Viral News: స్పేస్ నుంచి సునీతా విలియమ్స్ దీపావళి విషెస్, వైరల్ అవుతోన్న వీడియో
Sunita Williams Sends Diwali Wishes | గత కొన్ని నెలలుగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉంటున్న సునీతా విలియమ్స్ అక్కడి నుంచే దీపావళి విషెస్ తెలిపారు. వైట్ హౌస్ లో వీడియో ప్రదర్శించారు.
Sunita Williams Diwali Greetings From Space Station | వాషింగ్టన్: ప్రపంచమంతా దీపావళి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. పలు దేశాల్లో దీపావళిని ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. భారత్ లో అయితే దీపావళి వేడుకల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీతా విలియమ్స్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (International Space Station) నుంచి దీపావళి శుభాకాంక్షలు చెప్పారు.
దాదాపు ఏడాదిన్నర అంతరిక్షంలోకి వెళ్లిన సునీతా విలియమ్స్ సహా సానా బృందం NASA స్టార్‌లైనర్ వ్యోమనౌక మానవ ప్రయాణానికి తగిన స్థితిలో లేదని ప్రకటించారు. దాంతో వ్యోమగాములు స్పేస్ స్టేషన్ లోనే ఉంటున్నారు. అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో తాజాగా దీపావళి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ నుంచి సునీతా విలియమ్స్ పంపిన దీపావళి శుభాకాంక్షలు వీడియోను వైట్ హౌస్ ప్రదర్శించింది. ఐఎస్ఎస్ నుంచి మీకు దీపావళి శుభాకాంక్షలు అని చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Happening Now: President Biden delivers remarks at a White House celebration of Diwali. https://t.co/gTKjvtzCEi
— The White House (@WhiteHouse) October 28, 2024
నేడు అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌లో, ప్రపంచ వ్యాప్తంగా సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ దీపావళి శుభాకాంక్షలు అని సునీత విలియమ్స్ పండుగ విషెస్ తెలిపారు. వైట్‌హౌస్‌లో దీపావళి వేడుకల్లో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, డెమోక్రాట్స్ అధ్యక్ష అభ్యర్థి, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌లకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఆస్ట్రోనాట్ సునీత విలియమ్స్ కృతజ్ఞతలు తెలిపారు.
"ఈ ఏడాది భూమికి 260 మైళ్ల ఎత్తులో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్‌లో దీపావళి జరుపుకునే అరుదైన అవకాశం నాకు లభించింది. దీపావళి సహా ఇతర భారతీయ పండుగల గురించి మా నాన్న చిన్నప్పటి నుంచి మాకు బోధించారు. తద్వారా భారత సాంస్కృతిక మూలాలను మాలో ఉంటేలా చేశారు. దీపావళి అనేది మనకు సంతోషకరమైన సమయం. ప్రపంచంలో పలు దేశాల్లో దీపావళి సెలబ్రేట్ చేసుకుంటారు. కానీ ఈ ఏడాది గతానికి భిన్నంగా మా మా వ్యోమగాములతో కలిసి అంతరిక్షంలో పండుగ చేసుకుంటున్నాను. మాకు ఈ అవకాశం కల్పించిన అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ లకు ధన్యవాదాలు" అని సునీతా విలియమ్స్ వీడియో సందేశంలో తెలిపారు.
అప్పటినుంచి అంతరిక్షంలోనే..
సునీతా విలియమ్స్ జూన్ 6, 2023లో బోయింగ్ స్టార్‌లైనర్ అంతరిక్ష నౌకలో మరో ఆస్ట్రోనాట్ బుచ్ విల్మోర్‌తో కలిసి అంతరిక్ష యాత్ర ప్రారంభించారు. అప్పటినుంచి వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోనే పరిశోధనలు కొనసాగిస్తున్నారు. వాస్తవానికి ఇప్పటికే సునీతా విలియమ్స్, విల్మోర్ తిరిగి రావాల్సి ఉంది. కానీ నాసా స్టార్ లైనర్ స్పేస్ వాహికిల్ లో సాంకేతిక సమస్యలు వచ్చినందున స్పేస్ లోనే ఉండిపోయారు. ఈ వ్యోమగాములు ఫిబ్రవరి 2025లో SpaceX డ్రాగన్ క్యాప్సూల్‌లో భూమి మీదకు తిరిగి రానున్నారు. అంతరిక్ష కేంద్రంలోనే సునీతా విలియమ్స్ తన 59వ పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్నారు.
వైట్‌హౌస్‌లోని బ్లూ రూమ్‌లో దీపాలు వెలిగించి వేడుకలు ప్రారంభించిన అధ్యక్షుడు జో బైడెన్.. దక్షిణాసియా కమ్యూనిటీ అమెరికా లైఫ్ ను సుసంపన్నం చేశారు, సంపూర్ణం చేశారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీపావళి వేడుకలు వైట్ హౌస్ లో గర్వంగా జరుపుకుంటున్నామని బిడెన్ అన్నారని పీటీఐ రిపోర్ట్ చేసింది.