By: ABP Desam | Updated at : 18 Apr 2022 03:48 PM (IST)
శ్రీలంకకు కొత్త ఆర్థిక మంత్రి - వెంటనే అప్పు కోసం అమెరికాకు పయనం !
ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుపోయిన శ్రీలంకను ( Sri lanka ) బయటపడేసేందుకు అధ్యక్షుడు గోటబయ రాజపక్సే పదిహేడు మంది మంత్రుల్ని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ఇప్పటి వరకూ మంత్రులుగా బాధ్యతలు తీసుకోవడానికి చాలా మంది వెనుకాడారు. కానీ ఇప్పుడు ఒక్క సారే పదిహేడు మంది అంగీకరించారు. వారందరితో ప్రమాణ స్వీకారం కూడా చేయించారు.
ప్రెసిడెంట్ రాజపక్సేగా ( Rajapakes ) బాధ్యతలు చేపట్టిన తరువాత ఇది మూడో కేబినెట్ విస్తరణ. ( Cabinet Ministers ) ఎనిమిది మందికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మిగతా వారంతా కొత్త వాళ్లే.
ఒక నిమ్మకాయ రూ.60- శ్రీలంకకు ఎందుకు ఈ దుస్థితి? తెలుగు రాష్ట్రాల పరిస్థితేంటి?
శ్రీలంక దేశం చెత్త ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది . విదేశీ మారక ద్రవ్యం కొరత ఏర్పడటంతో ఆహారం, ఇంధనం, మెడిసిన్ దిగుమతిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో శ్రీలంక మిత్ర దేశాల నుంచి అవసరమైన వస్తువులను సాయం కోరాల్సి వస్తోంది. అత్యవసర సాయం కోసం శ్రీలంక అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ( IMF ) నుండి $ 4 బిలియన్ల బెయిలౌట్ ప్యాకేజీని కోరుతోంది. ఇందుకోసం శ్రీలంక ప్రతినిధి బృందం అమెరికా వెళ్లింది. కొత్తగా నియమితుడైన ఆర్థిక మంత్రి అలీ సబ్రీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఏప్రిల్ 19-24 మధ్య ఐఎంఎఫ్‌తో చర్చలు జరపనుంది. ప్రస్తుతం తీవ్రమైన విదేశీ మారక ద్రవ్య సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశ ఆర్థిక వ్యవస్థను రక్షించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ రాజీనామా- విపక్షాలకు అధ్యక్షుడి బంపర్ ఆఫర్
ఆర్థిక పరిస్థితి కారణంగా ప్రధాని మహింద రాజపక్స, అధ్యక్షుడు గోటబయ రాజపక్స రాజీనామా చేయాలనే డిమాండ్లతో భారీ నిరసనలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ప్రధాని మహీందా రాజపక్స జాతిని ఉద్దేశించి ప్రత్యేకంగా ప్రసంగించారు. ప్రజలు ఓపిక పట్టాలని కోరారు. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ప్రజలు వీధుల్లోకి రావడం మానేయాలని అభ్యర్థించారు. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో శ్రీలంక ప్రభుత్వ యాజమాన్యంలోని పెట్రోలియం కంపెనీ వాహనాలకు ఇంధన కోటాను నిర్ణయించింది. ఓ పరిమితి మేరకు పెట్రోల్ కొనగలరు. మరో వైపు ఆర్థిక సాయం అందించేందుకు భారత్ కూడా అంగీకరించింది. 2 బిలియన్ల డాలర్ల వరకు ఆర్థిక సాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. కొత్త ఆర్థిక మంత్రి ప్రయత్నాలతో శ్రీలంక కనీసం ఊపిరి పీల్చుకునే పరిస్థితి అయినా వస్తుందని అక్కడి ప్రజలు ఆశిస్తున్నారు.
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Writer Review - 'రైటర్' రివ్యూ: హెడ్ కానిస్టేబుల్ కేసులో ఇరుక్కుంటే? - ఆహాలో విడుదలైన సముద్రఖని సినిమా ఎలా ఉందంటే?
Vivo T2x 5G: రూ.11 వేలలోనే వివో 5జీ ఫోన్ - 6000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా!
Kishan Reddy On TRS: తెలంగాణలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి పెట్టుబడులు కేంద్రం ఘనతే- ప్రజలు గమనిస్తున్నారన్న కిషన రెడ్డి
AP In Davos : దావోస్ నుంచి ఏపీకి రూ. 1లక్షా 25వేల కోట్ల పెట్టుబడులు - జగన్ పర్యటన విజయవంతమయిందన్న ప్రభుత్వం !