అన్వేషించండి

Nepal Floods: నేపాల్ ఆకస్మిక వరదలు.. 1,127 చేరిన మృతుల సంఖ్య.. 4,858 మంది గల్లంతు

Nepal Floods: ఆగస్టు 26 నేపాల్ ఆకస్మిక వరదలలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ పెను విషాదంలో ఇప్పటి వరకూ 1,127 మంది మృతి చెందారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఆగస్టు 26 నేపాల్ వరదల వల్ల 1,127 మంది మరణించారు.
  • 4,858 మంది ఆచూకీ తెలియదు, గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
  • 19 వంతెనలు, రహదారులు ధ్వంసమయ్యాయి; కొత్త వరద హెచ్చరికలు.

Nepal Floods: ఆగస్టు 26న నేపాల్‌లో సంభవించిన పెను విపత్తు భారీ విధ్వంసాన్ని సృష్టించింది. ఫ్లాష్ ఫ్లడ్స్ వేలాది మందిని నిరాశ్రయులను చేయగా, వందల ప్రాణాలు బలితీసుకున్నాయి. ఈ హిమాలయ విపత్తు జరిగి దాదాపు వారం రోజులు గడిచినా, ఇంకా వేలాది మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. భద్రతా దళాలు గాలింపు చర్యలు, సహాయక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. నేపాల్ పోలీసుల ప్రకారం, బుధవారం నాటికి వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 1,127కు చేరింది. మరో 4,858 మంది కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. భద్రతా దళాలు ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 6,541 మందిని రక్షించాయి. ఈలోగా, మళ్లీ ఆకస్మిక వరదలు, నదులలో నీటిమట్టాలు పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

చిత్వాన్‌లో అత్యధికంగా  

ఇప్పటి వరకు చిత్వాన్ నుంచి 348, ఈస్ట్ నవల్పరాసి నుంచి 217, వెస్ట్ నవల్పరాసి నుంచి 190, నువాకోట్ నుంచి 155 మృతదేహాలను వెలికితీశారు. గోర్ఖా 66, ధాడింగ్ 59, రసువా 45, తనాహున్ ప్రాంతంలో 38 మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటి వరకూ 1,113 మృతదేహాలకు పోస్ట్‌మార్టం, గుర్తింపు ప్రక్రియలు పూర్తయ్యాయని, 95 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఇంకా గుర్తించని 911 మృతదేహాల వివరాలను పోలీసులు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేశారు.

6,541 మంది సురక్షితంగా  

భద్రతా బలగాలు ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుండి 6,541 మందిని రక్షించాయి. అయితే, ఇంకా 4,858 మంది వివరాలు తెలియాల్సి ఉంది.  వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వరద ప్రభావిత ప్రాంతాల్లో 7,912 మంది సహాయక సిబ్బందిని మోహరించారు. ఈ సిబ్బంది గాలింపు, సహాయక చర్యలు, సహాయ సామాగ్రి పంపిణీ,  మృతదేహాల వెలికితీతలో నిమగ్నమై ఉన్నారు. అధిక నష్టం జరిగిన ప్రాంతాలలో చిక్కుకున్న కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, శిథిలాలతో మూసుకుపోయిన రహదారులను క్లియర్ చేయడం, గాలింపు, సహాయక చర్యలను పోలీసులు, భద్రతా బృందాలు కొనసాగిస్తున్నాయి. 

