అన్వేషించండి

Nepal Floods: మృతదేహాల దిబ్బగా నేపాల్‌! టిబెట్‌లో వాస్తవ పరిస్థితి బయటపెట్టని చైనా!

Nepal Floods: వరదలు నేపాల్, టిబెట్‌లలో పెను విధ్వంసం సృష్టించాయి, కానీ రెండు ప్రాంతాల నుంచి వస్తున్న రిపోర్ట్స్‌లో చాలా తేడా కనిపిస్తోంది. అంటే నిజాలు దాచి పెడుతున్నట్టు అర్థమవుతోంది.  

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • నేపాల్, టిబెట్‌లో వరదల వినాశనం; సమాచార వ్యత్యాసం స్పష్టం.
  • నేపాల్ 579 మరణాలు నివేదించగా, టిబెట్‌లో ఐదు మాత్రమే.
  • నేపాల్‌ సమగ్ర సమాచారం; చైనా టిబెట్‌పై కఠిన నియంత్రణ.
  • జాతీయ భద్రత దృష్ట్యా టిబెట్ సమాచారానికి చైనా కట్టుబాటు.

Nepal Floods: వినాశకరమైన వరదలు నేపాల్, టిబెట్‌లలో భారీ విధ్వంసాన్ని సృష్టించాయి. అయితే, ఈ రెండు ప్రాంతాల నుంచి వస్తున్న సమాచారంలో అంతకంటే ఎక్కువ వ్యత్యాసాలు ఉన్నాయి. ఖాట్మాండు నుంచి వస్తున్న నివేదికలు నేపాల్‌లోని విధ్వంసంపై స్పష్టమైన చిత్రాన్ని అందిస్తుండగా, టిబెట్ వంటి సున్నితమైన ప్రాంతాల నుంచి వచ్చే సమాచారంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. ఇక్కడి నుంచి వచ్చే సమాచారంపై చైనా గట్టి నియంత్రణ పెట్టినట్టు స్పష్టమవుతోంది. దీనివల్ల అక్కడి వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడం, సమాచారాన్ని స్వతంత్రంగా ధృవీకరించుకోవడం కష్టంగా మారింది.

నేపాల్‌లో మృతుల సంఖ్య -579, చైనాలో ఐదు మాత్రమే 

నేపాల్, టిబెట్ సరిహద్దు గ్రామాలలో వరదలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. నేపాల్‌లో వరదల కారణంగా అధికారిక మృతుల సంఖ్య శుక్రవారం నాటికి 579కి పెరగ్గా, చైనాలో మృతుల సంఖ్య కేవలం ఐదు మాత్రమేనని 'ది గార్డియన్' నివేదించింది.

టిబెట్ వైపున ఉన్న గిరాంగ్ సరిహద్దు పోస్టు చుట్టూ ఉన్న గ్రామాల్లో వేలాది మంది ప్రజలు నివసిస్తున్నందున, ఈ వ్యత్యాసం ప్రశ్నలను లేవనెత్తుతోంది. చైనా నివేదించిన తక్కువ మరణాల సంఖ్యకు, ఆ ప్రాంతంలో జరిగిన విస్తృత విధ్వంసానికి మధ్య ఉన్న వ్యత్యాసంపై అనుమానం కలిగిస్తోంది. 

నేపాల్‌లో సమగ్ర సమాచారం లభ్యం  

నేపాల్‌లో, పాత్రికేయులు విపత్తు ప్రభావిత ప్రాంతాలకు వీలైనంత దగ్గరగా వెళ్లి, ప్రాణాలతో బయటపడినవారిని, సహాయక సిబ్బందిని ఇంటర్వ్యూ చేశారు. దీనివల్ల వరదల సమయంలో ఏం జరిగిందనే దానిపై మరింత వివరమైన చిత్రం లభించింది.

