అన్వేషించండి

Nepal Flash Floods: నేపాల్ వరద: 626 మంది మృతి.. ఇంకా 2400 మంది గల్లంతు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

నేపాల్‌లో వచ్చిన వినాశకర వరదల కారణంగా సంభవించిన మరణాల సంఖ్య 600 దాటింది. అలాగే ఇంకా 2400 మంది ఆచూకీ లభించలేదని అధికారులు తెలిపారు.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నేపాల్‌ ఉత్తర ప్రాంతంలో హిమనీనదం విరిగి భారీ వరదలు వచ్చాయి.
  • వరదల్లో 675 మంది మరణించగా, 2500 మందికి పైగా రక్షించబడ్డారు.
  • New York Times విడుదల చేసిన వీడియో విస్ఫోటనాన్ని స్పష్టంగా చూపింది.
  • భారత్‌తోపాటు ఇతర దేశాల నుండి నేపాల్ సహాయం అందుకుంటోంది.

నేపాల్‌లోని భోటేకోషీ నదికి వచ్చిన విధ్వంసకర వరదల్లో ఇప్పటివరకు 626 మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. గల్లంతైన 2400 మంది ఆచూకీ కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్‌ లో నేపాల్ ప్రభుత్వం భారత్ సహాయం కోరింది. తాజాగా New York Times ఒక ఎక్స్‌క్లూజివ్ వీడియోను విడుదల చేసింది. అందులో మంచుకొండలు విరిగిపోతున్న దృశ్యం కనిపిస్తోంది.

తన రిపోర్టులో ఈ వీడియోను విడుదల చేస్తూ New York Times, ఈ వెరిఫైడ్ వీడియోలో టిబెట్ సమీపంలోని ఉత్తర నేపాల్‌లో జరిగిన హిమపాతం, విస్పోటనానికి సంబంధించిన ఇప్పటివరకు అత్యంత స్పష్టమైన వీడియో కనిపిస్తోందని పేర్కొంది. దాని కింద నదులు, లోయల వైపు నీరు- మట్టి గోడలు ఉన్నాయి.  హిమాలయాల ఎత్తయిన ప్రాంతాల్లో లాంగ్‌టాంగ్ లిరుంగ్ సమీపంలో అకస్మాత్తుగా జరిగిన భారీ హిమనదం, మంచు కొండ కూలిపోవడం అంటే అవలాంచ్ జరిగింది. దాని కారణంగా భారీగా మట్టి, రాళ్ల మలినాలు భోటెకోషీ నదికి ఉపనది అయిన లెండే ఖోలా లో పడిపోవడంతో ఈ వరద వచ్చింది.

NYT తన రిపోర్టులో.. టూర్ గైడ్ జిహాయితీ, వారి హైకర్ల బృందం బుధవారం ఉదయం టిబెట్‌లోని ఒక ఆబ్జర్వేషన్ డెక్‌పైకి ఎక్కారు. అక్కడి నుంచి నేపాల్ సరిహద్దు అవతల మంచుతో కప్పిన పర్వతాలు కనిపిస్తున్నాయి. ఉదయం పొగమంచులో ఒక బ్రేక్ త్సాంగ్బూ రీ అద్భుత శిఖరం, హిమనదాన్ని చూపించింది. వారు తమ కెమెరాలను తీసి చిత్రీకరిస్తుండగా, హైకర్లు ఒక పెద్ద గర్జన లాంటి శబ్ధాన్ని విన్నారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

పేలుడు పదార్థాలు పేలుతున్నట్లుగా అనిపించింది

రిపోర్టులో ఇంకా చెప్పినదాని ప్రకారం, వారు ఆ శబ్దాలను పిడుగులు పడుతున్నట్లుగా భావించారు. ఆ తర్వాత టిబెట్‌లో ఉదయం 10:50 గంటల తర్వాత లోయలో ఒక భారీ చీలిక శబ్దం వినిపించింది. జిహా మాట్లాడుతూ.. పర్వతాల లోపలే పేలుడు పదార్థాలు పేలుతున్నట్లుగా అనిపించిందని తెలిపారు. మొదట శబ్దం వచ్చిన తర్వాత కూడా కొన్ని నిమిషాల పాటు వారు అక్కడ ఉన్నారు. మంచు ముక్క విరిగి పడటానికి ముందు, తర్వాత హైకర్ల ఫుటేజ్‌ను పోల్చితే, దాని పరిమాణానికి సంబంధించిన ఇప్పటివరకు అత్యంత స్పష్టమైన దృశ్యం లభిస్తోంది. 

