అన్వేషించండి

Nepal Flash Floods : నేపాల్ లో మెరుపు వరదలు ప్రకృతి ప్రకోపమా? హిమాలయాలు భారత్‌కు ఇస్తోన్న హెచ్చరికా?

Nepal Floods: నేపాల్ వరదలు ప్రకృతి ప్రకోపమా? ఇకనైనా అప్రమత్తంగా ఉండమని మనకు ఇస్తున్న హెచ్చరికా? సనాతన ధర్మం ఏం చెబుతోంది? ఇకనైనా మేల్కోకుంటే భారత్ కు ఇలాంటి ముప్పు తప్పదా?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నేపాల్-టిబెట్ సరిహద్దులో మంచుకొండ విరిగి సునామీలా ముంచెత్తింది.
  • గ్రామాలు, వంతెనలు కొట్టుకుపోయి, వందల ప్రాణాలు గల్లంతయ్యాయి.
  • ఇది ప్రకృతి ఇచ్చిన తీవ్ర హెచ్చరిక; మానవ చర్యలు కారణం.
  • ప్రకృతిని గౌరవించి, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలి.

Nepal Flash Floods: నేపాల్-టిబెట్ సరిహద్దు దగ్గర ఓ మంచు కొండ విరిగిపడింది. హిమనీనది కూలిపోవడంతో మట్టి, రాళ్లు, మంచు, నీరు కలపి సునామీలా దూసుకొచ్చాయ్. భోటేకోషి, త్రిశూలి నదులు అకస్మాత్తుగా ఉగ్రరూపం దాల్చి గ్రామాలను, పట్టనాలను, వంతెనలను, హైడ్రోపవర్ ప్రాజెక్టులను ముంచెత్తాయ్. వందలమంది ప్రాణాలు కోల్పోయారు, వేలమంది ఆచూకీ ఇంకా దొరకలేదు. కొన్ని శవాలు భారత్ నదుల్లోనూ కనిపించాయ్. ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం కాదు..ప్రకృతి మనకిచ్చిన హెచ్చరిక.

హిమాలయాలు కేవలం మంచు కొండలు మాత్రమేకాదు..అవి పరమేశ్వరుడి జటాజూటం నుంచి జన్మించిన పవిత్ర ప్రదేశం.
గంగానది అవతరించింది ఇక్కడే
ఎందరో మహర్షులు తపస్సు ఆచరించింది ఇక్కడే
ఈ పవిత్రప్రదేశంలో దేవతలు విహరిస్తారని పురాలు చెబుతున్నాయ్

ఇంత పవిత్రమైన ప్రదేశంలో ఇప్పుడేం జరిగింది?
హిమనది విరిగిపడింది, మట్టి రాళ్లు నీరు కలసి ఉగ్రరూపం దాల్చి గ్రామాలను గ్రామాలను తుడిచిపెట్టేశాయ్, ఎన్నో ప్రాణాలు అనంతవాయువుల్లో కలసిపోయాయి. వేలమంది జాడ కనిపించడం లేదు. సహాయకచర్యలు కొనసాగుతూనే ఉన్నాయ్. కొన్ని శవాలు భారతదేశంలో నదుల్లోనూ కనిపించాయ్. 

September 2026 Weather: సెప్టెంబర్‌లో భారీ వర్షాలు, ఈ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది!

ఇది కేవలం ప్రకృతి వైపరీత్యమా? ప్రకృతి ఇచ్చిన గంభీరమైన హెచ్చరికా?
 
సనాతనధర్మం ప్రకృతిని ఎప్పుడూ తల్లిగా భావించింది. అందుకే భూమాత, వనదేవత, నదీమతల్లి, వాయుదేవుడు, అగ్ని దేవుడు, వానదేవుడు అంటూ అన్నింటినీ దైవస్వరూపంగా పూజిస్తారు. 

“మాతా భూమిః పుత్రోహం పృథివ్యాః” 

భూమి నా తల్లి...నను ఆమె కొడుకుని అని అర్థం

తల్లిలాంటి భూమిని ఇప్పుడెలా చూస్తున్నాం?
అడవలు నరికేస్తున్నాం
హిమనదులు వేడెక్కించేలా వాతావరణాన్ని కలుషియం చేస్తున్నాం
నదులను మురుగు కాలువలుగా మారుస్తున్నాం
కొండల్లో అనవసర నిర్మాణాలు చేసి గాయపరుస్తున్నాం

Nepal Flood 2026: నేపాల్ వరద 2026 , సెప్టెంబరులో హిమాలయ నదులకు ముప్పు? జ్యోతిష్య అంచనాలతో ఆందోళన!

ప్రకృతి సహనం అనంతమే కానీ ఓర్పు దాటితే ఆ కోపం ఇలా వ్యక్తమవుతుందంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు..పురాణాల్లో ఇలాంటి హెచ్చరికలు ఎన్నో ఉన్నాయ్.

రాజులు, ప్రజలు ధర్మం మరిచి ప్రకృతిని అవమానించినప్పుడు వర్షాలు కురవలేదు
నదులు ఎండిపోయాయ్
భూకంపాలు వచ్చాయ్
ఇప్పుడు జరుగుతున్నది అదే..

హిమాలయాల్లో హిమనదులు కరుగుతున్నాయ్
గ్లేసియల్‌ లేక్స్ ఉబ్బి పగిలిపోతున్నాయ్
ఇది కేవలం సైన్స్ కాదు..ధర్మం దారితప్పుతోందని ప్రకృతి ఇస్తోన్న హెచ్చరిక

భారత్ కు ఈ ముప్పు ఎంత దగ్గరగా ఉందో గమనించాలి
నేపాల్ నదులు...గంగా, యమునా, బ్రహ్మపుత్రలో కలుస్తాయి..
ఓ వైపు హిమాలయాలు ధ్వంసమైతే మరోవైపు ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు కూడా అదే బాధ అనుభవించాల్సి వస్తుంది. 

