By: ABP Desam | Updated at : 27 Aug 2023 09:06 PM (IST)
వాగ్నర్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ ( Image Source : Getty )
Wagner Chief Prigozhin's Death Confirm:
ఇటీవల జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయింది ప్రైవేటు సైన్యం వాగ్నర్ గ్రూపు అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ అని రష్యా అధికారికంగా ప్రకటించింది. విమాన ప్రమాదం తరువాత లభ్యమైన 10 మృతదేహాలకు ఫోరెన్సిక్ పరీక్షలు జరిపిన తరువాత నిర్ధారణ కమిటీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. రష్యా రాజధాని మాస్కో నుంచి సెయింట్ పీటర్స్‌బర్గ్‌కు వెళ్తున్న విమానం ఆగస్టు 23న కుప్పకూలింది. మంటలు చెలరేగి అందులోని సిబ్బంది, ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ప్లాన్ ప్రకారం ప్రిగోజిన్ ను హత్య చేశారని, ప్రమాదంగా చిత్రీకరించారని ప్రచారం జరిగింది.
అసలేం జరిగిందంటే..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై కొన్ని నెలల కిందట తిరుగుబాటు చేసిన ప్రైవేట్ సైన్యం వాగ్నర్ గ్రూప్ చీఫ్ యెవ్‌గెనీ ప్రిగోజిన్ మృతి చెందాడు. విమాన ప్రమాదంలో ప్రిగోజిన్ చనిపోయారని రియా నోవోస్టి వెల్లడించారు. వాగ్నర్ అధినేత ప్రయాణిస్తున్న విమానం అకస్మాత్తుగా కుప్పకూలిన ప్రమాదంలో ప్రిగోజిన్ తో పాటు 10 మంది వరకు మృతిచెందినట్లు రష్యా అత్యవసర సేవల విభాగం తెలిపింది. విమానం కూలిపోయిన ప్రదేశంలో పది మృతదేహాలను కనుగొన్నట్లు రష్యా ఏజెన్సీ వర్గాలు వెల్లడించాయి.
ట్వెర్ ప్రాంతంలో ఓ విమానం కూలిపోయింది. అందులో ప్రైవేట్ సైన్యం వాగ్నర్ అధినేత యెవ్‌గెనీ ప్రిగోజిన్ ప్రయాణిస్తున్నారు. కానీ విమాన ప్రమాదంతో పెను విషాదం చోటుచేసుకుందని TASS వార్తా సంస్థతో పాటు RIA నోవోస్టి, ఇంటర్‌ఫాక్స్ రిపోర్ట్ చేశాయి. ఆ విమానంలో మొత్తం 10 మంది ప్రయాణిస్తుండగా, అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నారు. దురదృష్టవశాత్తూ అందులో ప్రయాణిస్తున్న అంతా చనిపోయారని రష్యా ఎమర్జెన్సీ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇటీవల రష్యా అధినేతకు ఎదురుతిరిగిన ప్రిగోజిన్ విమాన ప్రమాదంలో చనిపోవడంతో అనుకోకుండా జరిగిందా, లేదా ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అని ప్రపంచ వ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అనుమానం వ్యక్తం చేసిన బైడెన్, ఎలాన్ మస్క్
ప్రిగోజిన్ చనిపోయిన విమాన ప్రమాదంపై అమెరికా అధ్యక్షుడు బైడెన్, టెస్లా, ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ సైతం అనుమానం వ్యక్తం చేశారు. జో బైడెన్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదంపై ఆశ్చర్యపోలేదన్నారు. రష్యాలో పుతిన్ ఉండగా ఇలాంటివి జరగకుండా ఎలా ఉంటాయని అర్థం వచ్చేలా బైడెన్ మాట్లాడారు.
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ప్రిగోజిన్ మృతిపై ఇదే విధంగా స్పందించారు. ఓ ఎక్స్ యూజర్ మరీ ఎక్కువ సమయం పట్టలేదని ట్వీట్ చేయగా, తాను అనుకున్న దాని కంటే ఆలస్యమైందని పేర్కొన్నారు. ఇదో సైకలాజికల్ ఆపరేషన్ అయ్యే అవకాశాలు కూడా కొద్దిగా ఉన్నాయని మస్క్ చెప్పుకొచ్చారు.
పుతిన్ పై వాగ్నర్ చీఫ్ తిరుగుబాటు!
ఉక్రెయిన్ పై సైనిక చర్యలో రష్యా ఆర్మీకి ప్రైవేట్ ఆర్మీ వాగ్నర్ చీఫ్ ప్రిగోజిన్ అండగా నిలిచారు. ప్రభుత్వం చర్యలను తీవ్రంగా ఖండించిన ప్రిగోజిన్.. ఈ జూన్ లో రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తిరుగుబాటు చేశారు. ఉక్రెయిన్ పై సైనిక చర్యలో అండగా నిలిచిన ప్రిగోజిన్ ఎదురు తిరగడంతో రష్యాలో పరిస్థితి అదుపుతప్పినట్లు కనిపించింది. బెలారస్ అధ్యక్షుడు లుకషెంకో జోక్యం చేసుకుని సర్దిచెప్పడంతో ప్రిగోజిన్ తన బలగాన్ని వెనక్కి తీసుకున్నారు.
న్యూడ్ ఫోటోల కోసం టీనేజ్ బాలికపై ఒత్తిడి, ఒప్పుకోనందుకు పోలీసుల్నే హడలెత్తించాడు!
London bridge: కిందకు దిగని ఫేమస్ లండన్ బ్రిడ్జ్, దాంతో భారీగా ట్రాఫిక్ జామ్
Suicide Blast: పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి, 52 మంది మృతి
Viral Video: లైవ్ డిబేట్‌లో కొట్టుకున్న పాకిస్థాన్ నేతలు
Vivek Ramaswamy: అక్రమ వలసదారుల పిల్లల పౌరసత్వాన్ని వ్యతిరేకిస్తున్నా:వివేక్ రామస్వామి
RK Roja: ఆటో డ్రైవర్ అవతారంలో మంత్రి రోజా, లోకేశ్‌పై తీవ్ర వ్యాఖ్యలు - ముందస్తు బెయిల్ ఎందుకు?
Pedda Kapu Review - 'పెదకాపు 1' రివ్యూ : గోదారి నెత్తుటి రాజకీయం - శ్రీకాంత్ అడ్డాల సినిమా ఎలా ఉందంటే?
ODI World Cup 2023: అక్షర్ పటేల్ సంచలన పోస్టులు, కావాలనే తప్పించారా! అతడి బాధ వర్ణనాతీతం
Disney Password Sharing: ఐ వానా ఫాలో ఫాలో ఫాలో యూ - నెట్‌ఫ్లిక్స్‌ను అనుసరిస్తున్న డిస్నీ!
/body>