అన్వేషించండి

Putin fall in Love: లేటు వ‌య‌సులో ఘాటు ప్రేమ‌, 39 ఏళ్ల యువ‌తితో 71 ఏళ్ల పుతిన్ ప్రేమాయణం

ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ ప్రేమ‌లో ప‌డ్డారు. ఆయ‌న వ‌య‌సు 71 ఏళ్లు. ఆయ‌న మిత్రుడి కుమార్తె, 39 ఏళ్ల యువ‌తితో ఆయ‌న గాఢ‌మైన ప్రేమ‌లో ప‌డ్డారు. ప్ర‌స్తుతం ఈ వార్త ప్ర‌పంచ వ్యాప్తంగా హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Putin Fall In Love: ఎంత ఘాటు ప్రేమ‌యో.. అనే పాట‌లు తెలిసిందే. అయితే.. ఈ ఘాటు ప్రేమ స్వీట్ ఎయిటీన్‌లో అయితే బాగుండేది.. కానీ, మ‌న‌వ‌ళ్ల‌ను ఎత్తుకోవాల్సిన వ‌య‌సులో ప్రేమ‌లో ప‌డ‌డ‌మే ఆశ్చ‌ర్యంగాను, ఆస‌క్తిగాను మారింది. అది కూడా.. త‌న‌కంటే 31 ఏళ్ల వ‌య‌సు చిన్న‌దైన యువ‌తితో ప్రేమాయణం ప్రారంభించ‌డం మ‌రింత విస్మ‌యానికి దారితీసింది. ఈ ప్రేమ‌లో ప‌డింది ఎవ‌రో కాదు.. ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాద‌మిర్ పుతిన్‌(Vlodamir putin). త‌ల‌లు బోడులైనా త‌ల‌పులు బోడుల‌వునా.. అన్న నానుడి త‌న‌కు వ‌ర్తించ‌ద‌ని చెప్పేస్తున్నారు. అత్యంత స‌న్నిహితుడి కుమార్తె(Daughter)తోనే ఆయ‌న ప్రేమ‌లో ప‌డ్డారు. 

ప‌రిచ‌యం అక్క‌ర్లేనేని పేరు.. 

పుతిన్‌. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ర‌ష్యా అధ్య‌క్ష‌డి(Russia president)గా కంటే.. ఉక్రెయిన్‌పై యుద్ధం విష‌యంలో ఆయ‌న సాగిస్తున్న దూకుడు చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇప్పుడు తాజా ర‌ష్యా విప‌క్ష నాయ‌కుడు అలెక్సీ నావల్నీ(Alexi Navalny) మ‌ర‌ణం వెనుక కూడా పుతిన్ పేరు జోరుగా వినిపిస్తోంది. అమెరికా అధ్య‌క్షుడు జో బైడెన్ కూడా ఆరోపిస్తున్నారు. ఇంత‌టి వివాదాస్ప‌ద నాయ‌కుడు ర‌ష్యా చ‌రిత్ర‌లో లేర‌ని అంటారు. అయితే.. ఇప్పుడు ఇంత బిజీలోనూ.. ఇంత ఉత్కంఠ‌లోనూ.. పుతిన్ ప్రేమ‌లో ప‌డ్డార‌ని తెలుస్తోంది. త‌ల‌లు బోడులైనా.. త‌ల‌పులు బోడులవునా.. అన్న‌ట్టుగా పుతిన్ ఇప్పుడు ప్రేమ‌లో ప‌డ్డారు. ఓ యువ‌తిని చాలా  గాఢంగా ఆయ‌న ప్రేమిస్తున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

71.........39........ల‌వ్‌!

ప్ర‌స్తుతం పుతిన్ వ‌య‌సు 71 సంవ‌త్స‌రాలు. ఆయ‌న ప్రేమించిన ఏకాథ‌రీన్(Ekathreen) వ‌య‌సు 39 ఏళ్లు. అంటే.. ఇద్ద‌రి మ‌ధ్య దాదాపు 31 ఏళ్ల వ‌య‌సు తేడా ఉంది. అయితే.. ఇదేమీ.. వ‌న్ సైడ్ ల‌వ్ కాద‌ని అంటున్నారు. గ‌త కొన్నాళ్లుగా ఆమె కూడా.. పుతిన్‌పై మ‌న‌సు పారేసుకుంద‌ట‌. వినేందుకు కొంత ఎబ్బెట్టుగానే అనిపించినా.. నిజ‌మేన‌ని చెబుతున్నారు. ఫిజిక్ ప‌రంగా పుతిన్ చాలా ఫిట్‌గా ఉంటారు. ఆయ‌న రోజూ.. 4 గంట‌లు నిర్విరామంగా వ్యాయామం చేస్తారు. అంతేకాదు.. ఈత కొట్ట‌డం.. జంపింగ్ చేయ‌డం ఆయ‌న హాబీలు. దీంతో వ‌య‌సు 71 అయినా.. `40 +`గానే క‌నిపిస్తారు. 39 ఏళ్ల ఎకాథరీనా మిజులినాతో పుతిన్ గ‌త రెండేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నట్లు రష్యాలో చ‌ర్చ‌గా మారింది.