స్థానికుల కథనాల ఆధారంగా, వరద నీరు ఇళ్లలోకి ఎలా ప్రవేశించి ప్రజలను ముంచెత్తిందో తెలియజేస్తూ, దాదాపు మినిట్‌ టు మినిట్‌ వారీగా జరిగిన ఘటనల వివరాలు వెల్లడయ్యాయి. అయితే, వరదలకు కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు, శాస్త్రవేత్తలు దాని కారణాలను అధ్యయనం చేస్తున్నారు.

సహాయక, రక్షణ చర్యలపై చైనా దృష్టి 

ది గార్డియన్ కథనం ప్రకారం, చైనా ప్రభుత్వ మీడియా వరదల గురించి అనేక కథనాలను ప్రసారం చేయడమే కాకుండా, ప్రభావిత ప్రాంతాలకు జర్నలిస్టులను కూడా పంపింది. అయితే, ఈ నివేదికలు ప్రధానంగా సహాయక, రెస్క్యూ కార్యకలాపాలపైనే దృష్టి సారించగా, వాస్తవ విధ్వంసం తీవ్రత మాత్రం అస్పష్టంగానే మిగిలిపోయింది. టిబెట్‌లోని ఒక సహాయ కేంద్రం నుంచి ప్రసారం చేస్తున్న జర్నలిస్ట్ తన వెనుక కూర్చున్న వారిలో ఎవరితోనూ మాట్లాడలేదని ఆ నివేదిక పేర్కొంది.

టిబెట్‌లో సమాచారంపై కఠినమైన నియంత్రణలు 

చైనా కట్టుదిట్టమైన నియంత్రణలో ఉన్న ప్రాంతాల్లో టిబెట్ ఒకటి. గతంలో, అధిక స్వయంప్రతిపత్తి, మత స్వేచ్ఛను కోరుతూ టిబెటన్లు అనేక నిరసనలు చేపట్టారు, వీటిని చైనా అధికారులు అణచివేశారు. అంతర్జాతీయ జర్నలిస్టులను సాధారణంగా టిబెట్‌లో స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతించరు, వారి పర్యటనలు ప్రధానంగా ప్రభుత్వమే నిర్వహించి, నియంత్రిస్తుంది.

నివేదిక ప్రకారం, చాలా మంది టిబెటన్లకు పాస్‌పోర్ట్‌లు కలిగి ఉండటానికి అనుమతి లేదు  జర్నలిస్టులతో మాట్లాడినందుకు శిక్షను ఎదుర్కోవలసి రావచ్చు. లండన్ విశ్వవిద్యాలయంలోని SOASలోని చైనా ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ స్టీవ్ త్సాంగ్, టిబెట్‌కు సంబంధించిన ప్రతి విషయాన్ని జాతీయ భద్రతా దృక్కోణం నుంచే చూస్తారని 'ది గార్డియన్' పత్రికకు తెలిపారు. దీని కారణంగా, ఉన్నత స్థాయిలో ఆమోదం పొందని ఏ సమాచారం లేదా నివేదిక బయటకు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

Frequently Asked Questions

నేపాల్ మరియు టిబెట్‌లో వరదల సమాచారంలో ఇంత వ్యత్యాసం ఎందుకుంది?

నేపాల్‌లో పాత్రికేయులకు పూర్తి స్వేచ్ఛ ఉండగా, టిబెట్‌లో చైనా ప్రభుత్వం సమాచారంపై కఠినమైన నియంత్రణలు విధించడం వల్ల ఈ వ్యత్యాసం ఏర్పడింది. ఇది అక్కడి వాస్తవ పరిస్థితిని తెలుసుకోవడం కష్టతరం చేస్తోంది.

నేపాల్‌లో వరదల కారణంగా ఎంత మంది మరణించారు?

శుక్రవారం నాటికి, నేపాల్‌లో వరదల వల్ల అధికారికంగా 579 మంది మరణించినట్లు నివేదించబడింది.