మహా ఉపద్రవం 

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ గ్లేషియర్ విరిగి పడిన కారణంగా ఆకస్మిక వరద సంభవించింది. ఈ విపత్తు ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక పట్టణాలు, గ్రామాలలో తీవ్ర విధ్వంసం సృష్టించింది. ఈ వరదల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు గల్లంతు అయ్యారు. అనేక ప్రాంతాలలో రోడ్లు, వంతెనలతో సహా కీలకమైన మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

భారత రెస్క్యూ బృందం ఆపరేషన్  

భారతదేశానికి చెందిన ప్రత్యేక సొరంగ సహాయక బృందం రెండు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద రెస్క్యూ ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించిందని నేపాల్‌లోని భారత రాయబారి నవీన్ శ్రీవాస్తవ.. 'ఎక్స్'లో పోస్టు చేశారు. చిలిమేలోని ఒక టన్నెల్‌లో ఆపరేషన్ విజయవంతం అయిందని తెలిపారు. అలాగే లాంగ్‌టాంగ్‌లో 185 మీటర్ల లోతు వరకు గాలింపు కొనసాగుతోందని ఆయన తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో భారత బృందాలు సొరంగ సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని, చిక్కుకుపోయిన వారిని రక్షిస్తున్నారని తెలిపారు. 

మళ్లీ ఆకస్మిక వరదలు 

నేపాల్‌ అధికారులు మంగళవారం.. తూర్పు, మధ్య, పశ్చిమ ప్రాంతాల్లోని పలు జిల్లాలకు వరద హెచ్చరికలు జారీ చేశారు. నదులు, వాగుల సమీపంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన ముందుజాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నువాకోట్, రసువా జిల్లాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రాంతాల్లోని చిన్న నదులు, వాగులలో నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉందని వెల్లడించింది. 

Also Read: నేపాల్ వరద భాదితులకు సద్గురు రూ.1 కోటి విరాళం, 5 దేశాలతో హిమాలయ బోర్డు ఏర్పాటుకు పిలుపు

 21 వేల భద్రతా సిబ్బంది 

నేపాల్ ప్రభుత్వం.. బాధితుల గాలింపు, సహాయక చర్యల కోసం 21,000 మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించింది. ప్రభావిత ప్రాంతాలలో చిక్కుకున్న ప్రజలను తరలించడానికి, సహాయ సామాగ్రిని అందించడానికి హెలికాప్టర్లను రంగంలోకి దించింది. మారుమూల, పర్వత ప్రాంతాలకు చేరుకోవడం, వరద నీరు, శిథిలాలలో చిక్కుకున్న వారిని వెతకడం కోసం భద్రతా దళాలు, సహాయక బృందాలకు పెద్ద సవాలుగా మారింది.

Also Read: నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

19 వంతెనలు, రహదారులు ధ్వంసం  

ఇటీవల వరదలకు నేపాల్ లో రోడ్డు, వంతెనల వ్యవస్థకు తీవ్రంగా నష్టపోయింది. అనేక జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలతో పాటు 19 వంతెనలు కొట్టుకుపోయాయి. ఈ వంతెనలలో ఒకటి నేపాల్, చైనాల మధ్య ఉన్న ప్రధాన వాణిజ్య మార్గం కూడా ఉంది. ఇరు దేశాలను కలిపే రసువాగఢి సరిహద్దు కూడా ప్రభావితమైంది. వరదల అనంతరం నేపాల్‌లో సహాయక, రెస్క్యూ చర్యలు కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతుండగా, కొత్త ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ప్రభుత్వం, భద్రతా దళాలను అప్రమత్తం చేశారు.  

Also Read: నేపాల్-చైనా సరిహద్దుల్లో భూకంపం! పొంచి ఉన్న వరద ముప్పు!

Frequently Asked Questions

నేపాల్‌లో సంభవించిన వరదలకు ప్రధాన కారణం ఏమిటి?

ఆగస్టు 26న నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ గ్లేషియర్ విరిగి పడటం వల్ల ఆకస్మిక వరదలు సంభవించాయి. ఇది ఉత్తర, మధ్య నేపాల్‌లోని అనేక పట్టణాలను ప్రభావితం చేసింది.

ఈ వరదల్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు మరియు ఎంత మంది ఆచూకీ గల్లంతయ్యారు?

బుధవారం నాటికి, వరదల వల్ల 1,127 మంది మరణించారు. ఇంకా 4,858 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

వరద ప్రభావిత ప్రాంతాల నుండి ఎంత మందిని రక్షించారు?