ఎంపీ కుమార్తె

పుతిన్‌ను ప్రేమించిన ఏకాథ‌రీనా.. ఎవ‌రో కాదు.. పుతిన్‌ను అన్ని విష‌యాల్లోనూ స‌మ‌ర్థించే మాజీ సెనెటర్‌(MP) ఎలెనా మిజులినా(Elena Mijulina) కుమార్తె. ఈమె ప్రస్తుతం క్రెమ్లిన్‌కు మద్దతుగా ఉండే ‘సేఫ్ ఇంటర్నెట్ లీగ్‌’కు హెడ్‌గా వ్యవహరిస్తున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాతో పాటు పుతిన్‌పై వచ్చే విమర్శలను తొలగించడం, లేదా ఖండించ‌డం వంటివి ఆమె చేస్తున్నారు. ఈమెతో పుతిన్ ఉక్రెయిన్ యుద్ధ స‌మ‌యం నుంచి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక‌, పుతిన్‌ ప్రేమాయణం నిజమేనంటూ ఉక్రెయిన్‌ మీడియా కూడా చెబుతోంది. టెలిగ్రామ్‌ ఛానళ్లలోనూ జోరుగా ప్రచారం జరుగుతోంది.

విడుకులు-పెళ్లి-విడాకులు!

ర‌ష్యా అధినేత పుతిన్‌కు ఎప్పుడో వివాహం కావ‌డం.. అది విడాకులు కావ‌డం కూడా అయిపోయింది. 2014లో పుతిన్‌ తన భార్య `లియుడ్మిలా` కు విడాకులు ఇచ్చారు. త‌ర్వాత ఒలిపింక్స్‌ గోల్డ్‌ మెడలిస్ట్ `అలీనా కబయేవా`తో  ప్రేమాయ‌ణం న‌డిపి.. స‌హ‌జీవ‌నం చేశారు. వీరికి ముగ్గురు పిల్ల‌లు పుట్టారు. అయితే.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో ఏమో.. వీరు దూరంగా ఉంటున్నారు. ఇక అప్ప‌టి నుంచి పుతిన్ ఒంట‌రి జీవ‌నం సాగిస్తున్నారు. ఈక‌ర‌మంలోనే ఏకాథ‌రీనాతో ల‌వ్‌లో ప‌డ్డారు.

టాప్ హెడ్ లైన్స్

Philippines Earthquake Videos: స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
స్కూల్స్ నుంచి మాల్స్ వరకు ఎటు చూసినా హాహాకారాలు.. ఫిలిప్పీన్స్ భూకంపం విధ్వంసం వీడియోలు
Israel Iran War: పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
పశ్చిమాసియాలో మళ్లీ మొదలైన యుద్ధం.. ఇజ్రాయెల్ పై బాలిస్టిక్ మిస్సైల్స్‌తో ఇరాన్ ప్రతీకార దాడులు
US Iran War Latest News: ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
ఇరాన్ నిఘా స్థావరాలపై అమెరికా బాంబు దాడులు.. గల్ఫ్ దేశాల్లో మరో అలజడి
Breaking News: పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు
పవన్ ఫామ్ హౌస్ కబ్జానే- కవిత సంచలన వ్యాఖ్యలు

వీడియోలు

Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్
Rajat Patidar Dropped After 2 IPL Trophies | మరోసారి ఆర్‌సీబీ కెప్టెన్ కు నిరాశే
Gambhir's Statement about WTC Final | WTC ఫైనల్ రేసు నుండి భారత్ అవుట్?
KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజ‌న్ల ట్రోలింగ్
IND vs AFG 1st Test Day 1 Update | తోలి టెస్ట్ లో సెంచ‌రీల‌తో రాహుల్, గిల్ స‌త్తా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy Miyapur Speech: తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నది కిషన్ రెడ్డే - మియాపూర్ సభలో 30 నెలల పాలనపై చర్చకు సీఎం రేవంత్ సవాల్!
Supreme Court Pre Marital Relationship Judgment: పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
పెళ్లికి ముందు శారీరక సంబంధం నేరం కాదు.. మచ్చ అంతకన్నా కాదు - తెలంగాణ కానిస్టేబుల్ కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
Thalliki Vandanam Scheme AP: ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
ఏపీలో తల్లికి వందనం లబ్ధిదారులకు గుడ్ న్యూస్! డబ్బులు పడే ముందు ఈ పని పూర్తి చేయండి!
Slumdog Teaser : స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
స్లమ్ డాగ్ టీజర్ రివ్యూ - విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ మ్యాజిక్
Crime Thriller OTT : ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ట్రెండింగ్‌లో రీసెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ - ఐఎండీబీలో 9.2 రేటింగ్... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Monsoon Bike Safety Tips: వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
వర్షాకాలంలో బైక్ స్కిడ్ అవ్వకూడదంటే టైర్లలో గాలి ఎంత ఉండాలి? ఈ గోల్డెన్ రూల్ పాటిస్తే మీ రైడ్‌ సేఫ్‌!
Instagram Reel Theft: రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
రీల్‌లో బంగారం చూపించారు - హోమ్‌టూర్‌ కూడా చేశారు - దొంగలకు ఇది సరిపోదా ?
This Week Theatrical Releases : పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
పెద్ది తర్వాత వారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి - ఈ మూవీస్ డోంట్ మిస్
Embed widget