New York Battlefied: యూట్యూబర్ ఇచ్చే గిఫ్టుల కోసం రోడ్లపైకి వేల మంది, న్యూయార్క్ వీధుల్లో రణరంగం, తీవ్ర ఉద్రిక్తత
New York Battlefied: సోషల్ మీడియాలో స్ట్రీమర్ ప్రకటించిన గివ్‌అవే గిఫ్టుల కోసం వేలాది మంది ఎగబడ్డారు. న్యూయార్ వీధుల్లో రణరంగం సృష్టించారు.
New York Battlefied: యూట్యూబర్లు, ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్లు తమ అభిమానుల కోసం అప్పుడప్పుడు గివ్‌అవే ఇస్తుంటారు. కామెంట్లలో పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడీ ఇవ్వాలని, ఏదైనా యాప్‌లో లాగిన్ అవ్వాలని, డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలని చెప్పి.. అలా చేసిన వారికి బహుమతులు ఇస్తామని ప్రకటిస్తుంటారు. లక్షలకొద్దీ ఫాలోవర్లు ఉండే యూట్యూబర్లు అయితే ఐఫోన్లు, బైక్ లు కూడా ఫ్రీగా ఇస్తామని ప్రకటిస్తుంటారు. ఇదో మార్కెట్ జిమ్మిక్కు. అటు ఫాలోవర్స్ ను కాపాడుకోవడం, కొత్త వారిని ఆకర్షించడంతో పాటు.. వారు ప్రచారం చేసే కంపెనీకి కొత్త వినియోగదారులను తీసుకురావడం కోసం ఈరకంగా ఫ్రీగా గిఫ్టులు ఇస్తుంటారు. దీనినే సోషల్ మీడియా పరిభాషలో గివ్‌అవే (Giveaway) అంటుంటారు. ఈ గివ్‌అవే కాన్సెప్ట్ చాలా బాగా క్లిక్ కావడంతో.. ప్రతి ఒక్క యూట్యూబర్ ఎప్పడో ఒకప్పుడు ఇలాంటి గివ్‌అవేలు ప్రకటిస్తుంటారు. అచ్చంగా అలాంటి ఓ గివ్‌అవే ను ప్రకటించి అనుకోని చిక్కుల్లో పడ్డాడు అమెరికాకు చెందిన ఆన్ లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్.
అమెరికాకు చెందిన 21 ఏళ్ల ఆన్ లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ గివ్‌అవే ఇస్తానని ప్రకటించి చిక్కుల్లో పడ్డాడు. అతడు ఇచ్చే గిఫ్ట్స్ ను తీసుకునేందుకు వేలాది మంది ఒక్కసారిగా న్యూయార్క్ వీధుల్లో పోటెత్తారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. యువతీ యువకులు న్యూయార్క్ వీధుల్లో అల్లర్లకు కారణం అయ్యారు. దీంతో న్యూయార్క్ నగరం రణరంగంగా మారింది. న్యూయార్క్ లో శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆన్ లైన్ ఇన్‌ఫ్లుయెన్సర్ కై సీనట్ (Kai Cenat) పై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సిద్ధమయ్యారు. కై సీనట్ మన్‌హటన్ యూనియన్ స్క్వేర్ పార్క్ లో శుక్రవారం సాయంత్రం లైవ్ స్ట్రీమిగ్ చేయననున్నట్లు తన ఇన్ స్టా పేజీలో ఓ పోస్టు పెట్టాడు. అంతేగాక తన ఈవెంట్ కు వచ్చే వారికి ప్లే స్టేషన్ 4 గేమ్ కన్సోల్స్ సహా వివిధ గిఫ్ట్ లు ఇస్తానని ప్రకటించాడు. దీంతో ఈ ఈవెంట్ కు సీనట్ అబిమానులు వేలాదిగా తరలివచ్చారు. 2 వేల మందికిపైగా యువత సీనట్ ను చూసేందుకు మన్ హటన్ పార్క్ కు పోటెత్తారు. దీంతో న్యూయార్క్ వీధులన్నీ కిక్కిరిసిపోయాయి. వీరిని అదుపు చేసేందుకు పోలీసులు అక్కడికి చేరుకుని బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలోనే ఉద్రిక్తత చోటు చేసుకుంది. యువత రెచ్చిపోవడంతో ఆ ప్రాంతమంతా రణరంగంగా మారింది.
Also Read: Apple India Revenue: భారత్‌లో జూన్ త్రైమాసికంలో ఆపిల్ అమ్మకాల రికార్డు, రెండంకెల వృద్ధి నమోదు
కై సీనట్ అభిమానులు మన్ హటన్ పార్క్ వీధుల్లో వాహనాలను అడ్డగించి ధ్వంసం చేశారు. బాటిళ్లు విసురుకోవడం, కార్లపై దాడి చేయడంతో ఆ ప్రాంతంలో చూస్తుండగానే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఘర్షణ చోటు చేసుకోవడంతో అక్కడున్న అధికారులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. దీనంతటికి కారణమైన కై సీనట్ ను పోలీసులు అక్కడి నుంచి మరో ప్రాంతానికి తరలించారు. అల్లర్లకు కారణం అయిన సీనట్ పై క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు.
కై సీనట్ ఎవరు?
కై సీనట్ వయస్సు 21 ఏళ్లు. అతడో వీడియో క్రియేటర్. ట్విచ్ అనే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్‌లో సీనట్ కు 65 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. యూట్యూబ్, ట్విట్టర్ లోనూ సీనట్ కు లక్షల్లో అభిమానులు ఉన్నారు. గత సంవత్సరం సీనట్ స్ట్రీమర్ ఆఫ్ ది ఇయర్ గా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్ లో సీనట్ ను 5.5 మిలియన్ల ఫాలో అవుతున్నారు.
View this post on Instagram