అన్వేషించండి

Parrot Fever: ప్ర‌పంచానికి `చిలుక జ్వ‌రం`-ప‌లు దేశాల్లో మొదలైన వణుకు.. అస‌లేంటిది? ఎందుకు వ‌స్తుంది?

నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఇప్పుడు చిలుక జ్వరం ముసురుకుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఈ జ్వ‌రం బారిన ప‌డి ప‌లువురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రి ఈ జ్వ‌రం సంగ‌తేంటి? ఎలా వ‌స్తుంది?

Parrot Fever: నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌రోనా(Corona) ప్రపంచాన్ని కుదిపేసింది. ఇక, ఇప్పుడు చిలుక జ్వరం(Parrot fever) ముసురుకుంది. ఇప్ప‌టికే ప‌లు దేశాల్లో ఈ జ్వ‌రం బారిన ప‌డి  ప‌లువురు  ప్రాణాలు కోల్పోయారు. మ‌రి ఈ జ్వ‌రం(Fever) సంగ‌తేంటి? ఎలా వ‌స్తుంది?  ఒక‌వేళ వ‌స్తే ఎలా నివారించుకోవాలి?  రాకుండా ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? ఏయే ఔష‌ధాలు వినియోగించాలి? అనే విష‌యాల‌ను ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ(WHO) వెల్ల‌డించింది. 

ప్ర‌స్తుతం ఐరోపా(Europe)లోని అనేక దేశాల్లో(Countreis) చిలుక జ్వరం(Parrot fever) ముప్పు క‌ల‌క‌లం రేపుతోంది. ఈ జ్వ‌రం కారణంగా ఇప్పటివరకు 5 మరణాలు(Dead) సంభవించాయ‌ని నివేదికలు చెబుతున్నాయి(ఐరోపాలో చిలుక జ్వరంతో ఐదుగురు మ‌ర‌ణించారు). ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) నివేదిక ప్రకారం, డెన్మార్క్‌లో నలుగురు మరణించారు. నెదర్లాండ్స్‌లో ఈ 'చిలుక జ్వరం' కారణంగా ఒకరు మరణించారు. ఆస్ట్రియా, జర్మనీ మరియు స్వీడన్‌లలో డజన్ల కొద్దీ ప్రజలు ఆసుపత్రి పాలయ్యారు. అయినప్పటికీ, WHO ఈ వ్యాధి నుండి వచ్చే ప్రమాదాన్ని 'తక్కువ' కేటగిరీలోనే ఉంచ‌డం గ‌మ‌నార్హం. కొన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా.. జ్వ‌రం వ‌చ్చాక స‌రైన మందులు వాడినా.. దీని నుంచి బ‌య‌ట ప‌డొచ్చ‌ని చెబుతోంది.

ఏంటీ ప్యార‌ట్ ఫీవ‌ర్‌?

చిలుక జ్వరం(Parrot fever)  అధికారిక పేరు పిట్టకోసిస్(Pittacosis). ఇది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఇది క్లామిడియా కుటుంబానికి చెందిన బ్యాక్టీరియాతో సంక్రమణ ద్వారా వ్యాపిస్తుంది. ఈ బాక్టీరియా చిలుకలతో సహా అనేక పక్షులకు  సోకుతుంది. అలాంటి స‌మ‌యంలో ఆయా ప‌క్షుల‌తో మ‌మేక‌మ‌య్యే మ‌నుషుల‌కు కూడా ఈ బ్యాక్టీరియా  సోకుతుంది. చిత్రం ఏంటంటే ఈ వ్యాధి సోకిన పక్షిలో వ్యాధి ప్రభావం కనిపించదు. కానీ, మ‌నుషుల్లో మాత్రం ప్ర‌భావం చూపిస్తుంది. చిలుక జ్వరం సోకిన పక్షుల ఈకలు లేదా ఎండిన మలం నుండి ఈ బ్యాక్టీరియా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు సాధారణంగా తేలికపాటివిగానే ఉంటాయి. పైగా జ్వ‌రం సోకిన 14 రోజుల తర్వాత ల‌క్ష‌ణాలు కనిపిస్తాయి. జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, పొడి దగ్గు, జలుబు వంటి సమస్యలు ఉంటాయి. తీవ్రమైన సందర్భాల్లో న్యుమోనియాగా కూడా మారుతుంది.

ఏయే దేశాల్లో ప్ర‌భావం చూపిస్తోంది?

ఆస్ట్రియా(Austria): యూరప్ అంతటా చిలుక జ్వరం రోగుల సంఖ్య గ‌త కొద్ది నెలల్లో పెరిగింది. ఆస్ట్రియాలో ఏటా ఈ వ్యాధికి సంబంధించిన రెండు కేసులు నమోదవుతున్నాయి. కానీ 2023 చివరి నెలల్లో వారి సంఖ్య 14 కి చేరుకుంది. మార్చి 2024 వరకు మరో 4 కేసులు నమోదయ్యాయి.

డెన్మార్క్(Denmork): సాధారణంగా ఏటా 15 నుండి 30 వరకు చిలుక జ్వ‌రం కేసులు నమోదవుతాయి. కానీ ఫిబ్రవరి 27 వరకు కనీసం 23 కేసులు కనిపించాయి. వీరిలో 17 మందిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. వీరిలో న‌లుగురు చనిపోయారు. నమోదైన 15 కేసుల్లో 12 మంది పక్షులతో మ‌మేక‌మైన వారే న‌ని వైద్యులు తెలిపారు. 

నెదర్లాండ్స్(Nederlands): సంవత్సరంలో ఇదే సమయంతో పోలిస్తే ఇక్కడ రెట్టింపు కేసులు నమోదయ్యాయి. అంటే డిసెంబర్ 2023 తర్వాత నెదర్లాండ్స్‌లో చిలుక జ్వ‌రం కేసులు పెరిగాయి.

జర్మనీ(Germony): 2013లో జర్మనీలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది కొత్తగా 5 కేసులు వెలుగులోకి వచ్చాయి. రోగులందరూ న్యుమోనియా బారిన పడ్డారు. 16 మందిని ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. జర్మనీలో, 19 కేసులలో 5 కేసులలో, రోగులు అనారోగ్యంతో ఉన్న పెంపుడు పక్షులు, కోళ్లతో సంబంధాలు కలిగి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.

స్వీడన్(Swedan): స్వీడన్‌లోనూ రోగుల సంఖ్య పెరిగింది. డిసెంబర్ 2023 ప్రారంభంలో మొత్తం 26 కేసులు నమోదయ్యాయి. అయితే ఈ ఏడాది కేసులు తగ్గుముఖం పట్టాయి. 13 కేసులు మాత్రమే నమోదయ్యాయి.

ఏ మందులు వాడాలి?

చిలుక జ్వరంతో బాధపడేవారికి సాధారణంగా యాంటీబయాటిక్స్, ఇతర మందులు ఇస్తారు. సరిగ్గా చికిత్స చేయకపోతే ఇది న్యుమోనియా, గుండె కవాటాల వాపు, హెపటైటిస్ లేదా నరాల సంబంధిత సమస్యలతో సహా తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. పెట్ కీపర్లు, పౌల్ట్రీ కార్మికులు, తోటమాలి, పశువైద్యులకు చిలుక జ్వరం నుంచి ఎక్కువ ప్రమాదం ఉంది. WHO ప్రకారం, 1000 మంది రోగులలో ఒకరు చిలుక జ్వరం కారణంగా మరణిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget