News
News
వీడియోలు ఆటలు
X

Pakistan Crisis: ఉదయం నుంచి పాకిస్థాన్‌ పార్లమెంట్‌లో పొలిటికల్ క్రికెట్- స్లాగ్ ఓవర్స్‌లో రెచ్చిపోతున్న ఇమ్రాన్, ప్రతిపక్షాలు

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భవితవ్యాన్ని నిర్ణయించే జాతీయ అసెంబ్లీ సమావేశం వాయిదాలు పడుతూ సాగింది. ఉదయం నుంచి వివిధ కారణాలతో సభకు అధికార పక్షం అంతరాయం కలిగిస్తూనే ఉంది.

FOLLOW US: 
Share:

పాకిస్థాన్‌లో తలెత్తిన రాజ్యాంగ సంక్షోభం ఇంకా ముగియలేదు. పాకిస్థాన్‌ జాతీయ అసెంబ్లీ వేదికగా అధికార, విపక్షాలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ఎత్తుకు పైఎత్తులతో వ్యవహారాన్ని సాగదీస్తున్నారు. 

ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్‌ను పదవి నుంచి తొలగించేందుకు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చించేందుకు కోర్టు ఆదేశాలతో సమావేశమైంది జాతీయ అసెంబ్లీ. దీనికి ఎన్‌ఏ స్పీకర్‌ అసద్‌ ఖైజర్‌ స్పీకర్‌గా ఉన్నారు. ఉదయం పదిన్నరకు సమావేశం స్టార్ట్ అయింది. 

సభ చర్చా సమయం స్టార్ట్ అవ్వగానే ప్రతిపక్ష నేత షెహబాజ్‌ షరీఫ్‌ పాయింట్‌ ఆర్డర్‌ లేవనెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రక్రియ చేపట్టాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. అధికార పక్షం దీని అభ్యంతరం తెలపడంతో సభ మొదటిసారి వాయిదా పడింది. 

షరీఫ్ మాట్లాడుతుండగానే పాకిస్థాన్‌ తెహ్రీక్‌ ఈ ఇన్‌సాఫ్‌(పీటీఐ) ఎంపీ రన్నింగ్ కామెంట్రీ చెప్పారు. ఆయనో బెగ్గర్‌ అంటూ గట్టిగా అరిచారు. అడ్డుకునే వాళ్లు ఎప్పుడూ తమ నాయకుడిని ఎన్నుకోలేరూ అంటు గట్టిగా నినదించారు. దీంతో ప్రతిపక్షం గొడవ చేయడం స్టార్ట్ చేసింది. ఈ గందరగోళం మధ్యే మొదటిసారి సభ వాయిదా పడింది. 

వాయిదా పడిన తర్వాత అధికార ప్రతిపక్షాలు స్పీకర్‌ను కలిశాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మిగతా ప్రక్రియను పూర్తి చేయాలని విపక్షాలు పట్టుబట్టాయి. ఇందులో విదేశాంగ మంత్రి షా మహమ్మద్‌ ఖురేషీ, అమర్‌ దోగర్‌ ప్రభుత్వం తర్వాత స్పీకర్‌ను కలిస్తే... ప్రతిపక్షం తరఫున బిలావల్‌ భుట్టో జర్దారీ, రానా సనావుల్లా, అయాజ్‌ సాదిక్‌, నవీద్‌ ఖమర్‌, మౌలానా అసాద్‌ మహ్మద్‌ ఉన్నారు. 

ఈ ప్రక్రియ ఇలా సాగుతుండగానే ఇమ్రాన్ ఖాన్ పార్టీ సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్ వేసింది. డిప్యూటీ స్పీకర్‌ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసి అవిశ్వాసంపై ఓటింగ్‌కు వెళ్లాలన్న తీర్పుపై కోర్టుకు వెళ్లింది. ఇది రాజ్యాంగ విరుద్దమని... తీర్పును పునరాలోచించాలని విజ్ఞప్తి చేసింది. 

రివ్యూ పిటిషన్‌లో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (PPP), పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N), సుప్రీం కోర్ట్ బార్ అసోసియేషన్, సింధ్ హైకోర్టు బార్ అసోసియేషన్,  సింధ్ బార్ కౌన్సిల్‌లను ప్రతివాదులుగా చేర్చింది. 

స్థానిక మీడియా కథనాల ప్రకారం పాకిస్థాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అత్యవసర క్యాబినెట్‌ సమావేశానికి పిలిచారు. అవిశ్వాస ఓటింగ్‌లో ఓడిపోయే పరిస్థితులు ఉన్నప్పటికీ ఖాన్ తీసుకున్న నిర్ణయం సంచలనంగా మారింది. 

ఖాన్ రాత్రి 9.00 గంటలకు మంత్రివర్గ సమావేశాన్ని పిలిచారు. ప్రధానమంత్రి నివాసంలో సమావేశం కానున్న మంత్రివర్గంలో కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ప్రధానిగా ఇమ్రాన్ ఖాన్‌ను తొలగించాలంటే 342 మంది సభ్యులు ఉన్న జాతీయ అసెంబ్లీలో అవిశ్వాసానికి 172 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంది. అంతకు మించే తమకు మద్దతు ఉందని ప్రతిపక్షాలు చెబుతున్నాయి.  అయినా ఎక్కడా తగ్గకుండా ఇమ్రాన్‌ ఖాన్‌ చాలా దూకుడుగా రాజకీయ ఆట ఆడుతున్నారు. 

Published at : 09 Apr 2022 08:35 PM (IST) Tags: Imran Khan no-trust vote Pakistan Crisis Cabinet Meet

సంబంధిత కథనాలు

Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు కోటీశ్వరులైపోవచ్చు!

Weirdest Job: పక్షులను తోలడమే అక్కడ పని- కొన్ని రోజులు ఈ ఉద్యోగం చేస్తే చాలు కోటీశ్వరులైపోవచ్చు!

Sudan Starvation Deaths: సుడాన్‌లో ఆకలి చావులు, 60 మంది చిన్నారుల మృత్యువాత

Sudan Starvation Deaths: సుడాన్‌లో ఆకలి చావులు, 60 మంది చిన్నారుల మృత్యువాత

Baba Neem Karoli: జుకర్‌ బర్గ్‌ని బిలియనీర్‌గా మార్చిన బాబా, స్టీవ్ జాబ్స్‌కీ ఆయనే గురువు!

Baba Neem Karoli: జుకర్‌ బర్గ్‌ని బిలియనీర్‌గా మార్చిన బాబా, స్టీవ్ జాబ్స్‌కీ ఆయనే గురువు!

India-Nepal Relations: సరిహద్దు సమస్యలు అడ్డంకి కాలేవు, భారత్ నేపాల్ బంధం ఎప్పుడూ హిట్టే - ప్రధాని మోదీ

India-Nepal Relations: సరిహద్దు సమస్యలు అడ్డంకి కాలేవు, భారత్ నేపాల్ బంధం ఎప్పుడూ హిట్టే - ప్రధాని మోదీ

Elon Musk: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!

Elon Musk: నేనే నం.1, ప్రపంచ కుబేరుడి కిరీటం మళ్లీ నాదే!

టాప్ స్టోరీస్

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

Pareshan Movie Review - 'పరేషాన్' సినిమా రివ్యూ : 'మసూద' తర్వాత తిరువీర్‌కు మరో హిట్!?

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు

CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు