By: ABP Desam | Updated at : 08 May 2022 04:55 PM (IST)
Edited By: Murali Krishna
ఉక్రెయిన్‌లో మారణకాండ- పాఠశాలపై బాంబు దాడి- 60 మంది మృతి
Russia Ukraine Crisis: ఉక్రెయిన్‌లో రష్యా మారణకాండ కొనసాగుతోంది. తాజాగా తూర్పు ఉక్రెయిన్‌లోని ఓ పాఠశాలపై రష్యా సైన్యం బాంబు దాడి చేసింది. ఈ దాడిలో 60 మంది వరకు చనిపోయారు.
#UPDATE Around 60 people sheltering in a village school in eastern Ukraine are feared dead after it was hit by an air strike, the regional governor of #Lugansk (see map) said on Sunday https://t.co/EqtbqiOJJo pic.twitter.com/jgWKhFmIFF
— AFP News Agency (@AFP) May 8, 2022
దారుణం
లుహాన్సక్లోని బిలోహోర్వికా ప్రాంతంలో ఉన్న పాఠశాలపై రష్యా సైనికులు బాంబు దాడి చేశారు. ఈ ఘటన జరిగిన సమయంలో భవనంలో 90 మంది ఉండగా 27 మందిని మాత్రమే సురక్షితంగా బయటకు తీసుకురాగలిగిన్నట్లు లుహాన్సక్ గవర్నర్ తెలిపారు.
విజయోత్సాహం
రెండో ప్రపంచ యుద్ధంలో నాజీల మీద సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది మే 9న రష్యాలో విజయ దినోత్సవం జరుపుకుంటారు. దీంతో అదే రోజున పుతిన్ సేనలు తమపై మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని ఉక్రెయిన్ తెలిపింది. దీంతో ఉక్రెయిన్ బలగాలు అప్రమత్తమయ్యాయి.
మేరియుపొల్ నగరంపై రెండ్రోజులుగా దాడుల తీవ్రత పెరగడంతో అక్కడ బలగాలను కట్టుదిట్టం చేశాయి. ఈ రెండ్రోజుల్లో రష్యా మరింతగా విరుచుకుపడే అవకాశం ఉందని భావిస్తోంది. ఈ అంచనాలను నిజం చేస్తూ రష్యా బాంబు దాడులతో ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తోంది.
భద్రతా మండలి
మరోవైపు ఉక్రెయిన్‌లో శాంతి, భద్రతలకు సంబంధించిన పరిస్థితులపై ఐరాస భద్రతా మండలి ఆందోళన వ్యక్తంచేసింది. శాంతియుత పరిష్కారాన్ని కనుగొనాలని సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు పలికింది. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేసింది. యుద్ధం మొదలయ్యాక ఇలాంటి ప్రకటన వెలువడడం ఇదే తొలిసారి. యుద్ధం, ఘర్షణ అనే పదాలను వాడకుండా.. ఐరాసలోని సభ్య దేశాలన్నీ వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని హితవు పలికింది.
Also Read: Navneet Rana On Uddhav Thackeray: దమ్ముంటే నాపై పోటీకి రండి- ఏ సెంటరైనా ఓకే: నవనీత్ రాణా
Also Read: Rahul Gandhi on LPG Price Hike: 'ఇప్పుడు ఒకటొస్తే, అప్పుడు రెండొచ్చేవి'- మోదీకి రాహుల్ గాంధీ కౌంటర్
Texas School Shooting : మృత్యుంజయురాలు ఆ చిన్నారి - అమెరికాలో కాల్పుల నుంచి ఎలా తప్పించుకుందంటే ?
International Booker Prize 2022: ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ అందుకున్న గీతాంజలి శ్రీ- ఆ రికార్డ్ ఆమెదే!
Imran Khan: పాక్ ప్రధానికి ఇమ్రాన్ ఖాన్ డెడ్‌లైన్- 6 రోజుల్లోగా చేయకపోతే!
Viral Video: కాక్‌పిట్‌లోనే అంతా కానిచ్చేశారు- ట్రైనీతో పైలట్ రొమాన్స్!
World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?
Regional Parties Income : అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు విరాళాల వెల్లువ - డీఎంకే, వైఎస్ఆర్సీపీకే సగం !
Ram Charan: రామ్ చరణ్ కోసం వరి చిత్రం - 264 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన అభిమాని
NTR Jayanthi: ఎన్టీఆర్ జయంతి - NBK 107 సినిమాలో కత్తి పట్టిన బాలకృష్ణ మాస్ లుక్ విడుదల
IAS Keerti Jalli : అస్సాంలో ఐఏఎస్ కీర్తి జల్లి సాహసం - అంతా ఫిదా ! ఇంతకీ ఆమె ఎవరో తెలుసా ?