Pervez Musharraf Health : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ కు తీవ్ర అస్వస్థత, కోలుకోలేని దశలో ఉన్నారని కుటుంబ సభ్యుల ప్రకటన
Pervez Musharraf Health : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన రికవరీ సాధ్యం కాని దశలో ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
Pervez Musharraf Health : పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వెంటిలేటర్‌పై లేరని, కోలుకోలేని స్టేజ్ లో ఉన్నారని తెలిపారు. ముషారప్ అమిలోయిడోసిస్ అనే వ్యాధితో బాధపడుతున్నారు. గత 3 వారాలుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రికవరీ సాధ్యం కాని, అవయవాలు పనిచేయని క్లిష్ట దశలో ఆయన ఉన్నారని ముషారఫ్ కుటుంబ సభ్యులు తెలిపారు. ముషారఫ్ 2001-2008 వరకు పాకిస్థాన్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. పాకిస్థాన్ ఆర్మీ జనరల్‌గా కూడా ముషారఫ్ పని చేశారు.
Former Pakistan President Pervez Musharraf is "not on the ventilator... Going through a difficult stage where recovery is not possible and organs are malfunctioning," says his family. pic.twitter.com/iVwC3mhPWr
— ANI (@ANI) June 10, 2022
దేశద్రోహం కేసు
పర్వేజ్ ముషారఫ్‌కు గతంలో రాజద్రోహం కేసులో పెషావర్ హైకోర్టు ప్రత్యేక న్యాయస్థానం మరణశిక్ష విధించింది. ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనానికి పెషావర్ హైకోర్టు చీఫ్ జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్ నేతృత్వం వహించారు. ముషారఫ్‌కు మరణశిక్ష విధిస్తూ 167 పేజీల వివరణాత్మక తీర్పునిచ్చారు.
"పారిపోయిన దోషిని (ముషారఫ్) పట్టుకొని, చట్ట ప్రకారం శిక్షపడేలా చేయాలి. ఒక వేళ ఉరిశిక్ష అమలు కంటే ముందే ముషారఫ్ చనిపోతే.. అతని శవాన్ని పార్లమెంట్‌కు ఈడ్చుకొచ్చి మూడు రోజులపాటు ఉరితీయాలి"- జస్టిస్ వకార్ అహ్మద్ సేథ్, ప్రత్యేక కోర్టు ప్రధానన్యాయమూర్తి
2007లో ఎమర్జెన్సీకి సంబంధించి ముషారఫ్ తీసుకున్న నిర్ణయంపై పీఎంఎల్ పార్టీ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఆయన దేశద్రోహం చేశారని నిర్ధారిస్తూ ఉరిశిక్ష విధించింది. పాకిస్థాన్ వదిలి దుబాయ్ వెళ్లిన ముషారఫ్ ఎప్పటి నుంచో అక్కడే తల దాచుకున్నారు. అయితే ఆయన ఆస్తులను జప్తు చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. రెండు దశాబ్దాల క్రితం పాకిస్థాన్ ఆర్మీ చీఫ్‌గా ఉన్న ముషారఫ్. సైనిక పాలన ద్వారా అధ్యక్ష పదవిని చేజిక్కించుకున్నారు.
Also Read : Cordelia Cruise : ఆ క్రూయిజ్‌ను రానివ్వని పుదుచ్చేరి - నడి సంద్రంలోనే షిప్.. !