొంప ముంచిందా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu:  పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
పన్ను ఎగవేతలకు ఏఐతో చెక్ పెట్టండి - ఆదాయార్జన శాఖలకు చంద్రబాబు సూచనలు
Telangana HSRP : తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
తెలంగాణలో హైసెక్యూరిటీ నెంబర్‌ ప్లేట్ తప్పనిసరి- రేవంత్ సర్కారు సంచలన నిర్ణయం
Andhra Pradesh Latest News: 1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
1,332 కోట్లతో తిరుపతి–పాకాల–కాట్పాడి రైల్వే డబ్లింగ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం
Donald Trump Tariffs: సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
సుంకాల విధింపు 3 నెలలు వాయిదా- టారిఫ్స్‌పై వెనక్కి తగ్గిన అమెరికా- చైనాకు దక్కని ఊరట
Kakani Govardhan Reddy:  కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో దొరకని రిలీఫ్ - దొరికితే అరెస్టు చేసేందుకు పోలీసుల గాలింపు
Revanth Reddy : తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
తెలంగాణలో బీజేపీని అడుగు పెట్టనివ్వబోం - గుజరాత్ ఏఐసీసీ ప్లీనరీలో రేవంత్ కీలక ప్రసంగం
Tahawwur rana: కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
కసబ్ బాబు లాంటి టెర్రరిస్టును అమెరికా నుంచి లాక్కొస్తున్నారు -తహవూర్ రాణాకు ఉరి శిక్ష విధిస్తారా ?
Pant Fake Fielding:  పంత్ ఫేక్ ఫీల్డింగ్..! కేకేఆర్ ను బోల్తా కొట్టించాడా..?  సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ 
పంత్ ఫేక్ ఫీల్డింగ్..! కేకేఆర్ ను బోల్తా కొట్టించాడా..?  సోష‌ల్ మీడియాలో ర‌చ్చ‌ 
Embed widget