గంగమ్మను ఇప్పటికీ పూజిస్తున్నాం కానీ అందులో మురుగు కలుపుతున్నాం..కాశీలో, హరిద్వార్ లో పుణ్యస్నానాలు ఆచరిస్తూనే కలుషితం చేస్తున్నాం.  

ప్రకృతిని గౌరవించడం అంటే దైవాన్ని గౌరవించడమే. తులసి మొక్కను పూజిస్తున్నట్టే..ప్రతి చెట్టు, ప్రతి నది, ప్రతి కొండను గౌరవించాలి.   

“వృక్షో రక్షతి రక్షితః” 

చెట్టును రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది. అందుకే ప్రకృతిపట్ల భక్తి ఉండాలి. అడవుల నరికివేతను అడ్డుకోవాలి, నదులను శుద్ధి చేయాలి, అనవర నిర్మాణాలు ఆపాలి, వాతావరణంలో మార్పులు తగ్గించేలా జీవనశైలి మార్చుకోవాలి. ఇవి కేవలం పర్యావరణ కర్తవ్యాలు కాదు ధర్మ కర్తవ్యాలు. 

నేపాల్ ప్రజల బాధను మనం మన బాధగా భావించాలి
వారికి సహాయం చేయాలి..అదే సమయంలో మనం మేల్కోవాలి..ప్రకృతిని గౌరవించాలి


 

Frequently Asked Questions

నేపాల్‌లో ఇటీవల ఏ ప్రకృతి విపత్తు సంభవించింది?

నేపాల్-టిబెట్ సరిహద్దులో మంచు కొండ విరిగిపడటంతో హిమనీనది కూలిపోయింది. మట్టి, రాళ్లు, మంచు, నీరు సునామీలా దూసుకొచ్చి భోటేకోషి, త్రిశూలి నదులను ఉగ్రరూపం దాల్చేలా చేశాయి.

నేపాల్‌లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల కలిగిన నష్టం ఎంత?

ఈ వరదల కారణంగా గ్రామాలు, పట్టణాలు, వంతెనలు, హైడ్రోపవర్ ప్రాజెక్టులు మునిగిపోయాయి. వందల మంది ప్రాణాలు కోల్పోగా, వేల మంది జాడ తెలియడం లేదు. కొన్ని శవాలు భారత్‌లోని నదుల్లో కూడా కనిపించాయి.

ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలకు మానవ కార్యకలాపాలు ఎలా కారణమవుతున్నాయి?

అడవుల నరికివేత, వాతావరణ కాలుష్యం వల్ల హిమనదులు వేడెక్కడం, నదులను కలుషితం చేయడం, కొండలపై అనవసర నిర్మాణాలు చేపట్టడం వంటివి ప్రకృతిని గాయపరుస్తున్నాయి.

ఈ ఘటన భారత్‌కు ఒక హెచ్చరికగా ఎందుకు పరిగణించబడుతోంది?

నేపాల్ నదులు గంగా, యమునా, బ్రహ్మపుత్ర నదులలో కలుస్తాయి. హిమాలయాలు ధ్వంసమైతే ఉత్తరాఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్, అస్సాం ప్రజలు కూడా తీవ్రంగా ప్రభావితమవుతారు.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: ధనుస్సు, మీనానికి అదృష్టం; మకరం, కుంభానికి కష్టాలు!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8 దీపావళి రాశిఫలాలు: సింహ, వృశ్చిక రాశులకు శుభం, కన్య, తుల రాశులకు జాగ్రత్త!
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8, 2026 రాశిఫలాలు: దీపావళి రోజు మేషం, వృషభం, మిథునం, కర్కాటకం ఎవరికి అదృష్టం? ఎవరికి కష్టం?
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!
నవంబర్ 8-14 వారఫలం: కుంభ, మీన రాశులకు ధనయోగం, ప్రేమలో విజయం!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Gurnoor Brar Magic:  టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. డ‌క్ వ‌ర్త్ సిస్టమ్ తో గ‌ట్టెక్కిన గిల్ సేన‌.. ఆక‌ట్టుకున్న శ్రేయ‌స్, రాహుల్, గుర్నూర్..
MPTC Election Results: చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
చనిపోయినా విజయీభవ.. ఎన్నికల్లో నెగ్గిన జనసేన ఎంపీటీసీ అభ్యర్థి
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్‌ను ఖండించిన మాజీ సీఎం జగన్
Illegal Defense Liquor Racket: భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
భర్తలు తెస్తారు.. భార్యలు అమ్మేస్తారు! అల్వాల్‌లో డిఫెన్స్ మద్యం అక్రమ దందా రట్టు
Ponnam Prabhakar: హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్‌లో ఇందిరమ్మ ఇంట్లో ఘనంగా దీపావళి వేడుకలు.. పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
TGSRTC కార్మికులను నేలపై కూర్చోబెట్టి అవమానం! సిద్దిపేట డీఎంపై మంత్రి పొన్నం ఆగ్రహం
Misuse of RTI Act: మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
మాజీ ప్రేయసి ఎంత మందిని ప్రేమించింది.. 1886 ప్రశ్నలతో ఆర్టీఐ దరఖాస్తులు.. యువకుడికి సమాచార కమిషన్ షాక్!
MLC Mirza Rahmat Extortion: మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
మీ వీడియోలు పోస్టు చేస్తామని ఎమ్మెల్సీకి బెదిరింపులు... రూ.5 కోట్లు డిమాండ్, ఆరుగురి అరెస్ట్
Embed widget