POK: పీవోకేలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం - తిరుగుబాటు విభజనకు దారి తీస్తుందా?
Pakistan: పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేలాది మంది రోడ్డెక్కారు. పాకిస్తాన్ కు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించారు.

Rebellion erupts in Pakistan occupied Kashmir: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీవ్ర నిరసనలు పెరుగుతున్నాయి. అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ) పిలుపున "షటర్ డౌన్ వీల్-జామ్" అనే పేరుతో ఉద్యమం ప్రారంభించారు. వేలాది మంది తిరుగుబాటుకు దిగారు. ముజాఫరాబాద్, మిర్పూర్, కోట్లీ, రావల్ కోట్, నీలం వ్యాలీ, కెరాన్ వంటి ప్రాంతాల్లో మార్కెట్లు, షాపులు, రవాణా సేవలు పూర్తిగా స్తంభించాయి. ప్రభుత్వం ఇంటర్నెట్ ఆపేసింది. భారీ భద్రతా బలగాలను నియమించింది.
పీవోకేలో జరిగిన ఈ నిరసనలు, గత 70 సంవత్సరాలుగా కొనసాగుతున్న రాజకీయ, ఆర్థిక అణచివేతలకు వ్యతిరేకంగా ఒక పెద్ద తిరుగుబాటుగా మారాయి. అవామీ యాక్షన్ కమిటీ (ఏఏసీ), లాయర్స్ అసోసియేషన్లు, సివిల్ సొసైటీ సంస్థల మద్దతుతో ఈ ఉద్యమం నడుస్తోంది. ఆదివారం ప్రారంభమైన ఈ స్ట్రైక్ తో పూర్తిగా జన జీవనం స్తంభించింది. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోల్లో, వేలాది మంది నినాదాలు చేస్తూ మార్చ్ చేస్తున్న సన్నివేశాలు కనిపిస్తున్నాయి.
#BREAKING: Thousands of civilians to launch massive protests in Pakistan Occupied Kashmir (PoK) tomorrow against Pakistani Govt under leadership of Awami Action Committee. Pak forces bring thousands of troops from Punjab to crush protest. Internet shutdown from midnight in PoK. pic.twitter.com/nfeSviJHsC
— Aditya Raj Kaul (@AdityaRajKaul) September 28, 2025
ప్రభుత్వ మంత్రులు , పీవోకే అడ్మినిస్ట్రేషన్‌తో జరిగిన చర్చలు విఫలమైన తర్వాత, ఈ ఉద్యమం మరింత తీవ్రంగా మారింది. పాకిస్తాన్‌లో నివసించే కాశ్మీర్ రెఫ్యూజీల కోసం పీవోకే అసెంబ్లీలో ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్ున్నారు. అలాగే మాంగ్లా హైడ్రోపవర్ ప్రాజెక్ట్‌కు సంబంధించి న్యాయమైన విద్యుత్ టారిఫ్‌లు , చౌక ధరలతో మౌలిక సౌకర్యాలు వంటి డిమాండ్లను చేస్‌తున్నారు. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం, నిరసనలను అణచివేయడానికి కఠిన చర్యలు తీసుకుంది. మొబైల్ ఫోన్లు, ల్యాండ్‌లైన్లు, ఇంటర్నెట్ సేవలు, సోషల్ మీడియాను కూడా నిలిపివేశారు. . పంజాబ్ ప్రావిన్స్ నుంచి వేలాది సైనికులు, ఇస్లామాబాద్ నుంచి 1,000 మంది పోలీసులను నియమించారు. ఎంట్రీ-ఎగ్జిట్ పాయింట్లను సీల్ చేసి, ఫ్లాగ్ మార్చ్‌లు జరిపారు.
The uprisings in PoK and the Republic Of Balochistan demand urgent global intervention against Pakistan’s occupation.
— Mir Yar Baloch (@miryar_baloch) September 27, 2025
27.9.2025
Pakistan has repeatedly chosen violence over peaceful resolution of conflicts. In Bangladesh, the
Punjabi-dominated Pakistani military unleashed… pic.twitter.com/BdpPFVzjbh
ముజాఫరాబాద్‌లో నిరసనలు హింసాత్మకంగా మారాయి. పాక్ ఆర్మీ, ఐఎస్‌ఐ మద్దతుతో ముస్లిం కాన్ఫరెన్స్‌కు చెందిన వారు పౌరులపై కాల్పులు జరిపారు. ఈ ఘటనల్లో ఇద్దరు చనిపోయారు. 22 మంది గాయపడ్డారు. గత వారంలో, ఖైబర్ పక్తుంఖ్వా ప్రావిన్స్‌లో పాక్ ఎయిర్ ఫోర్స్ దాడుల్లో 30 మంది పౌరులు మరణించారు. ఈ హింస, ప్రభుత్వం ప్రజల అణచివేతకు మరో ఉదాహరణగా మారింది.





