ఇప్పటివరకు ఎంత మంది చనిపోయారు.. 

నేపాల్ నేషనల్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ అండ్ మేనేజ్‌మెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు నేపాల్‌లో మరణించిన వారి సంఖ్య శనివారం రాత్రి నాటికి 675కి పెరిగింది. ఇందులో నేపాల్, భారతీయులతో పాటు విదేశీయులు కూడా ఉన్నారు. ఇప్పటివరకు ఈ విపత్తులో కనీసం 2498 మందిని రక్షించారు. అదే సమయంలో 219 మంది తీవ్రంగా గాయపడ్డారు. 

250కి పైగా విదేశీ పౌరులను రక్షించారు

నేపాల్ టూరిజం బోర్డు తెలిపిన ప్రకారం ఈ ప్రమాదంలో 250కి పైగా విదేశీ పౌరులను రక్షించారు. బోర్డు ప్రకారం, 261 విదేశీ పౌరులను రక్షించారు. ఇంకా 320 మంది ఇంకా ఆచూకీ తెలిసిరాలేదు. కాపాడిన విదేశీ పౌరుల్లో బెల్జియం, ఒమాన్‌, బల్గేరియా, పోర్చుగల్ చెందిన ఒక్కొక్క పౌరుడు, చైనా నుంచి 40 మంది, జర్మనీ నుంచి 4 మంది, భారత్‌ నుంచి అత్యధికంగా 167 మంది, ఉక్రెయిన్‌కు చెందిన 8 మంది, అమెరికాకు చెందిన 3 మంది, ఇటలీ, స్పెయిన్, టర్కీ, స్విట్జర్లాండ్‌కు చెందిన ఇద్దరు పౌరులు ఉన్నారు. వీటితో పాటు 21 మంది విదేశీ పౌరుల గుర్తింపు ఇంకా నిర్ధారణ కాలేదు. గాలింపు చర్యలకు సహాయం కోసం 18,700కి పైగా రక్షణ సిబ్బందిని మోహరించినట్లు NDRRMA తెలిపింది.

భారత్ నుంచి టన్నెల్ రక్షణ కోసం 11 మంది టెక్నికల్ టీం 

భారత్ నుంచి టన్నెల్ రక్షణ కోసం 11 మంది సభ్యులతో కూడిన ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని పంపినట్లు నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సమాచారం ఇచ్చింది. ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న జీవించి ఉన్న వారిని గుర్తించడానికి ప్రత్యేక సాంకేతికత, వేగవంతమైన ఫోరెన్సిక్, డీఎన్‌ఏ పరీక్షలు, వెలికితీసిన మృతదేహాలను ఉంచడానికి మార్చురీ సదుపాయాల సహాయం కోరింది. రాసువా, ధాడింగ్, నువాకోట్, చిత్వన్‌లో రక్షణ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి.

అధికారికంగా ధృవీకరించిన సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు నేపాల్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత్ నుంచి 57 టన్నులకుపైగా సహాయ సామగ్రి అందినట్లు నేపాల్ తెలిపింది. మిగతా ఇతర దేశాల నుంచి పంపిన అవసరమైన వస్తువులు అందుతున్నాయి. 

Frequently Asked Questions

నేపాల్‌లో వరదలకు ప్రధాన కారణం ఏమిటి?

