అన్వేషించండి

Shaheen Missile: భారత్ మీద అణ్వస్త్ర క్షిపణి షాహిన్‌తో దాడికి యత్నించిన పాక్, ఎస్400తో అడ్డుకున్న ఆర్మీ

Shaheen missile | భారత్ మీద అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన షాహిన్ క్షిపణి పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే పాక్ ప్రయోగించిన క్షిపణిని సైన్యం ఎస్400తో విజయవంతంగా పేల్చేసింది.

India Pakistan War: న్యూఢిల్లీ: పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (POK)లోని 9 ఉగ్రవాద శిబిరాలను ఆపరేషన్ సిందూర్ లో భాగంగా భారత బలగాలు ధ్వంసం చేశాయి. అయితే అందుకు ప్రతీకార చర్యలు చేపట్టిన పాకిస్తాన్ డ్రోన్ దాడులు, మిస్సైల్ దాడులు చేసింది ఫైటర్ జెట్లతో సైతం సరిహద్దుల్లో దాడులకు పాల్పడగా భారత్ వారి ప్రయత్నాలు తిప్పికొట్టి బుద్ధి చెప్పింది. 

అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి ప్రయోగించిన పాక్
భారతదేశంపై దాడుల సమయంలో పాక్ ఓ అణ్వస్త్ర సామర్థ్యం ఉన్న క్షిపణి షాహిన్ ద్వారా ఆయుధాలు ప్రయోగించింది. అయితే పాక్ ప్రయోగించిన అణ్వస్త్ర సామర్థ్యం గల షాహీన్ క్షిపణి నుంచి వచ్చిన డ్రోన్లు, ఆయుధాలను భారతదేశానికి సుదర్శన చక్రంగా మారిన S-400 విజయవంతగా అడ్డుకుంది. ఈ విషయాన్ని మన సైన్యం వెల్లడించింది. పాక్ అణ్వస్త్ర క్షిపణిని గాల్లోనే విజయవంతంగా నియంత్రించడంతో ఎటువంటి నష్టం జరగలేదని భారత సైన్యం వెస్ట్రన్ కమాండ్ తెలిపింది. భారత ఆర్మీ, డీజీఎంఓ ఆపరేషన్ సిందూర్ కు సంబంధించిన వీడియోలను గ్రూపుల్లో పోస్ట్ చేస్తున్నాయి.

పాకిస్తాన్ ప్రయోగించిన షాహీన్ మిస్సైల్ (Shaheen missile) భూ ఉపరితలం నుంచి ప్రయోగించగల మీడియం రేంజ్ ఖండాంతర క్షిపణి. పాక్ దీనిని మార్చి 2015లో మొదటిసారి పరీక్షించింది. షాహిన్ మిస్సైల్ అణ్వాయుధాలతో పాటు యుద్ధ ట్యాంకులు, ఇతర సాంప్రదాయ పేలోడ్‌లను మోసుకెళ్లగల సామర్థ్యం దీని సొంతం. ఈసారి పాక్ ఆర్మీ యుద్ధట్యాంకులతో ఈ అణ్వాయుధ సామర్థ్యం ఉన్న క్షిపణిని ప్రయోగించింది. రష్యా రూపొందించిన భారత అమ్ములపొదిలో పవర్ ఫుల్‌గా ఉన్న S-400 క్షిపణితో ఆ బాలిస్టిక్ క్షిపణిని భారత సైన్యం విజయవంతంగా అడ్డుకుంది.

S-400లో మూడు భాగాలు ఉన్నాయి. ఒకటి క్షిపణి లాంచర్లు, శక్తివంతమైన రాడార్, కమాండ్ సెంటర్ ఉంటాయి. ఇది ఫైటర్ జెట్లతో పాటు, క్రూయిజ్ క్షిపణులు వేగంగా కదిలే మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణులను సైతం ఢీకొట్టగలదు. పాక్ ప్రయోగించిన షాహిన్ వంటి వేగంగా కదిలే బాలిస్టిక్ క్షిపణులను కూడా నాశనం చేయగలదు. దీని సామర్థ్యం, సుదూర లక్ష్యాలను ఛేదించనున్న కారణంగా NATO సభ్య దేశాలు ఎస్400పై అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంటాయి. ఆకాష్ సైతం పాక్ డ్రోన్ దాడులను, క్షిపణులను విజయవంతంగా ఎదుర్కొంది.

కాల్పుల విమరణకు పాక్, భారత్ అంగీకారం..

