అన్వేషించండి

యుద్దంలో ఇజ్రాయెల్ కు ఊహించని పరిణామాలు-లెబనాన్, సిరియా వైపు  నుంచి దాడులు

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐడీఎఫ్ దాడులతో గాజా దద్దరిల్లిపోతోంది. రెండు దేశాల మధ్య ఇతర దేశాలకు విస్తరిస్తోంది.

పాలస్తీనాపై ఇజ్రాయెల్‌ బాంబుల వర్షం కురిపిస్తోంది. ఐడీఎఫ్ దాడులతో గాజా దద్దరిల్లిపోతోంది. రెండు దేశాల మధ్య ఇతర దేశాలకు విస్తరిస్తోంది. లెబనాన్‌, సిరియాల నుంచీ ఇజ్రాయెల్‌ వైపు రాకెట్లు దూసుకువచ్చాయి. పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌పై గాజాలో తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్‌కు, ఊహించని దాడి ఎదురైంది.  లెబనాన్‌, సిరియాల వైపు నుంచి దాడులు జరిగాయి. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా, సిరియాలో తలదాచుకుంటున్న పాలస్తీనా హమాస్‌ దళాలు, ఈ దాడులకు పాల్పడి ఉంటాయని భావిస్తున్నారు. అసలే గాజాలో ఇజ్రాయెల్‌ దాడులతో పరిస్థితి దిగజారుతుందని  ఐక్యరాజ్య సమితి భావిస్తోంది. సిరియా, లెబనాన్‌ల నుంచి దాడులపై ఆందోళన వ్యక్తం చేసిన ఐక్యరాజ్యసమితి, రెండు దేశాలు సంయమనం పాటించాలని ఉద్రిక్తతలను తగ్గించాలని కోరింది. మరోవైపు ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేస్తున్న దాడుల వెనుక ఇరాన్‌ పాత్రపై నిర్దిష్ట సమాచారమేమీ లేదని అమెరికా తెలిపింది. మిలిటెంట్ల గ్రూపులోని పోరాట విభాగానికి నిధులు అందిస్తున్నట్లు మాత్రం స్థూలంగా కనిపిస్తోందని వెల్లడించింది.

యుద్ధంలోకి సిరియా, లెబనాన్
లెబనాన్‌, సిరియాలతోపాటు ఇరాన్‌, ఖతార్‌, కువైట్‌ హమాస్‌ను సమర్థిస్తున్నాయి. హమాస్‌కు మద్దతుగా సిరియా, లెబనాన్‌ మద్దతుదారులు యుద్ధంలోకి దిగితే ఇజ్రాయెల్‌పై ముప్పేట దాడి చేసినట్లవుతుంది. మూడు వైపులా ఇజ్రాయెల్‌ యుద్ధం చేయాల్సి వస్తుంది. అన్నింటికీ మించి  ఇజ్రాయెల్ పై హమాస్‌ దాడిలో ఇరాన్‌ హస్తం ఉందని తేలితే పరిస్థితి మరింత దిగజారుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్‌కు చిరకాల శత్రువైన ఇరాన్‌ హమాస్‌ తీవ్రవాదులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందనేది బహిరంగ రహస్యం. ఈ దేశాలన్నీ హమాస్‌ కు అండగా నిలిస్తే యుద్ధం మరిన్ని విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఖతార్, ఇరాన్ దేశాలు పాలస్తీనాకు మద్దతు పలికారు. మరోవైపు అమెరికా, ఈయూ దేశాలు ఇజ్రాయెల్‌కు అండగా ఉంటున్నాయి.  

అరబ్‌లీగ్‌లోనే ఐక్యత లేదా ?
50 ఏళ్ల కిందట పాలస్తీనాకు మద్దతుగా ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత వ్యక్తం చేసిన అనేక అరబ్‌ దేశాలు, ఇప్పుడదే రీతిలో స్పందించడం లేదు. పాలస్తీనాపై సానుకూలత, సానుభూతి ఉన్నా ఇజ్రాయెల్‌ పట్ల వ్యతిరేకత చూపడం లేదు. ఈజిప్టు, బహ్రెయిన్‌, యూఏఈ హమాస్‌ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఇజ్రాయెల్‌పై వ్యతిరేకత విషయంలో అరబ్‌లీగ్‌లోనే ఐక్యత లేదు. మారుతున్న ప్రపంచ రాజకీయ భౌగోళిక సమీకరణాల్లో సౌదీ, యూఏఈలాంటి దేశాలు స్వావలంబన దిశగా సాగుతున్నాయి. ఇజ్రాయెల్‌, అమెరికాలతో సత్సంబంధాల కోసం ప్రయత్నిస్తున్నాయి. 

అబ్రహమిక్‌ ఒప్పందాలు
ఒక్కొ దేశం తమ వ్యతిరేక వైఖరిని వదిలేస్తూ ఇజ్రాయెల్‌తో ఒప్పందం చేసుకుంటున్నాయి. వీటినే అబ్రహమిక్‌ ఒప్పందాలు అంటారు. ఇప్పటికే ఈజిప్టు, యూఏఈలు ఈ బంధంలో ఉన్నాయి. త్వరలోనే సౌదీ అరేబియా ఒప్పందానికి సిద్ధమవుతోంది. బలమైన అరబ్‌ దేశమైన సౌదీ ఇజ్రాయెల్‌తో దోస్తీ కడితే పాలస్తీనా వాదన బలహీనమవుతుంది. ఆ భయంతోనే ఆబ్రహమిక్ ఒప్పందాన్ని దెబ్బతీయడానికి హమాస్‌ ఈ దాడులకు పాల్పడిందనే వాదనలు ఉన్నాయి. కేవలం తామే కాకుండా అరబ్‌ దేశాలన్నీ ఇజ్రాయెల్‌తో శత్రుత్వాన్ని కొనసాగించాలని, యుద్ధంలో పాల్గొనాలని హమాస్‌ కోరుకుంటోంది. ఏదో రకంగా యుద్ధాన్ని విస్తరించాలని చూస్తోంది. హమాస్ దళాలు ఊహించినట్లే లెబనాన్, సిరియాల నుంచి ఇజ్రాయెల్ పై దాడి జరిగింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC Gas Blowout:కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
కోనసీమలో ఎగిసిన ఓఎన్‌జీసీ గ్యాస్‌ మంటలు అదుపు చేసేందుకు రంగంలోకి అంతర్జాతీయ నిపుణులు
Malikipuram Gas Fire : కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
కోనసీమలో మళ్లీ పాసర్లపూడి భయం: నాడు జనవరి 8, నేడు జనవరి 5- నిప్పుల కుంపటిపై పచ్చని లంక గ్రామాలు!
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Nache Nache Full Song : 'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
'ది రాజా సాబ్' ర్యాప్ ట్రెండింగ్ 'నాచే నాచే' వచ్చేసింది - ముగ్గురు భామలతో డార్లింగ్ క్రేజీ డ్యాన్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Embed widget