అన్వేషించండి

Thailand legalises growing cannabis : గంజాయి పండించడం..వాడటం నేరం కాదని చట్టం ! ఆ దేశం ఎక్కడికో వెళ్లిపోయింది

గంజాయి పండించడం... వాడటం నేరం కాదని ధాయ్‌ల్యాండ్ చట్టం చేసింది. అంతే కాదు.. తామే రైతులకు గంజాయి మొక్కలు సరఫరా చేస్తోమంటోంది.


Thailand legalises growing cannabis : గంజాయి ఎక్కడ కనిపించిన మన దగ్గర అయితే పోలీసులు కొట్టిన చోట కొట్టకుండా కొట్టి తీసుకెళ్లి లోపలేస్తారు. అదే గంజాయి పంట పండిస్తే తాట తీస్తారు. ఎందుకంటే గంజాయి అంతహానికరం మరి. కానీ విచిత్రంగా కొన్ని దేశాలకు ఈ గంజాయి పంట.. మామూలు పంటలాగానే అనిపిస్తోంది. వాటిని నిరభ్యంతరంగా పండించుకోవచ్చని చెబుున్నాయి. అలాంటి దేశాల జాబితాలో ధాయ్‌లాండ్ కూడా చేరింది. 

వైద్య అవసరాల కోసం గంజాయిపై నిషేధం ఎత్తివేత

పర్యాటక దేశంగా ధాయ్ లాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ దేశం గంజాయి సాగును, వినియోగాన్ని చట్టబద్ధం చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. దీంతో గంజాయిని చట్టబద్ధం చేసిన తొలి ఆసియా దేశంగా థాయ్ లాండ్‌  నిలిచింది. గంజాయి మొక్కలు, పువ్వులను నార్కోటిక్‌ డ్రగ్స్‌ కేటగిరీ నుంచి తొలగిస్తున్నట్లు థాయ్ లాండ్‌  ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ వెల్లడించింది. వైద్య, పరిశ్రమ అవసరాల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు  పేర్కొంది.  

దేశానికి ఆదాయం.. రైతుకు లాభం కూడానట !

అంతేకాకుండా శుక్రవారం నుండి 10 లక్షల గంజాయి మొక్కలను ప్రభుత్వమే పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ నేరాల కింద శిక్ష అనుభవిస్తున్న సుమారు 4 వేల మందిని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. వైద్య అవసరాల కోసం మాత్రమే గంజాయి సాగును తాము ప్రోత్సహిస్తున్నామని థాయ్ లాండ్‌  ఆరోగ్య మంత్రి ప్రకటించారు. అంతేగాక, దీని సాగుతో దేశానికి పెద్ద మొత్తంలో ఆదాయం రావడంతో పాటు చిన్న రైతులకు ఉపాధి లభిస్తుందన్నారు. 

బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం మాత్రం నేరం !

బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగడం, ఎక్కువ మొత్తంలో వినియోగించడంపై మాత్రం నిషేధం కొనసాగుతుందని స్పష్టం చేసింది.   సరదా కోసం గంజాయిని వినియోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది.  బహిరంగ ప్రదేశాల్లో గంజాయి తాగితే 3 నెలల జైలు శిక్షతో పాటు 780 డాలర్ల జరిమానా విధించనున్నట్లు తెలిపారు.  ఆహార పదార్థాల్లో 0.2 శాతం కంటే ఎక్కువ మొత్తంలో గంజాయి ఉండటం కూడా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.  

ధాయ్ ల్యాండ్ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో ఈ చట్టం చేసిందో కానీ.. ఇప్పుడు ధాయ్ వెళ్లే పర్యాటకులు చాటుమాటుగా కాకుండా యథేచ్చగా గంజాయి సేవరించొచ్చన్నమాట. అక్కడి ప్రభుత్వం దూకుడు చూస్తూంటే.. త్వరలో గంజాయి రైతులకు రైతు భరోసా, రైతు బంధు లాంటి పథకాలు పెట్టినా ఆశ్చర్యపోనక్కరలేదన్న సెటైర్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

Breaking News:నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
నో ఫ్లయింగ్ జోన్‌గా భోగాపురం- 72 గంటలపాటు ఆంక్షలు 
US Iran War: ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
ఇరాన్ దాడిపై అమెరికా తీవ్ర ఆగ్రహం, క్షిపణుల ప్రయోగం, తగిన సమాధానం ఇస్తామన్న ట్రంప్‌! 
Japan Earthquake:జపాన్‌ను వణికించిన 7.1 భూకంపం: సునామీ హెచ్చరికతో హైఅలర్ట్!
జపాన్‌ను వణికించిన భూకంపం, 7.1 తీవ్రతతో కంపించిన భూమి, సునామీ హెచ్చరిక జారీ  
Elon Musk Reject Racism Claims: నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!
నా కొడుకు పేరు శేఖర్ - జాతివివక్ష ఆరోపణలపై ఇలోన్ మస్క్ షాకింగ్ కామెంట్స్!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Kurnool High Court Bench: కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ - లోకేష్ ప్రకటన - సాధ్యమేనా?
PM Modi Video:
"భుజం భుజం కలిపి నడుద్దాం" పేపర్ లీక్ నిరోధక బిల్లు ఆమోదం తర్వాత ప్రధాని మోదీ వీడియో!
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... ఎందుకు చూడాలంటే?
Kidney Health : కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
కిడ్నీ వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా.. శరీరంలో ఈ మార్పులు కనిపిస్తే పెద్ద ప్రమాదమే, జాగ్రత్త
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
వృషభం, సింహం, వృశ్చికం, మీనం సహా ఈ రాశులవారికి ఆగష్టు నెల ఎలాంటి ఫలితాన్నిస్తుంది?
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
ప్రసవం తర్వాత బాలింత చీపురు ఎందుకు ముట్టుకోకూడదు? సంప్రదాయం వెనుకున్న ఆరోగ్య రహస్యం!
Embed widget