Russia Ukraine War: ఇది కనుక పేలితే ఐరోపా అంతమే- దాని కన్నా 10 రెట్లు ఎక్కువ : జెలెన్‌స్కీ
Russia Ukraine War: రష్యా దాడిలో అణువిద్యుత్ కేంద్రం పేలితే అది ఐరోపా అంతానికి దారితీస్తుందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు.
Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా చేస్తోన్న యుద్ధం గురించి ఆ దేశ అధ్యక్షుడు వ్లొదిమిర్ జెలెన్‌స్కీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా రష్యా.. అణు విద్యుత్ కేంద్రాలపై దాడి చేయడం చాలా ప్రమాదకరమన్నారు. ఉక్రెయిన్‌లోని జపోరిజ్జియా అణుకర్మాగారంపై రష్యా దాడి చేయడాన్నికి ఆయన ఖండించారు. ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
ఇది ఐరోపా అంతమే
Терміново! pic.twitter.com/MuXfniddVT
— Володимир Зеленський (@ZelenskyyUa) March 4, 2022
ఇప్పుడు ఓకే
ఈ అణు విద్యుత్తు కేంద్రంపై రష్యా దాడి చేసిన తర్వాత ఆ ప్రాంతంలో మంటలు చెలరేగటం వల్ల ఆందోళన నెలకొంది. అయితే, జాతీయ అత్యవసర సేవల విభాగం, అగ్నిమాపక దళాలు తీవ్రంగా శ్రమించి మంటలను ఆర్పివేసినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితులు సాధారణంగానే ఉన్నట్లు చెప్పారు.
ప్రపంచనేతల ఆందోళన
ఈ దాడిపై ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. యూకే ప్రధాని బోరిస్ జాన్సన్.. జెలెన్‌స్కీతో ఫోన్‌లో మాట్లాడారు. ఎట్టిపరిస్థితుల్లోనూ రష్యా సేనలు ఎదుర్కోవాలని, తగిన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా జెలెన్‌స్కీతో మాట్లాడారు. అణు విద్యుత్ కేంద్రాన్ని జాగ్రత్తగా రక్షించాలన్నారు.