భద్రతా బలగాలు ఇప్పటివరకు వరద ప్రభావిత ప్రాంతాల నుండి 6,541 మందిని సురక్షితంగా రక్షించాయి.

ఈ వరదల కారణంగా మౌలిక సదుపాయాలకు ఎంత నష్టం జరిగింది?

వరదలకు 19 వంతెనలు మరియు అనేక జాతీయ రహదారులు ధ్వంసమయ్యాయి. నేపాల్-చైనా మధ్య ప్రధాన వాణిజ్య మార్గమైన రసువాగఢి సరిహద్దు కూడా ప్రభావితమైంది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Miss World 2027 : మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
మిస్ వరల్డ్ 2027లో పోటీ చేయాలనుకుంటున్నారా? అర్హత, ఎంపిక ప్రక్రియ, ప్రిపరేషన్ వివరాలు ఇవే
UK Student Visa Rules: ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
ఇకపై యూకేలో చదువులు మరింత ప్రియం.. విద్యార్థి వీసా నిబంధనల్లో కీలక మార్పులు!
Iran Attacked America War Ships: హర్మూజ్ జలసంధిలో మరోసారి రణరంగం.. అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు!
హర్మూజ్ జలసంధిలో మరోసారి రణరంగం.. అమెరికా యుద్ధనౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు!
Advertisement

వీడియోలు

Ashish Nehra India Head Coach Rumors | టీమిండియా కోచ్ పోస్ట్ పై నెహ్రా ఫన్నీ కామెంట్స్
KL Rahul Retained By Delhi Capitals IPL 2027 | ఢిల్లీలోనే కేఎల్ రాహుల్.. రూమర్లకు ఎండ్ కార్డ్
Duleep Trophy Final 2026 Vaibhav | దులీప్ ట్రోఫీ ఫైనల్ లో వైభవ్ మైండ్ గేమ్
Gundenininda Gudigantalu Serial September 9 | రోహిణిని బ్లాక్‌మెయిల్ చేసిన గుణ
Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Naidu Family: వెడ్డింగ్ యానివర్శరీ - భువనేశ్వరికి చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమిటో తెలుసా?
వెడ్డింగ్ యానివర్శరీ - భువనేశ్వరికి చంద్రబాబు చేసిన ప్రమాణం ఏమిటో తెలుసా?
Trump Dividend: డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ.. రిపబ్లికన్లు గెలిస్తే ప్రతి అమెరికన్‌కు 5 వేల డాలర్లు
Botsa Satyanarayana Cry: చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
చీపురుపల్లి కార్యకర్తల మధ్య బొత్స భావోద్వేగం - బోరుమన్న సీనియర్ నేత!
Future City Land Allegations: అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
అసెంబ్లీ నుంచి సస్పెండ్ - వీధుల్లోకి బీఆర్ఎస్ - ఫ్యూచర్ సిటీలో భూపోరు - రేవంత్ ఫ్యామిలీనే టార్గెట్
BRS vs Congress 2026 : తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ - రేసులో మళ్లీ వెనుకబడిపోతున్న బీజేపీ!
Chinna Srinu Joined TDP: ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
ఉత్తరాంధ్రలో వారసుల భవిష్యత్ వ్యూహం - వైఎస్‌ఆర్‌సీపీ నుంచి కూటమి వైపు సీనియర్ల క్యూ?
Maremma Review - 'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
'మారెమ్మ' రివ్యూ: రవితేజ సోదరుని కుమారుడు ఎలా నటించాడు? డెబ్యూ సినిమా హిట్టా? ఫట్టా?
YSRCP Local Body Elections : ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
ఏపీ స్థానిక పోరు - వైఎస్‌ఆర్‌సీపీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆవేశం.. కంగారులో క్యాడర్‌ను బలి కోరుతోందా?
Embed widget