Russia Vs US: ట్రంప్ ప్రాణానికి గ్యారంటీ లేదు - పుతిన్ హెచ్చరిక !
Donald Trump: ట్రంప్ ప్రాణానికి గ్యారంటీ లేదని రష్యా అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఆయన తెలివిగలవాడని జాగ్రత్తగా ఉంటారని కూడా చెప్పుకొచ్చారు.
Russian President Putin has warned that Trumps life is not guaranteed: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా కాబోయే అధ్యక్షుడడు డొనాల్డ్ ట్రంప్‌కు సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై హత్యాయత్నాలు జరిగిన విషయం తెలుసుకుని దిగ్భ్రాంతి చెందానని.. ఇప్పటికీ ఆయనకు అత్యంత తీవ్రమైన ముప్పు పొంచి ఉందని అన్నారు. కజకిస్తాన్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లి అక్కడ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ తనకు మిత్రుడు అంటూనే ఆయన ప్రాణానికి ప్రమాదం హెచ్చరికలు చేయడం వెనుక వేరే అర్థాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
పుతిన్‌కు.. ట్రంప్‌కు మధ్య స్నేహం
ప్రస్తుతం అమెరికాకు బద్ద శత్రువుగా రష్యా ఉంది. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్ కు పెద్ద ఎత్తున ఆయుధాలు ఇస్తున్నారు. వాటిని రష్యాపై ప్రయోగించేందుకు అనుమతి ఇస్తున్నారు. ఉక్రెయిన్ ఇదే అవకాశం అనుకుని రష్యాపై అమెరికా ఇచ్చిన ఆయుధాలన్నింటినీ ప్రయోగిస్తోంది. దీంతో పుతిన్ అణుదాడికి సిద్దమని చెబుతున్నారు. అయితే పుతిన్‌కు..ట్రంప్‌కు మధ్య స్నేహం ఉంది. జనవరిలో ట్రంప్ వైట్ హౌస్‌లోకి అడుగు పెట్టిన తర్వాత పరిస్థితులు మారుతాయని పుతిన్ భావిస్తున్నారు. అందుకే సంయమనం పాటిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Also Read: ఒక్క బాంబుతో బ్రిటన్ మొత్తం నాశనం - సతాన్ 2 క్షిపణిని పొజిషన్‌లో ఉంచిన పుతిన్
తన అభిప్రాయమేంటో ఇంకా చెప్పని ట్రంప్
మరో వైపు రష్యా, ఉక్రెయిన్ మధ్య వివాదంలో అసలు తన అభిప్రాయం ఏమిటో ఇంకా ట్రంప్ ప్రకటించలేదు. ఎన్నికల ప్రచారంలో మాత్రం యుద్ధాలు ఆపేస్తానని ప్రకటించారు. అయితే అదంతా తేలిక కాదు. ఇప్పటికే బైడెన్ ఇజ్రాయెల్ ,లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒఒప్పందం చేయించారు. కానీ రష్యా చర్చలు జరిపేందుకు సిద్ధంగా లేదు. అందుకే ఈ వివాదాన్ని ట్రంప్ కు వదిలేసి వెళ్లనున్నారు. ట్రంప్ ఏం చేస్తారన్నదానిపైనే మూడో ప్రపంచయుద్ధం అధికారికంగా ప్రారంభమవుతుందా. ట్రంప్ చాకచక్యంతో ఆగిపోతుందా అన్నది తెలియాల్సి ఉంది.
Also Read: బంగ్లాదేశ్ లో నరకం అనుభవిస్తున్న హిందువులు - ఇస్కాన్ చిన్మయ్ కృష్ణ అరెస్టే సాక్ష్యం !
బ్రిటన్ పై దాడికి ఏర్పాట్లు చేసుకుంటున్న రష్యా
మరో వైపు ఉక్రెయిన్‌కు బ్రిటన్ కూడా ఆయుధాలు సరఫరా చేస్తోంది. ఈ కారణంగా బ్రిటన్ పై అణుబాంబులు వేయడానికి సాతాన్ 2 అనే క్షిపణుల్ని పుతిన్ రెడీ చేసుకున్నారు. ఈ క్షిపణి ఒక్క బాంబు వేస్తే బ్రిటన్ మొత్తం నాశనం అయిపోతుందని ఆయుధాల నిపుణులు చెబుతున్నారు. తమ దేశంపై దాడి చేయడానికి ఆయుధాలు ఇచ్చే ఏ ఒక్క దేశాన్ని తాము క్షమించబోమని.. వారు కూడా తమ శత్రువులేనని పుతిన నిర్మోహమాటంగా చెబుతున్నారు.