టిబెట్‌లోని వరదల గురించి ఖచ్చితమైన సమాచారం పొందడం ఎందుకు కష్టంగా ఉంది?

టిబెట్ చైనా ప్రభుత్వ కఠిన నియంత్రణలో ఉంది. అంతర్జాతీయ జర్నలిస్టులను స్వతంత్రంగా పనిచేయడానికి అనుమతించరు, మరియు స్థానికులు జర్నలిస్టులతో మాట్లాడితే శిక్షకు గురయ్యే అవకాశం ఉంది.

టిబెట్‌లోని వరదల గురించి చైనా మీడియా ప్రధానంగా దేనిపై దృష్టి సారించింది?

చైనా ప్రభుత్వ మీడియా వరదల గురించి అనేక కథనాలను ప్రసారం చేసినప్పటికీ, అవి ప్రధానంగా సహాయక, రెస్క్యూ కార్యకలాపాలపైనే దృష్టి సారించాయి. విధ్వంసం యొక్క తీవ్రత అస్పష్టంగానే మిగిలిపోయింది.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Bangladesh Violence: బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
బంగ్లాదేశ్‌లో భగ్గుమన్న రాజకీయ హింస.. మంత్రి ఇంటిపై బాంబు దాడి, ఎంపీ ఇంటికి నిప్పు!
Mens Day 2026 Wishes : హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
హ్యాపీ మెన్స్ డే 2026.. మీ జీవితంలోని స్పెషల్ Menకి ఫేస్​బుక్, వాట్సాప్​​లలో ఇలా విషెష్ చెప్పేయండి
US Military Aircraft Attack: గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
గొడ్డలితో రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానం ధ్వంసం.. ఐర్లాండ్‌ ఎయిర్‌పోర్టులో కలకలం!
US Federal Court Visa Ruling: ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
ట్రంప్‌నకు బిగ్ షాక్.. విదేశీ విద్యార్థులు, జర్నలిస్టులకు భారీ ఊరట.. వీసా ఆంక్షలు ఆర్డర్ కొట్టివేసిన ఫెడరల్ కోర్టు!
Advertisement

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
ABP Southern Rising Summit: కేసీఆర్ ఓ రావణాసురుడు, కేటీఆర్‌ను అసలు పోటీనే కాదు: సీఎం రేవంత్ రెడ్డి
Rekha Naik House ED Raids: రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
రూ.40.96 కోట్ల రైస్ మిల్లు స్కామ్.. మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్‌కు ఈడీ షాక్!
Pollution Certificate: పొల్యూషన్ రూల్స్‌ పాటించని 17,000కు పైగా వాహనాలు సీజ్.. దాదాపు 26,000 ట్రాఫిక్‌ చలాన్లు జారీ, జర జాగ్రత్త!
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే తప్పదు 'జరిమానా'.. 17 రోజుల్లోనే దాదాపు 26,000 చలాన్లు జారీ
KTR On CM Revanth Reddy: 'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
'చిన్నగా ఉన్నా ఆయన మా ముఖ్యమంత్రి..నూకేయకండి- సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ వ్యంగ్య వ్యాఖ్యలు
Aakasamlo Oka Tara OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Kolathur MLA VS Babu Passes Away: తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
తమిళనాడులో విషాదం.. స్టాలిన్‌ను ఓడించిన జెయింట్ కిల్లర్ టీవీకే ఎమ్మెల్యే వి.ఎస్. బాబు కన్నుమూత!
Polavaram Maoist Dump:చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల భారీ డంప్ స్వాధీనం.. భారీగా పేలుడు పదార్థాలు లభ్యం
Rahul Gandhi US Remarks Row: అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
అమెరికా వేదికగా రాహుల్ గాంధీ విమర్శలు - దేశానికి వ్యతిరేకమన్న బీజేపీ - జీడీపీ గణాంకాలతో కౌంటర్!
Embed widget