Russia-Ukraine War: దూకుడుగా సాగుతోన్న రష్యా సేనలు- దక్షిణ ఉక్రెయిన్ నగరాలు హస్తగతం
Russia-Ukraine War: ఉక్రెయిన్‌లో రష్యా సేనలు దూకుడుగా ముందుకు సాగుతున్నాయి. దక్షిణ ఉక్రెయిన్‌లోని పలు నగరాలను తమ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా తెలిపింది.
Russia-Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా సేనల దండయాత్ర కొనసాగుతోంది. దక్షిణ ఉక్రెయిన్‌లోని కెర్సెన్, బెర్డియాన్స్‌క్ నగరాలు, హెయిన్‌చెస్క్ పట్టణం, ఓ విమానాశ్రయాన్ని తమ అధీనంలోకి తీసుకున్నట్లు రష్యా రక్షణ ప్రతినిధి ప్రకటించారు.
The latest on the fourth day of Russia's invasion of #Ukraine from @DaveClark_AFP & Sergey Bobok
— AFP News Agency (@AFP) February 27, 2022
▶️ Street fighting rages in Kharkiv
▶️ Russian banks excluded from SWIFT
▶️ 260,000 people flee conflict
▶️ Russia faces stiff resistance in Kyivhttps://t.co/c1LbKNHT4k
దక్షిణ ఉక్రెయిన్‌లో ఇప్పటివరకు 52 కిలోమీటర్ల మేర రష్యా సేనలు వెళ్లినట్లు తెలిపారు. దక్షిణ ఉక్రెయిన్ నగరాలను మొత్తం బ్లాక్ చేసినట్లు పేర్కొన్నారు.
ఖార్కివ్ ప్రాంతంలో 302 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ క్షిపణి వ్యవస్థ, బక్ M-1 వాయు రక్షణ వ్యవస్థతో పాటు ఉక్రెయిన్ సాయుధ బలగాలు తమకు లొంగిపోయినట్లు తెలిపారు.
వలసలు
రష్యా దాడులతో ఉక్రెయిన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రజలు ప్రాణాలు అరచేత పట్టుకుని దేశాన్ని వీడుతున్నారు. రష్యా దాడులు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 3,68,000 మంది ఉక్రెయిన్ ప్రజలు దేశం విడిచి పక్క దేశాలకు తరలి వెళ్లిపోతున్నారు.
శాంతి చర్చలకు నో
రష్యాతో శాంతి చర్చలకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ స్పందించారు. బెలారస్ వేదికగా రష్యాతో శాంతి చర్చలకు తాము ఒప్పుకోవడం లేదన్నారు. బెలారస్ నుంచే రష్యా తమపై యుద్ధం ప్రారంభించిందని.. అలాంటి ప్రాంతంలో చర్చలు కుదరవని ఆయన అన్నారు. క్షిపణి దాడులు జరుగుతోన్న చోట శాంతి చర్చలు ఎలా కుదురుతాయని ఆయన అన్నారు.
అంతకుముందు ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధమని రష్యా అధికారిక భవనం క్రెమ్లిన్ ప్రకటించింది. ఇందుకోసం రష్యా బృందం బెలారస్ గోమల్‌కు నగరానికి చేరుకుంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో పలు నగరాల్లో రష్యా విధ్వంసం సృష్టించింది. ఉక్రెయిన్ సైనిక వాహనాలు, పలు యుద్ధ విమానాలను నామరూపాల్లేకుండా చేసినట్లు రష్యా రక్షణ శాఖ పేర్కొంది.
Also Read: Watch Video: 'చివరి భారతీయుడు స్వదేశానికి వచ్చే వరకు మేం నిద్రపోం'
Also Read: Russia Ukraine War: రెండు నగరాలను స్వాధీనం చేసుకున్న రష్యా- కీవ్‌లో ఉక్రెయిన్ ప్రతిఘటన