హిమాలయాల్లో భారీ హిమనదం విరిగిపడటం, మట్టి, రాళ్ల మలినాలు భోటెకోషీ నది ఉపనది అయిన లెండే ఖోలాలో పడటంతో ఈ వరదలు సంభవించాయి.

ఈ విపత్తులో ఎంతమంది చనిపోయారు, ఎంతమంది గల్లంతయ్యారు?

నేపాల్‌లో ఈ విపత్తులో ఇప్పటివరకు 675 మంది మరణించారు. 2400 మంది గల్లంతైనట్లు భావిస్తున్న వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

నేపాల్‌కు భారతదేశం ఏ విధంగా సహాయం చేస్తోంది?

గల్లంతైన వారిని వెతకడానికి భారత్ నుంచి సహాయం కోరగా, 11 మందితో కూడిన ప్రత్యేక టెక్నికల్ బృందాన్ని, 57 టన్నులకుపైగా సహాయ సామగ్రిని పంపింది.

ఈ సంఘటనకు సంబంధించిన స్పష్టమైన దృశ్యాలు అందుబాటులో ఉన్నాయా?

అవును, New York Times విడుదల చేసిన ఎక్స్‌క్లూజివ్ వీడియోలో టిబెట్ సమీపంలోని ఉత్తర నేపాల్‌లో జరిగిన హిమపాతం, విస్ఫోటనానికి సంబంధించిన స్పష్టమైన దృశ్యాలు ఉన్నాయి.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Prince Williams Batting: ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
ముంబైలో గల్లీ క్రికెట్ ఆడిన ప్రిన్స్ విలియం దంపతులు.. కీపింగ్ చేస్తూ సచిన్ సందడి
Xi Trump Putin summit: జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
జిన్‌పింగ్ ట్రంప్ పుతిన్ త్రైపాక్షిక భేటీ.. 'న్యూ యాల్టా' సమావేశం పట్ల చైనా తర్జనభర్జనలు!
SpaceX Starship Flight 15: అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
అంతరిక్ష చరిత్రలో స్పేస్ఎక్స్ మరో రికార్డు.. భూమికి తిరిగొచ్చిన స్టార్‌షిప్ రాకెట్‌ను చాప్‌స్టిక్స్‌తో క్యాచ్!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Bellampalli Police Video: బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
బెల్లంపల్లి పోలీసుల ఫామ్ హౌస్ పార్టీ కలకలం.. రామగుండం సీపీ విచారణకు ఆదేశం
Harish Rao: కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
కాంగ్రెస్ మేనిఫెస్టోకు మూడేళ్లు.. అభయహస్తం మొండి హస్తంగా మారింది- హరీష్ రావు విమర్శలు
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Shubman Gill Strategy:  కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
కివీస్ తో తొలి టెస్టుకు కెప్టెన్ గిల్ మాస్టర్ ప్లాన్.. ఆ ఫార్ములాతో బరిలోకి టీమిండియా,  పంత్ ఫామ్‌పై కీలక ప్రకటన
Amaravati Financial Plan: అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
అమరావతి నిర్మాణానికి 20 ఏళ్ల ఆర్థిక ప్రణాళిక.. రూ. 27,954 కోట్ల ఆర్థిక లోటు.. నిధుల కోసం ఉన్నత స్థాయి కమిటీ!
Khairatabad By-Election Suspense: ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
ఖైరతాబాద్ ఉపఎన్నిక ఉంటుందా, ఉండదా? విజయారెడ్డి పిటిషన్‌కు చింతల రామచంద్రారెడ్డి చెక్ పెడతారా?
Rahul Gandhi Fake Name: మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
మారు పేరుతో రాహుల్ గాంధీని చదివించా.. రాజీవ్ గాంధీ హత్య రోజులను గుర్తుచేసుకున్న సోనియా గాంధీ
Cyclone Akvan: తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
తుపానుగా బలపడిన తీవ్ర వాయుగుండం, పలు జిల్లాలకు మరో ముప్పు.. మత్స్యకారులకు వార్నింగ్
Embed widget