భారత్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, జమ్మూకాశ్మీర్, రాజస్థాన్ రాష్ట్రాలపై దాడులకు పాక్ ప్రయత్నించింది. మే 8, 9 తేదీలలో డ్రోన్ దాడులు, క్షిపణి దాడులకు యత్నించిన పాక్ ఆర్మీకి భాతర త్రివిధ దళాలు బుద్ధి చెప్పాయి. పాక్ నుంచి వచ్చిన డ్రోన్లు, మిస్సైల్స్, ఫైటర్ జెట్లను భారత్ విజయవంతంగా కూల్చివేసింది. అంతటితో ఆగని భారత బలగాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి కరాచీ, లాహోర్, రావల్ఫిండి సహా పలు నగరాల్లోని పాక్ ఎయిర్ బేస్ డిఫెన్స్ సిస్టమ్స్‌పై దాడులు చేసి ధ్వంసం చేసింది. దాంతో పాక్ ఆర్మీ తోక ముడిచింది. శాంతి చర్చలు అంటూ కాల్పుల విరమణకు పదే పదే రిక్వెస్ట్ చేయడం, అమెరికా సైతం సైతం యుద్ధం నష్టాన్ని చేకూరుస్తుందని సూచించడంతో మే 10న భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది. అనంతరం సరిహద్దు గ్రామాల ప్రజలు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకున్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

India Pakistan:
"భారత ఏజెంట్ పాకిస్థాన్‌లోకి ప్రవేశించి 30 మంది ఉగ్రవాదులను హతమార్చాడు"లష్కర్ కార్యకర్త సంచలన ప్రకటన!
Andhra Pradesh And Telangana Weather: తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి వర్షాలు!హైదరాబాద్‌లో కుండపోత! శాంతించిన గోదావరి, పరవళ్లు తొక్కుతున్న కృష్ణ! 
Iran US War: చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
చర్చల కోసం ఇరాన్ మమ్మల్ని అడుక్కుంటోంది, కానీ..! డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనం
Breaking News: నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి
నిమ్స్‌లో రెండున్నరేళ్లలో 1000 రొబోటిక్ సర్జరీలు.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Jaya Chiravuri Serials and US Life | జయ చిరవూరి రోజుకి ఎంత సంపాదిస్తుందో తెలుసా?
Changes In Team India Support Staff | టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌పై బిసిసిఐ వేటు
India Fielding Coach T Dilip Emotional Post | ఫీల్డింగ్ కోచ్‌గా ముగిసిన దిలీప్ ప్రయాణం
Virat Kohli World Record | వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన విరాట్ కోహ్లీ
Bumrah Ruled Out Of Test Series | శ్రీలంక టెస్ట్ సిరీస్‌ నుంచి బుమ్రా అవుట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Udhayanidhi Stalin: నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
నా అరెస్ట్ పెద్ద కామెడీ- ఎవరికీ భయపడను, మళ్లీ మళ్లీ మాట్లాడతాను: ఉదయనిధి స్టాలిన్
Telangana Police Vehicle Rapido: పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
పోలీసు వాహనాన్ని ర్యాపిడో బైక్‌గా వాడేస్తున్నారు - సోషల్ మీడియాలో వీడియో వైరల్.. విచారణకు ఆదేశం!
Khanapur MLA Wedma Bojju: ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హెచ్చరికతో దిగొచ్చిన ఫారెస్ట్ అధికారులు - రేంజ్ ఆఫీసర్ సస్పెన్షన్ -జన్నారంలో సడలిన ఉద్రిక్తత!!
AP High Court Rejects CBI Probe on Mega DSC: మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
మెగా డీఎస్సీపై వైఎస్సార్‌సీపీకి హైకోర్టు షాక్ - సీబీఐ విచారణకు నిరాకరణ - పిల్ వ్యవస్థను రాజకీయం చేయొద్దని ఘాటు వ్యాఖ్యలు!
Breastfeeding Diet : తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
తల్లిపాలు ఇచ్చే సమయంలో అతిగా తినకూడదా? డైట్‌లో చేర్చుకోవాల్సిన, తీసేయాల్సిన ఫుడ్స్ ఇవే
Harish Rao Black Magic Row: క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
క్షుద్ర పూజల ఆరోపణలతో తెలంగాణ రాజకీయాల్లో కలకలం -కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మొదలైన అరుంధతి, పశుపతి వివాదం!
Crop Insurance Scheme: రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
రూ. 84 చెల్లించి, నిశ్చింతగా ఉండండి.. ఏపీ రైతులకు ప్రభుత్వం కీలక సూచనలు
Udhayanidhi Stalin Bail: త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
త్రిషపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట! విడుదల చేయాలని కోర్టు ఆదేశం 
Embed widget