Taj Mahal 22 Rooms: తాజ్‌మహల్‌లో హిందూ దేవుళ్లు! అసలు పేరు అది కాదట- ఆ 22 గదుల్లో ఏముంది?
Taj Mahal 22 Rooms: తాజ్‌మహల్‌లో ఇప్పటివరకు తెరవని 22 గదులను ఓపెన్ చేయాలని అల్‌హాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది.
Taj Mahal 22 Rooms:
తాజ్ మహల్ చుట్టూ మరోసారి వివాదం రాజుకుంది. తాజ్ మహల్ అసలు పేరు తాజ్ మహల్ కాదని దాని పేరు 'తేజోమహల్' అంటూ అల్‌హాబాద్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. అంతేకాకుండా తాజ్‌మహల్‌లో ఇప్పటివరకు తెరవకుండా ఉంచిన 22 గదులను తెరిచేలా ఆదేశాలివ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు.
Uttar Pradesh | A petition has been filed in the Allahabad High Court to open the closed rooms of the Taj Mahal
— ANI UP/Uttarakhand (@ANINewsUP) May 9, 2022
In the petition, I have demanded that the 22 rooms of the monument which are closed should be opened to find out the truth: Dr Rajneesh Singh, Petitioner (08.05) pic.twitter.com/L0uC9WdetJ
రహస్యం
అయోధ్యలో భాజపా మీడియా ఇన్ ఛార్జిగా ఉన్న డా రజనీష్ సింగ్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు. తాజ్‌మహల్‌లోని ఆ 22 ఎందుకు రహస్యంగా ఉంచారో తెలుసుకోవాలని కోరారు. వాటిలో హిందూ విగ్రహాలు, చాలా శాసనాలు ఉంటాయని భావిస్తున్నట్లు పిటిషనర్ పేర్కొన్నారు.
తాను రెండేళ్ల నుంచి సమాచారం హక్కు చట్టం ద్వారా ఈ వివరాలు తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నా ఎవరూ ఇవ్వటం లేదన్నారు. పురావస్తు శాఖను ఆదేశించి ఓ నిపుణలు కమిటీని ఏర్పాటు చేసి ఆ గదుల్లో ఏముందో తేల్చాలంటూ కోర్టును కోరారు.
హిందూ దేవుళ్లు
నాలుగు అంతస్తులు ఉన్న తాజ్‌మహల్‌లో ఎగువ, దిగువ భాగాల్లో సుమారు 22 గదులు మూసి ఉండటంపై ఎప్పటి నుంచో అనుమానాలు ఉన్నాయి. ఇవి దశాబ్దాల కాలంగా మూసి ఉన్నాయి. అయితే వీటి లోపల హిందూ దేవుళ్లు ఉన్నట్లు అనేక మంది చరిత్రకారులు, కోట్లాది మంది హిందువులు విశ్వసిస్తున్నారని ఈ పిటిషన్‌లో పేర్కొన్నారు.
ఆ గదుల్లోనే పరమేశ్వరుడు కొలువుదీరి ఉన్నారని నమ్ముతున్నట్లు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల వల్లే ఆ గదులను మూసినట్లు ఆగ్రాలోని పురావస్తు శాఖ ఇచ్చిన నివేదికను పిటిషనర్ కోర్టుకు సమర్పించారు.
Also Read: Shaheen Bagh MCD Drive: దిల్లీలో టెన్షన్ టెన్షన్- కదిలిన బుల్డోజర్లు, కూల్చివేతపై ప్రజల ఆందోళన
Also Read: NIA Raids: గ్యాంగ్‌స్టర్ దావూద్ ఇబ్రహీం అనుచరులపై NIA దాడులు