Ukraine Winner : యుద్ధంలో విన్నర్ ఉక్రెయిన్ - డిసైడయ్యేది ఎప్పుడంటే ?
రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం అంతం లేకుండా సాగుతోంది. అయితే రష్యా తీవ్ర నష్టం ఎదుర్కొంటోందని త్వరలో చేతులెత్తేస్తుందన్న అంచనాలను అగ్రదేశాలు వేస్తున్నాయి.
రెండు నెలలకుపైగా సుదీర్ఘంగా సాగుతున్న రష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో చివరికి విజేతగా ఉక్రెయిన్ నిలిచే అవకాశం కనిపిస్తోందని ఇతర అగ్రదేశాలు అంచనా వేస్తున్నాయి. యూకే రక్షణ మంత్రిత్వ శాఖ నిరవధిక పోరును ఎదుర్కొంటున్న ఉక్రెయిన్ పరిస్థితి గురించి ఒక నివేదిక విడుదల చేసింది. భూ, గగన , జల మార్గాలలో దాడులు సాగించిన రష్యా బలగాలు ఈ యుద్ధంలో భారీ నష్టాన్నే చవిచూశాయని యకే ప్రకటించింది.
Latest Defence Intelligence update on the situation in Ukraine - 15 May 2022
— Ministry of Defence 🇬🇧 (@DefenceHQ) May 15, 2022
Find out more about the UK government's response: https://t.co/VBPIqyrgA5
🇺🇦 #StandWithUkraine 🇺🇦 pic.twitter.com/n6dBVZHAos
రస్తుతం యుద్ధంలో రష్యా కాస్త వెనకబడిందని తెలిపింది. రష్యా బలగాల పోరాట సామార్థ్యం తగ్గిందని, చాలామంది సైనికులు పట్టుబడుతున్నారని వెల్లడించింది. రానున్న రోజల్లో రష్యా దళాలు వేగవంతంగా దాడులు చేసే అవకాశం లేదని అంచనా వేసింది. అంతేగాదు ఖార్కివ్ ప్రాంతంలో కీవ్ దళాలు ఉక్రెయిన్ - రష్యా సరిహద్దుకు చేరుకున్నట్లు ఉక్రెయిన్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహదారు వాడిమ్ డెనిసెంకో ప్రకటించారు. వచ్చే నెల రోజుల్లో రష్యా దళాలు ముందడుగు వేసే అవకాశం లేదని చెబుతున్నారు.
ఆస్ట్రియా లోని ఉక్రెయిన్ మాజీ రాయబారి ఒలెగ్జాండర్ షెర్బా "మిస్టర్ పుతిన్ మేము సాధించాం". "శత్రు రాజ్య సరిహాద్దుకు చేరుకున్నాం" అనే క్యాప్షన్ జోడించి మరీ ఉక్రెయిన్, రష్యా సరిహద్దుకు చేరుకున్న ఉక్రెయిన్ సైనికులను చూపించే వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
“Mr. President, we reached Ukraine’s state border with the enemy state. Mr. President, we made it!”
— olexander scherba🇺🇦 (@olex_scherba) May 15, 2022
Glory to #Ukraine! Glory to Heroes!#StandWithUkraine️ #UkraineWillWin #RussiaUkraineWar
pic.twitter.com/kdD6kD1w3x
అంతేగాదు బెర్లిన్‌లో జరిగిన నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో జర్మనీకి చెందిన అన్నలెనా బేర్‌బాక్ ఉక్రెయిన్‌కి తమ మాతృభూమి రక్షణ కోసం తమవంతు మద్దతుగా సైనిక సహాయం అందిస్తామని చెప్పారు. మరోవైపు నాటో చీఫ్ జెన్స్ స్టోల్టెన్‌బర్గ్ ఉక్రెనియన్లు తమ ధైర్య సాహసాలతో తమ మాతృభూమిని రక్షించుకోవడమే కాకుండా ఈ యుద్ధంలో తప్పక విజయం సాధిస్తారని భావిస్తున్నారు.