Heart disease risk : వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోండి - ఇరవై శాతం గుండె జబ్బులు తగ్గించుకోండి ! స్కీమ్ కాదు పరిశోధన రిపోర్ట్
Sleeping : వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోతే గుండె జబ్బులు వచ్చే పర్సంటేజీ ఇరవై శాతం వరకూ తగ్గిపోతోందని తాజా పరిశోధనలో తేలింది. అయితే వారం రోజులు తక్కువ నిద్రపోయి వారాంతాల్లో ఇది కవర్ చేస్తే కుదరదు.
Sleeping more on weekends may cut heart disease risk by up to 20 Percent : ఆరోగ్యపరమైన సూత్రాల్లో కంటి నిండా నిద్ర ఒకటి. ఒంటికి కష్టమే కాదు.. మంచి విశ్రాంతి కూడా ఉండాలి. అప్పుడే శరీర భాగాలు ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతాయి. రోజుకు కనీసం ఏడు గంటల నిద్ర వల్ల ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు చాలా కాలం నుంచి చెబుతూ వస్తున్నారు. కానీ ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ఏడు గంటల నిద్ర ఉన్న వారు అదృష్టవతులే. సమయం ఉన్న వారు కొందరు... సమయం ఉన్నా నిద్ర రాని వారు కొందరు. ఇలా అనేక సమస్యలతో అనేక మంది ఉంటున్నారు. ఇలా సరిగ్గా నిద్రపోని వారికి గుండె సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఇప్పటికే పరిశోధకులు వెల్లడించారు.
ఆరోగ్యం కోసం హెర్బల్ ప్రొడక్ట్స్ వాడుతున్నారా ? అయితే ఓ సారి లివర్ టెస్ట్ చేయించుకోవాల్సిందే !
అయితే గుండె సంబంధిత సమస్యలు రావడానికి నిద్రలేమి ఒక్కటే సమస్య కాదు. అనేక కారణాలు ఉంటాయి. అయితే రిస్క్ ను తగ్గించుకోవడానికి నిద్ర చాలా ముఖ్యం. ఇటీవల చైనాలోని స్టేక్ కీ లేబోటరరీ ఆఫ్ ఇన్ ఫెక్షియస్ డీసెజెస్ అనే సంస్థ నిర్వహించిన స్టడీలో కొన్ని కీలక విషయాలు బయట పడ్డాయి. వారాంతాల్లో ఎక్కువ సేపు నిద్రపోయే వారిలో గుండె సమస్యలు వచ్చే పర్సంటేజీ ఇరవై శాతం తక్కువగా ఉందట. యూకే బయోబ్యాంక్ ప్రాజెక్టులో పాల్గొన్న 90వేల మంది సెల్ఫ్ రిపోర్టింగ్ ఆధారంగా ఈ అంచనాకు వచ్చారు. రోజూ ఏడు గంటల కన్నా తక్కువ నిద్రపోతున్న వారి విషయంలో సమస్యలు ఎక్కువగా ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ స్టడీలో లభించిన సమాచారంతో పాటు ఆస్పత్రులకు చెందిన పధ్నాలుగేళ్ల వ్యాధుల చికిత్స రిపోర్టులను ఎనలైజ్ చేస్తే.. నిద్ర లేమి వల్ల గుండె సమస్యలు 19 శాతం పెరుగుతున్నాయని గుర్తించారు. వారాంతంలో ఎక్కువగా నిద్రపోయేలారు.. మిగతా రోజుల్లో తక్కువగా నిద్రపోతూంటారు. అయితే.. తాము నిద్రను కవర్ చేసుకంటున్నామని.దాని వల్ల ఆరోగ్య సమస్యలు రావని అనుకుంటున్నారు. కానీ ఈ భావన కరెక్ట్ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్ద లేకలేకపోవడం వల్ల హర్మోన్స్ స్ట్రెస్‌కు బ్యాలెన్స్ తప్పుదాయని అవి దీర్ఘ కాలంలో తీవ్ర ఆరోగ్య సమస్యలు సృష్టిస్తాయని పరిశోధకులు అంచనా వేశారు.
ప్రతి మనిషి ప్రశాంతమైన నిద్రకు ఓ స్పష్టమైన షెడ్యూల్ రూపొందించుకుని దాని ప్రకారం కంటిన్యూ చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. శరీర ఆరోగ్య, ఇమ్యూనిటీ వ్యవస్థలో నిద్ర అనేది అత్యంత కీలకమని వైద్యులు చెబుతున్నారు. క్వాలిటీ నిద్ర విషయంలో రాజీ పడకూడదని చెబుతున్నారు. వారాంతంలో ఎక్కువ నిద్రపోవడ ంవల్ల మేలు జరుగుతంది కానీ.. ఆ పేరుతో మిగతా రోజుల్లో తక్కువ నిద్ర ఉండకూడదని వారి అభిప్రాయం. మరి ఫాలో అయిపోతారా ?